Suryaa.co.in

Andhra Pradesh

బండెక్కిన సవితమ్మ

-పెనుగొండ మున్సిపాలిటీనీ ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా
-సచివాలయ సిబ్బందిచే జూలై 1వ తేదీ నుంచి ఇంటి వద్దకే సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ
-రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు చేనేత జౌళి శాఖ మంత్రివర్యులు సవితమ్మ

పెనుగొండ, జూన్ 26:పెనుగొండ మున్సిపాలిటీ నీ ఆదర్శవంతంగా తీర్చిదిద్దడం జరుగుతుంది అనిరాష్ట్ర బీసీ సంక్షేమ మరియు చేనేత జౌళి శాఖ మంత్రివర్యులు సవితమ్మ పేర్కొన్నారు. బుధవారం పెనుగొండ మున్సిపాలిటీ నందు స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా 45లక్షల రూపాయలు కొనుగోలు చేసినకొత్త compact Vehical కి వాహన పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రివర్యులు స్వయంగా వాహనం నడిపారు.

అనంతరం పత్రిక సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. పెనుగొండ నగర పంచాయతీని పట్టణ ప్రజల సహకారంతో ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేస్తానని తెలిపారు. పెనుగొండ పట్టణంలో భవిష్యత్తులో చేపట్టబోతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు సహకరించాలన్నారు.

పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరిపై ఉన్నదని తెలిపారు. పెనుగొండ చెత్త నిర్మూలన కొరకు ఇప్పటివరకు 80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఈరోజు నా చేతుల 50 లక్షల రూపాయలతో కొనుగోలు చేసి compact Vehical నా చేతుల మీదుగా పూజ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. మంత్రిగా నా చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించడం మంచి శుభ పరిణామం అన్నారు.

సుమారు 1100 కేజీలు సామర్థ్యం కలిగిన తడి చెత్త పొడి చెత్త నిల్వ చేయడానికి యంత్రాలు కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. క్లోజ్డ్ వాహనాల ద్వారా చెత్త రవాణా చేస్తున్నారు. ఈ మున్సిపాలిటీ నందు పారిశుద్ధ్యం, ఘన వ్యర్ధాల నిర్వహణ, తాగునీరు అంశాలకు తగిన ప్రాధాన్యంతో కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో పెనుగొండ పట్టణ ప్రజలు నాకు అండగా నిలిచారని. ఒకవైపు మంత్రిగా, ఒకవైపు నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించడానికి చర్యలు చేపడతానని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాకు మంత్రి పదవి ఇచ్చి ఆయన ఇచ్చిన ఈ శాఖను సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

జూలై ఒకటో తేదీ నుంచి నాలుగో తేదీ వరకు ఇంటి వద్దకే గ్రామ వార్డు సచివాల సిబ్బంది ఆధ్వర్యంలో, సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేయడానికి ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతూ ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్ పర్సన్ ఫరూక్, కమిషనర్ వంశీకృష్ణ భార్గవ, ఇతర పార్టీ అధికారులు, మున్సిపాలిటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE