– అన్యాయాన్ని ఎదిరించి, అధర్మాన్ని ఓడించి సాధించుకున్న అద్భుత విజయం ఇది
– చంద్రబాబు నాయుడి దార్శనికతకు, కష్టానికి దేశం ఇచ్చిన గౌరవం
– ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవ శిఖరంగా అమరావతి
నరసింహుడి ఆగ్రహాన్ని పానకంతో తగ్గించినట్లు — పదేళ్ల ఆంధ్రుల ఆవేదనను, అమరావతి రైతుల అలుపెరగని పోరాటాన్ని ఈ చారిత్రాత్మక గెజెట్ శాశ్వత రాజధాని ప్రకటనతో చల్లార్చింది!
అవును, హింసించిన వాడి పేగులు తీసి పదకొండు పోగులు చేసినంత ఆగ్రహంతో ఉంది ఆంధ్రా. ఆ అన్యాయాన్ని ఎదిరించి, అధర్మాన్ని ఓడించి సాధించుకున్న అద్భుత విజయం ఇది. ఇది కేవలం మన దేశ ప్రభుత్వ ఉత్తర్వు కాదు, ఐదు కోట్ల ఆంధ్రుల గుండెల్లో నుండి ప్రజ్వరిల్లిన ఆకాంక్షకు, ఏడు దశాబ్దాల రాజధాని వెతుకులాటకు తెరదించుతూ కలిగించిన శాశ్వత ఉపశమనం.
మండుటెండలో, వానలో, చలిలో.. కన్నీళ్లను దిగమింగుకుని వీధుల్లో పోరాడిన, అశువులు బాసిన అమరవీరులకు, అమరావతి తల్లుల దీక్షకు, తమ భూములను రాష్ట్ర భవిష్యత్తు కోసం త్యాగం చేసిన రైతుల సంకల్పానికి నేడు భారత పార్లమెంట్ సాక్షిగా దక్కిన శాశ్వత స్వాంతన.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని సెక్షన్ 5(2)ను సవరిస్తూ, “అమరావతి ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని”గా ఉండాలని కేంద్రం చట్టబద్ధం చేసింది. గతంలో ఉన్న “కొత్త రాజధాని” అనే అస్పష్టమైన పదాన్ని తొలగించి, ఇప్పుడు అధికారికంగా “అమరావతి” అనే పేరును చట్టంలో చేర్చారు.ఈ చట్ట సవరణ 2024 జూన్ 2వ తేదీ నుండి అమలులోకి వచ్చినట్లుగా పరిగణించబడుతుంది.
అమరావతి అంటే ఏపీ సీఆర్డీఏ (APCRDA) చట్టం, 2014 కింద నోటిఫై చేయబడిన రాజధాని నగర ప్రాంతాలన్నీ ఇందులో భాగమేనని స్పష్టం చేయబడింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పక్షాలను ఏకతాటిపైకి తెచ్చి, హస్తిన సాక్షిగా “Amaravati shall be the new capital” అని చట్టంలో శాశ్వతంగా లిఖించేలా చేయడం ఒక అసాధారణ విజయం. అది చంద్రబాబు నాయుడి దార్శనికతకు, కష్టానికి దేశం ఇచ్చిన గౌరవం. 2026 ఏప్రిల్ 6న వెలువడిన ఈ గెజెట్, జూన్ 2, 2024 నుండి అమలులోకి వచ్చినట్లు ప్రకటించడం ద్వారా గడిచిన కాలంలో జరిగిన సందిగ్ధతను, చీకటిని పటాపంచలు చేసింది.
అమరావతి అంటే ఇకపై కేవలం ఒక ప్రాంతం కాదు, అది చట్టబద్ధమైన ఆంధ్రుల రాజధాని. ఏపీ సీఆర్డీఏ పరిధిలోని ప్రతి అంగుళం అభివృద్ధికి ఇక ఆకాశమే హద్దు అని కేంద్రం స్పష్టం చేస్తూ చారిత్రక న్యాయం చేసింది.
ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవ శిఖరంగా అమరావతి నిలబడబోతోంది. నవ్యాంధ్ర పునర్నిర్మాణానికి పునాది పడింది, ఆంధ్రుడి కలల సౌధం సాకారమైంది. ఇది ప్రజా సంకల్పానికి, నాయకత్వ పటిమకు దక్కిన అఖండ విజయం!
