Suryaa.co.in

Andhra Pradesh

అసమర్థ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధం

– వల్లూరు జయప్రకాష్ నారాయణ

బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ మలివిడత బిజెపి విజయ సంకల్పయాత్ర ఏడోవరోజు కార్యక్రమంలో భాగంగా రామనామ క్షేత్రం వద్దగల భరతమాత విగ్రహం దగ్గర ప్రారంభమై సంపత్ నగర్ మెయిన్ రోడ్డు నల్లచెరువు ఆర్ అగ్రహారం పట్నం బజార్ ఎత్తురోడ్డు అడపా బజార్ మీదుగా నగరంపాలెంలోని అమరవీరుల స్తూపం గుర్రం జాషువా గారి విగ్రహం వద్ద ముగిసింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్ బిజెపి సీనియర్ నాయకులు మాజీ అధ్యక్షులు నేరెళ్ల మాధవరావు విచ్చేశారు.

వల్లూరు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ… ఈ రాష్ట్రంలో ప్రజలను మోసం చేస్తూ మభ్యపెడుతూ చెత్త మీద పన్నువేస్తూ చెత్త మాటలు మాట్లాడుతున్న ఈ ముఖ్యమంత్రిని ప్రజలందరూ కూడా అసహ్యించుకుంటున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తుంటే ఏ ప్రాంతంలో చూసినా కూడా త్రాగునీటి వసతి లేకుండా మురుగు పట్టిన నీరు అదే విధంగా మురికి కాలువలు గుంటలు పడిన రోడ్లు ఎక్కడ చూసినా కూడా గుంటూరును గార్బేజిగా మార్చేసిన ఈ వైసిపి ప్రభుత్వం.

నరేంద్రమోడీ గ్రీన్ గుంటూరు గా మార్చే ప్రయత్నం చేస్తుంటే ముఖ్యమంత్రి గార్బేజి గుంటూరుగా మారుస్తున్నాడు అదేవిధంగా ఏవైతే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయో వీటిని నిర్వీర్యం చేస్తూ ఫ్యామిలీ డాక్టర్ పేరుతో ఇంటింటికీ డాక్టర్ వస్తాడని అబద్ధపు మాటలు చెప్పారు చాలామంది బాధితులు అటు జ్వరం వల్ల కానీ న్యుమోనియా వల్ల బాధపడుతుంటే ప్రజలను ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇక్కడ నగర మేయర్ నివాసానికి అత్యంత సమీపంలో చెత్తపడి ఉంటే ఆ చెత్త కూడా తీయలేనటువంటి ఈ అసమర్ధపు చెత్త ప్రభుత్వం గుంటూరులో రాష్ట్రంలో ఉందంటే ప్రజలు అసహ్యించుకుంటున్నారు.

కేంద్రం ఇచ్చే ప్రతి పథకాన్ని ఇంటింటికి గడపగడపకు తిరుగుతూ ప్రతి ఒక్కరిని కలుస్తూ వారికి సాధక బాధలు వింటూ వారికి చెబుతుంటే నరేంద్ర మోడీ గారు మరోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలని అదేవిధంగా రాష్ట్రంలో కూడా నరేంద్ర మోడీ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఈ సందర్భంగా తెలిపారు.

వనమా నరేంద్రకుమార్ మాట్లాడుతూ.. గడిచిన ఐదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వానికి ఏమేం చేసింది ఇంకా చేయబోతున్న వేమిటి అనేది ప్రజలకు చేరువ చేయడానికి విజయ సంకల్ప యాత్రను చేపట్టామని గత తొమ్మిది సంవత్సరాలుగా కేంద్రం ఇచ్చిన పథకాలకు రాష్ట్రంలోని రెండు పార్టీలు కూడా స్టిక్కర్లు వేసుకొని మనుగడ సాగించాయని నగరంలో పారిశుధ్యం అద్వాన్నంగా ఉన్నదని రాష్ట్రంలో దోచుకోవడం దాచుకోవడం తప్ప ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయని ఈఅసమర్థ ప్రభుత్వానికి చరమగీతం పాడటానికి ప్రజలు కంకణ బద్దులై ఉన్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు మాజీ అధ్యక్షులు నేరెళ్ల మాధవరావు, ఈదర శ్రీనివాసరెడ్డి పాలపాటి రవికుమార్, మండల అధ్యక్షులు కారంశెట్టి రమేష్ కుమార్, కపిలవాయి బదిరి, మాధవి లత, మల్లె ఏడుకొండలు, రాఘవేంద్రరావు, రమేష్ జైన్, శ్రావణ కుమారి, రాచుమల్లు భాస్కర్, అప్పిశెట్టి రంగా, ఏడుకొండలు గౌడ్, నాగమల్లేశ్వరి యాదవ్, దుర్గాభవాని, లక్ష్మీ ప్రసన్న, కే నాగమల్లేశ్వరి, శివ పార్వతి, ఏలూరి లక్ష్మి, సరోజినీ, తోట శ్రీనివాస్, వెంకటేష్ యాదవ్, దర్శి నరసింహారావు, మాదాల సురేష్, నరేంద్ర షా, భజరంగ్ రామకృష్ణ, దేసు సత్యనారాయణ, స్టాలిన్, జితేంద్రగుప్త తదితరులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE