Suryaa.co.in

Andhra Pradesh

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

– చంద్రబాబు ట్వీట్

ఏపీలో ప్రజలు మార్పు కోరుకుంటున్న విషయం తన పర్యటనలో స్పష్టంగా కనిపిస్తోందని మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చెప్పారు. ఆ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

జిల్లాల పర్యటనకు వచ్చిన ప్రజా స్పందన అద్భుతం. మూడు రోజుల నా జిల్లాల పర్యటన ఎంతో అద్భుతంగా సాగింది. 7 జిల్లాలలోని 21 నియోజకవర్గాల్లో లక్షల మందికి చేరువగా పర్యటన సాగింది.ప్రజా సమస్యలు, ప్రభుత్వ బాదుడే బాదుడు పై ప్రజల అభిప్రాయాలు, అవేదన, ఆగ్రహం రాష్ట్రంలోని ప్రభుత్వ వ్యతిరేకతను చాటాయి.ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో ప్రజలు మార్పును కోరుకుంటున్న తీరు స్పష్టంగా కనిపించింది.తెలుగు తమ్ముళ్లలో కసి, ప్రజల్లో తెలుగు దేశం పార్టీ పై ఆసక్తి రానున్న మార్పును సూచిస్తున్నాయి.వాడవాడలా వెల్లువలా కదిలి, అర్థరాత్రి సైతం ఎదురేగి స్వాగతం పలికిన కార్యకర్తలకు, ప్రజలకు ధన్యవాదాలు.ఒక్క మాటలో చెప్పాలి అంటే…ఈ టూర్ కు వచ్చిన ప్రజా స్పందన రాష్ట్రానికే ఒక సందేశం ఇచ్చింది.

 

LEAVE A RESPONSE