– రైతుల ముసుగులో బాబు స్పాన్సర్డ్ రియల్ ఎస్టేట్ యాత్ర
– పాపాల నుంచి పాప పరిహారం యాత్ర అని పేరు పెట్టుకుంటే బాగుండేది
– ఇందులో రైతులెక్కడ ఉన్నారు.. అంతా తెలుగుదేశం వాళ్ళే కదా..!
– రైతుల ముసుగులో పచ్చ కార్యకర్తలు పోలీసులపై రెచ్చిపోయింది పచ్చ మీడియాకు కనిపించలేదా..?
– అది రైతుల యాత్రో.. రియల్ ఎస్టేట్ వ్యాపారుల యాత్రో ఓ వర్గం మీడియాకు ఇంకా అర్థం కాకపోవడం బాధాకరం.
– 1989 నుంచి 2019 వరకు కుప్పానికి ఎమ్మెల్యేగా ఉంది బాబే కదా, ఏం పీకావని మీ నాన్నను అడుగు లోకేష్..
– టీడీపీ హయాంలో 2019 మే30 వరకు డిస్కంలకు బకాయిలు రూ. 17 వేల కోట్లు ఉన్నాయి.. అప్పుడేంచేశారు పయ్యావులా..?
– రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) ప్రెస్ మీట్
మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
అభివృద్ధి కార్యక్రమాల అమలు కోసం, మాకు రావాల్సిన నిధులు కోసం కేందాన్ని అడగటానికి వెళుతున్నాం. మరి తెలంగాణ సీఎం కేసీఆర్ ఏమడుక్కోవడానికి వెళుతున్నారు ఢిల్లీ. ఇంటి బయట కాలర్ ఎగరేసి, ఇంట్లోకి వెళ్లి కాళ్లు పట్టుకునే మనస్తత్వం మా జగన్‌మోహన్ రెడ్డికి అలవాటు లేదు. లోపలైనా, బయటైనా ఒకటే మాట. స్నేహం అంటే స్నేహం, ఢీ అంటే ఢీ.
ఉమ్మడి రాష్ట్రంలో ఆదాయంతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తే… దాన్ని పంచేసుకుని ఇప్పుడు వాళ్లు సోకులు పోతున్నారు. పాడికుండలాంటి హైదరాబాద్‌ను అప్పజెపితేనే అప్పులు పాలైయిందని చెబుతున్నారు. డిక్కీ బలిసిన కోడి చికెన్ కొట్టు ముందు కూస్తే.. ఏమవుతుంది…?
మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక… గత ప్రభుత్వం చేసిన అప్పులు, వడ్డీలకు సంబంధించి సుమారు లక్ష కోట్లు కట్టడం జరిగింది. సరాసరి ప్రజలకు వివిధ పథకాలు ద్వారా నేరుగా వారి ఖాతాల్లో చేరింది లక్ష కోట్లుపై మాటే. మాది పారదర్శక ప్రభుత్వం.
ఇంతకాలం రైతుల్ని మధ్య దళారులు, ఎరువులు, పురుగు మందుల దుకాణాల వాళ్ళు రైతులను వాడేసుకుంటున్నారు, మోసం చేస్తున్నారని చూశాం. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా రైతులను ఇలా వాడేసుకోవడం చూస్తే.. ఆఖరికి రైతు పరిస్థితి ఇలా తయారైందనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ వాళ్లు రైతు ముసుగులో పాదయాత్ర చేయడం పెద్ద హాస్యాస్పదంగా ఉంది. పాపాలు చేయడం దగ్గర నుంచి పాపపరిహారం కోసం యాత్ర అని చంద్రబాబు పేరు పెట్టుకుంటే బాగుండేది.
