బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు సమక్షంలో బిజెపిలో చేరిన పెరికె లక్ష్మణ్
మండలంలోని వేంపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు , పొన్నలూరు మండలం తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి పెరికె లక్ష్మణ్ తెలుగుదేశం పార్టీని వీడి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు సమక్షంలో ప్రకాశం జిల్లా అధ్యక్షులు పి.వి. శివారెడ్డి ఆధ్వర్యంలో బిజెపి పార్టీలో చేరినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న సంక్షేమం , అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడనై బిజెపి పార్టీలో చేరుతున్నట్లు మీడియా మిత్రులకు తెలియజేశారు. రానున్న రోజుల్లో కొండేపి నియోజకవర్గంలో బిజెపి పార్టీని బలోపేతం చేయటంకోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తానన్నారు.