-న్యూ సెక్రటేరియట్ లో మసీదుకు ఐదుగుంటల స్థలం
-నల్ల పోచమ్మ ఆలయానికి రెండున్నర గుంటలే ఇవ్వడంలో ఉన్న ఆంతర్యం ఏంటి?
-750 కోట్లు ఆదాయం వచ్చే ఓఆర్ఆర్ ను, 246 కోట్లకే కట్టబెట్టడంలో మర్మమేంటి?
-ఓట్ల కోసమే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నామస్మరణ
-బండి సంజయ్ పై తరచూ పార్టీలు మారే బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా
-బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్.వి సుభాష్
కొత్త సచివాలయాన్ని వందకి 100% ఓవైసీ మెప్పు కోసమే డోములతో కేసీఆర్ కట్టించారు. మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు… న్యూ సెక్రటేరియట్ లో మసీదుకు ఐదుగుంటల స్థలం ఇచ్చిన కేసీఆర్, నల్ల పోచమ్మ ఆలయానికి రెండున్నర గుంటలే ఇవ్వడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? విశ్వ నగరం అని చెప్పుకునే హైదరాబాదులో మ్యాన్ హోల్లు పసిపిల్లల ప్రాణాలను మింగేస్తున్నా… ఎందుకు మిన్నకుంటున్నారు?
తెలంగాణ ప్రజలకు కావాల్సింది రాజమహళ్ళు, రాచరిక పోకడలు కాదు. ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతి, అరాచకాలను ఎక్కడికక్కడ ఎండగడుతున్న బిజెపిపై, బండి సంజయ్ పై అడ్డగోలు విమర్శలు చేస్తే… కేసీఆర్ కు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు సచివాలయ నిర్మాణంలో జరిగిన అవినీతిని కచ్చితంగా బయట పెడతాం. కారు కూతలు కూసే నోర్లకు, అడ్డగోలుగా తెలంగాణ సొమ్మును దోచుకునే బీఆర్ఎస్ నేతలకు త్వరలోనే సమాధానం చెబుతాంఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అవినీతికి పాల్పడి అడ్డంగా దొరికింది ఎవరో తెలంగాణ సమాజానికి తెలుసు. అన్నింటా దాచుకోవడం, దోచుకోవడమే బీఆర్ఎస్ లక్ష్యం.
బీఆర్ఎస్ పార్టీకి బంగారు బాతుగా ఓఆర్ఆర్ మారింది.లక్ష కోట్ల విలువైన ఓఆర్ఆర్ ను ప్రైవేటుకు కట్టబెట్టారు.ఏడాదికి 750 కోట్లు ఆదాయం వచ్చే ఓఆర్ఆర్ ను, 246 కోట్లకే కట్టబెట్టడంలో మర్మమేంటి?ఎలక్షన్లు దగ్గర పడడంతో… ఓట్ల కోసమే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నామస్మరణ చేస్తున్నారు కేసీఆర్.
ఇన్నాళ్ళు అంబేద్కర్ గారి జయంతి, వర్ధంతిలకి బయటకు రాని కేసీఆర్, ఇప్పుడు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, కొత్త సచివాలయానికి ఆయన పేరు పెట్టినంత మాత్రాన దళిత సమాజం ఏమీ కేసీఆర్ ను నమ్మదు.
ఇన్నాళ్లు గుర్తురాని అంబేద్కర్ గారు, ఈ ఎన్నికల ఏడాదిలోనే కేసీఆర్ కు ఎందుకు గుర్తుకు వస్తున్నారో దళిత సోదరులందరికి తెలుసు. దళితులపై కేసీఆర్ సర్కార్ దాడులు, లాకప్ డెత్ లు అన్నీ వాళ్లకు గుర్తున్నాయి.అసలు కనీస స్థాయి, అర్హత లేని బీఆర్ఎస్ నేతలు… ప్రధాని మోదీపై, బండి సంజయ్ పై విమర్శలు చేయడం చూస్తుంటే… విడ్డూరంగా ఉంది.