– అంబటి మురళి ఆరోపణలకు ధూళిపాళ్ళ కౌంటర్
పొన్నూరు: పూటకో స్క్రిప్ట్ చదివినా, గంటకో బులిటన్ వేసినా ప్రజలు విశ్వసించరని అంబటి మురళి వ్యాఖ్యలకు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గట్టి కౌంటర్ వేశారు. నా రాజకీయ ప్రస్థానం తెరిచిన పుస్తకం.. రాష్ట్రంలో ఐదేళ్ల అరాచకానికి జగన్ మోహన్ రెడ్డే సూత్రధారి అని ఆరోపించారు. ఇంకా, ఆయన ఏమన్నారంటే.. పొన్నూరు లాంటి ప్రశాంత పల్లెల్లో రక్తపు కత్తులు తిప్పింది వైసీపీ. గుంటూరు దళిత విద్యార్థిని రమ్యను పట్టపగలు హత్యచేసినపుడు అంబటి బ్రదర్స్ నోళ్ళు తెరవలేదు.
తాడేపల్లి ప్యాలెస్ కూతవేటు దూరంలో దళిత మహిళ మీద సామూహిక అత్యాచారం జరిగితే జగన్ చలించలేదు. టీడీపీ దళితనేత బండ్లమూడి బాబురావు మీద అత్యంత కిరాతకంగా దాడికి పాల్పడితే వైసీపీ దళిత సంఘాలు కినుకవహించాయి. రేషన్ మాఫియా పొన్నూరు దళితుడు బర్నాబాస్ ను అత్యంత దారుణంగా హత్యచేస్తే బాధిత కుటుంబం తరపున మేం పోరాటం చేస్తే వైసీపీ ప్రభుత్వం స్పందించలేదు.
పాత కక్షలు, వ్యక్తుల మధ్య ఘర్షణను దాడిగా చిత్రీకరించి మా మీద బురద చల్లాలనే ప్రయత్నం రోజు వారీగా చేస్తున్నారు. సీసీ టీవీ పుటేజ్ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేసి 307 కేసు నమోదు చేసి పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. హత్యా రాజకీయాలు, ప్యాక్షన్ రాజకీయాలు జగన్ మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. తన నైజాన్ని పార్టీ శ్రేణులందరికీ అలవాటు చేశాడు జగన్. వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయ క్లర్క్ రాసిన ఉత్తరాలు చదవటం ఆ పార్టీ నాయకుల వంతు, గంట గంటకు బులిటెన్లు చేయటం వైసిపి మీడియా తంతు. నాటి రాజశేఖర్ రెడ్డి ఆయన గ్యాంగ్ నుండీ నేటి జగన్ మోహన్ రెడ్డి తన చెంచాల వరకు నాపైన ఆరోపణలు చేసిన వాళ్ళే, ఎన్ని పాబ్రికేటేడ్ కేసులు పెట్టినా సత్యమే గెలుస్తుంది, సత్యం గెలిచిందని చెప్పేందుకు నా ప్రజా ప్రస్తానమే నిదర్శనం
నా ప్రాంతానికి, నా ప్రజలకు నా జీవిత ప్రయాణం తెరిచిన పుస్తకం. వాస్తవాలు, కథనాలు, కథలు అన్నీ మా ప్రజలకు పూర్తి అవగాహన ఉంది. మీ అబద్ధాలు, తప్పుడు ప్రచారాలు నా కుటుంబ రాజకీయ ప్రస్థానంకి ఈ ప్రాంతానికి ఉన్న అనుబంధాన్ని చెరచలేవు. ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యంలో 6సార్లు శాసన సభ్యునిగా గెలిపించారిక్కడి ప్రజలు. గ్రామాల్లో వార్డులలో ఎన్నికల పోటీ కూడా గెలువని వైసీపీ నేతలతో, కబ్జా దారులు, దోపిడి దారులతో సజ్జల నాకు సుద్దులు చెప్పిస్తున్నాడు.