Suryaa.co.in

Telangana

స్వాతంత్ర్యం వచ్చినట్టు ప్రజలు ఫీల్ అవుతున్నారు

-ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి
-కాంగ్రెస్ పార్టీ లో కష్టపడి పని చేసిన వారికి గుర్తింపు ఇస్తాం
-హైదరాబాద్ గాంధీభవన్లో జరిగిన టిపిసిసి కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

దశాబ్ద కాలం తర్వాత రాష్ట్ర ప్రజలు మనకు గొప్ప అవకాశం ఇచ్చారు. మార్పును కోరుకున్న ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుందాం. గత పది సంవత్సరాలుగా అనేక కష్ట నష్టాలను భరించి అధికారంలోకి వచ్చాము. యువత ఎన్నో కలలు కని తెలంగాణ కోసం పోరాటం చేశారు. వారి కళలను నిజం చేయాల్సిన బాధ్యత తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా మన పైన ఉంది.

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, అభయ హస్తం మేనిఫెస్టోను ప్రజలు విశ్వసించి మనల్ని గెలిపించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలను అమలు చేశాం. మిగతా గ్యారెంటీల అమలుకు శ్రీకారం చుట్టాం కాంగ్రెస్ పార్టీ పక్షాన పని చేస్తున్న వారంతా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలి. గత ప్రభుత్వ ఆర్థిక అరచకత్వంతో రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేసి అప్పుల ఊబిలోకి నెట్టారు

ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో మన రాష్ట్రం ఒకవైపు ఆర్థికంగా బలోపేతం కావాలి..మరోవైపు మనం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. రాష్ట్రంలో ఒక ఫీల్ గుడ్ ఫాక్ట్ వచ్చింది.. ఒక స్వాతంత్ర్యం వచ్చినట్టు ప్రజలు ఫీల్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ లో కష్టపడి పని చేసిన వారికి గుర్తింపు ఇస్తాం.

LEAVE A RESPONSE