Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రం సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రజలు తెలుగుదేశాన్నే విశ్వసించారు

• 1983 ఘట్టం 2024లో రాష్ట్రంలో పునరావృతం అవుతుంది
• జగన్ రెడ్డి, వైసీపీనేతల భయాందోళనకు నిదర్శనమే చంద్రబాబు-పవన్ కల్యాణ్ భేటీపై చేస్తున్న కువిమర్శలు
• రాష్ట్రఅప్పులపై అవాస్తవాలుచెప్పడం మాని, తనతో చర్చకు రావాలని జగన్ ని చాలాసార్లు డిమాండ్ చేశాను
• 1956లో రాష్ట్రం ఏర్పడింది మొదలు 2014వరకు రాష్ట్ర అప్పులు రూ.2.56లక్షలకోట్లు మాత్రమే
• జగన్ రెడ్డి మూడేళ్లపాలనలో ఆ మొత్తం రూ.8.50లక్షలకోట్లకు చేరింది. ఆయన దిగిపోయేనాటికి రూ.11లక్షలకోట్లు కావడం ఖాయం
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు

దేశవ్యాప్తంగా అనేకప్రాంతీయపార్టీలు మఖలో పుట్టి, పబ్బలో కనుమరుగయ్యాయని, ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నందునే తెలుగుదేశంపార్టీ 40ఏళ్లుగా విరాజిల్లుతోందని, వచ్చే ఎన్నిక ల్లో టీడీపీప్రభంజనం 1983నాటికంటే ఘనంగాఉంటుందని జగన్ రెడ్డి, ఆయనప్రభుత్వానికి భయాందోళన ఎక్కువయ్యే చంద్రబాబు-పవన్ కల్యాణ్ భేటీపై అక్కసు వెళ్లగక్కుతోందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టంచేశారు. మంగళగిరిలోనిపార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడా రు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

దేశంలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు మఖలో పుట్టి, పుబ్బలో పోయాయి. తెలుగుదేశం మాత్రమే 40ఏళ్లుగా ప్రజలమన్ననలు పొందుతోంది
తెలుగుదేశంపార్టీ తొలిసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు, స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి కేబినెట్ లో నేను మంత్రిగా ఉండటం నిజంగా నా పూర్వజన్మ సుకృతం. వివిధ పదవులు అనుభవించి తెలుగుదేశంపార్టీ 40ఏళ్ల రాజకీయప్రస్థానంలో భాగస్వామిని కావడం నిజంగా నా అదృష్టం. 1982లో ఎన్టీఆర్ గారు తెలుగుదేశాన్ని స్థాపించింది మొదలు ప్రత్యేక సిద్ధాంతాలతో ప్రజలకోసమే పనిచేస్తూ, మాపార్టీ ఎల్లప్పుడూ ప్రజల విశ్వాసాన్ని చూరగొంటోంది. మఖలోపుట్టి పుబ్బలో పోయిన పార్టీలు అనేకం. రాష్ట్రం లో, దేశంలో అనేకప్రాంతీయ పార్టీలు ఉద్భవించినా ఏవీకూడా తెలుగుదేశానికి సాటిరాలేదు. ప్రాంతీయపార్టీగా ఉండి జాతీయ రాజకీయాల్లో ప్రధానభూమిక పోషించింది తెలుగుదేశం పార్టీ ఒక్కటే. ప్రజామన్నన పొందడంతో పాటు, ప్రజల విశ్వాసం నానాటికీ పార్టీపై పెరుగుతోంది. సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లనే నినాదం, ఎన్టీఆర్ అమలుచేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు తెలుగుదేశం ఇచ్చిన ఆయుధాలే. అధికారంలో ఉన్నాలేకున్నా తెలుగుదేశానిది ఎప్పుడూ ప్రజాపక్షమే.

