ఏటా పెద్ద పండగ(సంక్రాంతి)కి తన కుటుంబంతో వెళతారు చంద్రబాబు నాయుడు. అక్కడ కులదేవతలకు పూజలు చేయడంతో పాటు, తల్లిదండ్రులకు, తమ్ముడికి బట్టలు పెట్టి స్మరించుకుని నివాళి అర్పించి వస్తారు. అలా ఈ ఏడాది సంక్రాంతి రోజు కూడా సాంప్రదాయం ప్రకారం చేశారు.
ఎప్పుడూ తల్లిదండ్రులు బయటకు వచ్చింది లేదు. పట్టుదల కొడుకుకు ఇంట్లో బెల్లం అమ్మిన డబ్బులు ఇచ్చి ఆశీర్వదించి పంపారు. తల్లిదండ్రులను, పుట్టిన ఊరిని, స్నేహితులను, బంధువులను, కనిపించే తిరుమల కొండ, చదివిన వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరిగిన తిరుపతి వీధులు ఆయన మరిచిపోరు. అవకాశం ఉన్నప్పుడల్లా తీరికలేకున్నా కలిసి ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఉంటారు.
అలాంటి ఆయన తల్లిని, తండ్రిని దూషిస్తూ.. ఆయన నమ్మే తిరుమల వెంకటేశ్వర స్వామికి అపచారం చేసి కూడా బరితెగించి తిడుతుంటే ఆయన కూడా మనిషే.. ఎంత మానసిక సంఘర్షణ అనుభవిస్తారో అర్థం చేసుకోవచ్చు.
అకారణంగా కుట్రలు పన్ని ఆయన్ను జైలుపాలు చేస్తే దేశంలో ఏ నాయకుడికీ రాని సంఘీభావం ప్రపంచ వ్యాప్తంగా, పార్టీలకు, నాయకులకు, పారిశ్రామిక వేత్తలకు, సెలబ్రిటీలకు అతీతంగా ఆయనకు పెద్ద ఎత్తున వచ్చింది
అవన్నీ మరిచి, మళ్లీ ఆయన తనను గెలిపించిన కప్పులో పర్యటనలో మొన్నటి నుండి మూడు రోజులు తీరికలేని కార్యక్రమాలలో ఉన్నారు. నిన్న పొద్దున కూడా పేదలసేవలో ఉన్న సమయంలో అంబటి చేత అత్యంత హీనమైన భాషలో జగన్ తిట్టించారు. ప్రజలకు కూడా కొంత సహనం ఉంటుంది. అభిమానంతో ఉండే వారి భావోద్వేగాలను రెచ్చగొట్టే రాజకీయ కుట్రకు జగన్ తెగించారు.
రాష్ట్రంలో ఎవరికీ బోసడీకే అంటే తెలుగు అర్థం తెలియదు. సజ్జలను ఉద్దేశించి ఆ గుమస్తా ఒక బోసడీకే అని అన్న పట్టాభి మాటలను జగన్ను అన్నట్లు ఆపాదించి, ఇంటికి వెళ్లి రాడ్లతో కొట్టారు. చంద్రబాబు ఇంటి మీదికి జోగి రమేశ్ గుండాలతో వెళ్లాడు. దేశంలో మొదటి సారి ప్రతిపక్ష పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేసి, కార్లను పగలగొట్టి, అందులో పనిచేసే వారి తలలు పగులగొట్టారు వైకాపా మూకలు వాటన్నింటినీ సమర్థిస్తూ జగన్ గతంలో మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుందాం.