Suryaa.co.in

Andhra Pradesh

ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు మార్చడం కాదు ఈ రాష్ట్రంలో ప్రజలు వైసిపి ప్రభుత్వాన్ని మార్చేస్తారు

– ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు యస్ . విష్ణువర్ధన్ రెడ్డి
– బిజెపి ఆధ్వర్యంలో ఆందోళన
– ఆర్డీవో కార్యాలయం ముట్టడి

పెనుగొండ : కేంద్రం ఇచ్చిన 25 లక్షలు ఇల్లు కట్టలేని అసమర్ధ ప్రభుత్వం నేడు రాష్టంలో పాలన చేస్తోంది.వైసిపి ముఖ్యమంత్రి పేరున ఉన్న జగనన్న కాలనీలో ఎందుకు ఎల్లు కట్టలేకపోయారు ? రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే పెట్రోల్ డీజిల్ ధరలు ఎందుకు ఎక్కువగా ఉన్నాయి. విద్యుత్ ఛార్జీలు 5 సార్లు ఎందుకు పేదలపై భారం మోపారు .కేంద్రం ఇచ్చే సహకారాన్ని సైతం వినియోగించుకోలేని అసమర్ధ ప్రభుత్వం . 2024లో మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలను మీ మంత్రులకు టికెట్లు ఇవ్వడం లేదంటే పరోక్షంగా మీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఒప్పుకున్నట్టే కదా ? రాష్ట్రంలో ప్రజా సమస్యల విషయంలో వైసిపి ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం . ఈ ఆందోళన కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుదర్శన్ స్థానిక నాయకులు రామకృష్ణ మరియు రామాంజనేయులు ఇతర నాయకులు పాల్గొన్నారు .

LEAVE A RESPONSE