జాతీయపార్టీలకు సాధ్యంకానిదాన్ని తెలుగుదేశం చేసింది
వైసీపీ విధానాలు, ఆపార్టీ సిద్ధాంతాలు రాష్ట్రాన్ని మూడేళ్లలోనే భ్రష్టు పట్టించాయి. 1983లో నాటిప్రజలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని బలంగా నమ్మారు. ఆనాటి పరిస్థితే ఇప్పుడుకూడా రాష్ట్రంలో ఉంది. రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబా బు నాయకత్వం, తెలుగుదేశం వల్లే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారు. 2014లో కూడా రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు వల్లే సాధ్యమని బలంగా నమ్మారు. విశ్వసనీయత గల నాయకత్వంవల్లే ఎన్నిఒడిదుడుకులు, సంక్షోభాలు వచ్చినా పార్టీ తట్టుకొని నిలబడ గలిగిం ది. జాతీయస్థాయిలో రెండుసార్లు దేశనాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీ నిర్ణయించడం సాధారణ విషయంకాదు. జాతీయపార్టీలు, వాటితోపొత్తుపెట్టుకున్న ప్రాంతీయపార్టీల వల్ల కానిపాత్రను, తెలుగుదేశం పార్టీ పోషించడం గొప్ప పరిణామం. తమకు ఎప్పుడు సమస్య వచ్చినా, రాష్ట్రంలో సంక్షోభాలు తలెత్తినా ప్రజలు తెలుగుదేశాన్ని నమ్ముతున్నారు. 1983లో నిజంగా పొలిటికల్ రెవల్యూషన్ వచ్చింది. ఆనాటి పరిస్థితే నేడు రాష్ట్రంలో చూస్తున్నాం. ఇప్పుడుకూడా యువరక్తాన్ని పార్టీలోకి ఆహ్వానించడానికి కృషిచేస్తున్నాం.

ఎన్టీఆర్ వచ్చాకే పేదలకు నాణ్యమైన పక్కాఇళ్లు…
ఎన్టీఆర్ రాకముందు, కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలుచేసిన సంక్షేమపథకాలు అరకొరగా ఉండే వి. తెలుగుదేశం ఆవిర్భవించాకే పేదలకు నాణ్యమైన పక్కాఇళ్లు నిర్మించింది. అప్పట్లో పేదల కోసం రూ.6వేలఖర్చుతో ఇంటినిర్మాణం మొదలుపెట్టింది. ఎన్టీఆర్ అమలు చేసిన అనేక పథకాలు నేటికీ ఎన్నోపార్టీలకు ఆదర్శనీయంగా నిలిచాయి. పేదలకు తొలుత రూ.35లతో పింఛన్ ప్రవేశపెట్టింది ఎన్టీఆర్ గారే. ఎన్టీఆర్ గారు సగంధరకే పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. రైతులకు 1 హార్స్ పవర్ విద్యుత్ రూ.50కే అందించారు. మహిళలకు ఆస్తిలో సమానహక్కుతోపాటు, వారికోసం ప్రత్యేకంగా విశ్వవిద్యాలయమే నెలకొల్పారు. సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు నామమాత్రపు వడ్డీకే సహకార సంఘాలద్వారా రుణాలు అందిం చారు. పింఛన్ పథకాన్ని తానే తీసుకొచ్చానని జగన్ రెడ్డి చెప్పడం సిగ్గుచేటు. ఎన్నికలకు ముందు అధికారంలోకివస్తే, రూ.3వేలు ఇస్తానని హామీఇచ్చాడు. ఇప్పుడేమో రూ.250 చొప్పున పెంచుతూ, పింఛన్ దారుల్ని వంచిస్తున్నాడు.

భయాందోళనతోనే చంద్రబాబు-పవన్ భేటీపై వైసీపీ నేతలకు విమర్శలు
జగన్మో హన్ రెడ్డి తన ఆస్తులు పెంచుకోవడానికి, కబ్జాలకోసమే వికేంద్రీకరణ అంటున్నా డుగానీ, ప్రజలకోసం కాదు. టీడీపీ మాండలికవిధానంతో పరిపాలన వికేంద్రీకరణకు అంకురా ర్పణ చేసింది. బీసీలకు తొలిసారి 20శాతం రిజర్వేషన్లు, మహిళలకు తొలిసారి 9శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత ఎన్టీఆర్ దే. పవన్ కల్యాణ్ పార్టీ యాక్టివ్ గా ఉంది. ఆయన నిలదొక్కుకోవడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఏపార్టీ అయినా ప్రజా క్షేత్రంలో నిలవాలంటే, ఎప్పటికప్పుడు యువతరం ఆలోచనలకు తగినట్టుగా మార్పు చెందా లి. తెలుగుదేశంపార్టీ 40ఏళ్లపాటు కొనసాగిందంటే, దానికి కారణం ఎన్టీఆర్, చంద్ర బాబుపై ప్రజలుచూపిన విశ్వసనీయతే. తమప్రభుత్వం పోతోందన్న ఆందోళన, భయంతోనే వైసీపీ చంద్రబాబు-పవన్ భేటీని తప్పుపడుతోంది. ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన జగన్, ఆయన పార్టీ తీవ్రమైన నిరాశానిస్పృహల్లో ఉంది. చంద్రబాబు-పవన్ కల్యాణ్ కలిస్తే తప్పేంటి? జగన్ వెళ్లి మోదీని కలవడంలేదా? ఆయన అధికారికంగా ఢిల్లీ వెళ్లిన వివరాలే బయట పెట్టడం లేదు. చంద్రబాబు-పవన్ చర్చించుకున్న ఆంతరంగిక విషయాలు ఎందుకు బయట పెట్టాలి? తెలుగుదేశం-జనసేన కలిసి పోటీచేస్తాయా..లేక విడిగా పోటీచేస్తాయా అనేది కాలమే నిర్ణయిస్తుంది.ఇప్పుడు ప్రజలకోసం విడివిడిగా పోరాడుతున్నవారు, రేపు భవిష్యత్ లో కలిసి పోటీచేయరని చెప్పలేం కదా! జగన్ రెడ్డిపై ఉన్న అవినీతికేసులు, ఆయన నేరచరిత్ర చూసే, ఇతరపార్టీలు, నేతలు ఆయన్ని కలవడానికి భయపడుతున్నారు. జగన్ రెడ్డి, వైసీపీనేతలు మూడున్నరేళ్లలో చేసిన తప్పులు, నేరాలు ఘోరాలు వారిని వెంటాడుతున్నాయి. ఆభయంతోనే వారు అసం దర్భ ప్రేలాపనలు చేస్తున్నారు. 175 నియోజకవర్గాల్లో వైసీపీనేతలే తీవ్ర అసంతృప్తి, అసమ్మతితో ఉన్నారని చెబుతున్నారు. సొంత కార్యకర్తలు, నేతలు అసంతృప్తితో ఉన్నారంటే దానికి కారణం వారికి పనులు జరగకపోవడమే. తనప్రభుత్వం, పార్టీలోని అసమ్మతిని కప్పిపుచ్చుకోవడానికే జగన్ రెడ్డి, చంద్రబాబు-పవన్ కల్యాణ్ భేటీని తప్పుపడుతున్నారు.

