టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి
వచ్చేది తెలుగుదేశమే. మూడేళ్ల జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారు. మనపై పెడుతున్న కేసులు నిలవవు.కొట్టుకుపోతాయి. తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు రోడ్లపైకి రావాల్సిన సమయం ఆసన్నమైంది. వైసీపీ ప్రభుత్వ పాలన వైఫల్యాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరవేయడంలో నా వంతు కృషి నేను చేస్తున్నాను. ఇటీవల నేను అమెరికా వెళ్లాను. 10 వేల మందిని ప్రత్యక్షంగా , కొన్ని వేలమందిని పరోక్షంగా కలిశాం. 30 దేశాల వారితో జూమ్ ద్వారా మాట్లాడాం. లక్షలాది ఎన్ ఆర్ ఐలు ఒకటే మాట చెప్పారు. అదేమంటే చంద్రబాబు గారి లేని లోటు మాకు తెలుస్తోందని, సొంత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి అక్కడే స్థిరపడదామని మేము అనుకున్నప్పటికీ జగన్ రెడ్డి దుర్మార్గ పాలన వల్ల ఆ ఆలోచన విరమించుకున్నామని వారు చెప్పారు. ఒకప్పుడు అగ్ర కులాల వారు విదేశాలు వెళ్లేవారు. ఇప్పడు అన్ని సామాజిక వర్గాల వారు విదేశాల్లో ఉన్నారు. నాడు చంద్రబాబు గారు హైదరాబాద్ ను అభివృద్ధి చేశారని, ఆయన దూరదృష్టి ఫలితంగానే అనేక కళాశాలలు వచ్చి మేము ఉన్నత చదువులు చదువుకుని విదేశాలు రాగలిగామని ఎన్ ఆర్ ఐలు గర్వంగా చెప్పారు. నా వయసు 77 సంవత్సరాలు.
చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే వరకూ తగ్గేదిలే. ఇటీవల చంద్రబాబు గారు మాట్లాడుతూ…ఎంతమంది నాయకులు ప్రజల్లో తిరుగుతున్నారని అడిగారు. నిజమే కదా అనిపించింది. నాయకుడు కదిలితే కార్యకర్తలు చురుగ్గా బయటకొస్తారు. విజయదశమి తర్వాత అందరూ రోడ్డెక్కాలి. మీమీ గ్రామాలతో అనుసంధానమవ్వండి. సోషల్ మీడియాను వాడుకోండి. నేను ఇంత త్వరగా ప్రజలకు చేరువయ్యానంటే సోషల్ మీడియానే కారణం. ఒక కార్యక్రమం చేపడితే లక్షలమందికి మెసేజ్ వెళ్లిపోతుంది. జగన్ వస్తే ఏదో చేస్తాడని అనుకున్నాం మొత్తం నాశనమైందని ఆయన సామాజిక వర్గం వారే చెబుతున్న పరిస్థితి.
ఎన్నికల్లో మనం కొందరిని బూత్ ఏజెంట్లుగా పెడుతున్నాం. వారిలో ఎందరు పర్ ఫెక్ట్ గా పనిచేస్తున్నారో చూసుకోవడంలేదు. నేను ఏడెనిమిది ఎన్నికలు చూశాను. 262 బూతులుంటే 340 బూతులు లెక్కేసి రోజుకు 8 వేలు లెక్కన 12 వేలు ఇచ్చాం. కానీ ఎన్నికల సమయంలో వాళ్లు కనిపించలేదు. పార్టీ అంటే ప్రాణం పెట్టేవారికి బూతుల దగ్గర వేయాలి. వాలంటీర్ వ్యవస్థను భగ్నం చేయాలంటే బూత్ లను గట్టిగా నిలబెట్టుకోవాలి. అందరూ కష్టపడాలి. విజయదశమి తర్వాత నేను ప్రజాక్షేత్రంలోకి వెళతాను. అడవిలోకి వెళ్లమన్నా వెళతాను. పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలను ఆదుకోవాలి. పార్టీ కార్యకర్త నష్టపోయినప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. రైతుల తరపున ఎమ్మార్వోకు వినతిపత్రం ఇవ్వడానికి వెళితే నాపై ఎఫ్ ఐఆర్ పెట్టారు. 40 ఏళ్ల నా రాజకీయ జీవితంలో మొదటి కేసు. అయినా ఊడేది ఏమీ లేదు. భయపడాల్సింది లేదు. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. ఇదే మాట ప్రజలకు పదేపదే చెప్పండి. జగన్ రెడ్డిని గెలిపించి దగా పడ్డామని బడుగు , బలహీన వర్గాలు భావిస్తున్నారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీలు సహా బాధితులందరితో నాయకులు మాట్లాడాలి. ప్రజా సమస్యలపై పోరాడాలి. ఏపీ అభివృద్ధి పట్టాలెక్కాలంటే చంద్రబాబు సీఎం కావాలి. జగన్ ఇన్ని అప్పులు చేసిన రాష్ట్రాన్ని చంద్రబాబు ఎలా బాగు చేస్తారని కొందరు అడుగుతున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పట్టాలెక్కించే సత్తా మన చంద్రన్నకే ఉంది.