మూడున్నరేళ్లలో జగన్ చేసిన అప్పు రూ.8.50లక్షలకోట్లు, ఆయన దిగిపోయేనాటికి రాష్ట్రంపై పడే అప్పులభారం రూ.11లక్షలకోట్లు
రాష్ట్ర ఆర్థికపరిస్థితి, అప్పులభారంపై జగన్మోహన్ రెడ్డితో బహిరంగచర్చకు సిద్ధమని చాలా సందర్భాల్లో డిమాండ్ చేశాను, కానీ ఆయన స్పందించలేదు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డా క, 2014లో రాష్ట్రం విడిపోయింది. 1956 నుంచి 2019 వరకు రాష్ట్రంపై ఉన్న అప్పులు రూ2.56లక్షలకోట్లు. ఈ లెక్కలే బడ్జెట్లో కూడా చెప్పారు. జగన్ అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలోనే రాష్ట్ర అప్పులు రూ.8.50లక్షలకోట్లకు చేరాయి. ఏటా రూ.2లక్షలకోట్ల చొప్పున మూడేళ్లలోనే జగన్ రెడ్డి రూ.6లక్షలకోట్ల అప్పు చేశాడు. ఇన్ని అప్పులు చేసిన జగన్, టీడీపీప్రభుత్వం అప్పులుచేసిందనడం ముమ్మాటికీ పచ్చిఅబద్ధం. గతప్రభుత్వాలు నిబంధనలప్రకారం, కేంద్రప్రభుత్వ ఆదేశాలకు లోబడి మాత్రమే అప్పులు చేశాయి. జగన్మోహన్ రెడ్డిలాగా విచ్చలవిడిగా ఇష్టానుసారం చేయడంలేదు. జగన్ రెడ్డి దిగిపోయే నాటికి రాష్ట్రఅప్పులభారం రూ.11లక్షలకోట్లకు పైనే ఉంటుంది. దానికోసం ఏటా రూ.లక్ష కోట్లు వడ్డీలకే చెల్లించాలి. ఆ స్థాయిలో అప్పులుంటే, రాష్ట్రబడ్జెట్ రూ.3లక్షలకోట్లుంటే, లక్ష కోట్లు వడ్డీలకేపోతే, ప్రజలకు సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది. వచ్చే ఆదాయమంతా అప్పులకే సరిపోతుంది. మిగతా రాష్ట్రాలు అప్పులుచేసినా, రాష్ట్రాభివృద్ధి, మానవవనరుల వృద్ధిలో ముందున్నాయి. మానవ వనరుల అభివృద్ధిలో కేరళ తొలిస్థానంలో ఉంటే, మనరాష్ట్రం 21వస్థానంలో ఉంది. కేరళతో కూడా పోటీపడలేని దుస్థితికి జగన్ రాష్ట్రాన్ని దిగజార్చాడు” అని యనమల తెలిపారు.

LEAVE A RESPONSE