నిజమైన అమరావతి రైతుల్ని మోసం చేసి డబ్బు ఉన్నవాళ్లని, తనతో తిరిగే తాబేదార్లు, తన బ్రోకర్లు, డబ్బున్న మహరాజులతో ఇక్కడ రైతులకు డబ్బులు ఆశచూపి ఆ పొలాలు అన్ని గుంజుకుని, వాల్చుకున్నారు. ఇంతమంది రైతులను వంచన చేసి, మోసాలు చేసి, ఆ పాపాలను దేవుడి దగ్గర కడుక్కోవడానికి ఇవాళ రైతు వేషంతో టీడీపీ సానుభూతిపరులు,పెట్టుబడిదారులు, నాయకులు చంద్రబాబు బినామీలు ఏజెంట్లు అంతా రైతుల ముసుగులో వెళుతున్నట్లుగా ఈ యాత్ర పరమార్థంగా ఉంది. యాత్రలో నిజమైన రైతు ఎవరైనా ఉన్నారా? వాళ్లంతా తెలుగుదేశం వాళ్లే కదా?
అమరావతి రైతుల కళ్లకు గంతలు కట్టి భూములు లాక్కోవడమే కాకుండా న్యాయస్థానాన్ని, న్యాయమూర్తులకు కళ్లకు కూడా గంతలు కట్టి రైతుల పేరుమీద దొంగ యాత్రలు చేయడం వీరికే సాధ్యమైంది. 157మందితో యాత్ర చేస్తామని చెప్పి… పార్టీ జెండాలు, కండువాలు కూడా పట్టుకోలేని దుస్థితిలో, దొంగచాటుగా రైతుల ముసుగులో యాత్రలు చేయాల్సిన దుస్థితికి టీడీపీ దిగజారిపోయింది. చంద్రబాబు ఇప్పటివరకూ తనతోపాటు, తన కొడుకును దిగజార్చడమే కాకుండా నిఖార్సైన పార్టీ కార్యకర్తల్ని కూడా దిగజార్చారు.
రైతుల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపార యాత్ర చేస్తూ.. రైతు ముసుగులో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు. ఇది రాజకీయాల్లో కడు హీనమైన దుస్థితి అని చెప్పుకోవాలి. ఈ పాదయాత్రకు నిర్మాత, దర్శకుడు, స్క్రీన్ ప్లే… అన్ని నయ వంచకుడు చంద్రబాబు నాయుడే. ఈ ప్రపంచంలోనే అతి పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన ఘనుడు బాబే. గుంటూరు జిల్లాలో ప్రారంభమై ప్రకాశం జిల్లాలో జరుగుతుందని చెబుతున్న ఈ యాత్ర మొత్తం టీడీపీ మయం అయిపోయింది.
చంద్రబాబు తాను చేసిన పాపాలు దగ్గర నుంచి పాపపరిహార యాత్రలో భాగంగా తన నల్ల డబ్బును తెల్లడబ్బుగా మార్చుకునేందుకు ఓ స్కీమ్ ఏర్పాటు చేశాడు. రోజూ ఈ యాత్రలో లక్షల డబ్బులు విరాళంగా హుండీలో వేయడం జరుగుతోంది. నాకు తెలిసిన ఒక మిత్రుడు కూడా రూ.50 లక్షల విరాళంగా ఇచ్చినట్టు పుస్తకాల్లో రాశారు. వాస్తవానికి ఆ డబ్బు ఎలా ఇచ్చావని అడిగితే… “నాకంత సీన్‌లేదు. ప్రభుత్వం మీద ఫైట్ చేయడానికి కోర్టు ఫీజులకే డబ్బులు చాలడం లేదు. ఇంకా నాదగ్గర ఎక్కడున్నాయి. చంద‍్రబాబు పంపించిన పొట్లాన్ని .. ఆ హుండీలోనే వేశాను”అని చెప్పిన పరిస్థితి. విరాళాల పేరుతో నల్లడబ్బును తెల్లడబ్బుగా మార్చుకునేందుకు లోపాయికారి ఎత్తుగడగా చంద్రబాబు వాడుకుంటున్నాడు.
పాప ప్రక్షాళన యాత్ర జరిగే రూట్ మ్యాప్ తీసుకుంటే.. సమాజంలో ఘర్షణలకు దారి తీసేదానికి ఎంత కుట్రలు దాగి ఉన్నాయో అర్థం అవుతుంది. బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల సామాజిక వర్గాల వారిని కవ్విస్తూ సాగుతున్న యాత్ర ఇది. అమరావతి ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు ఇళ్ల స్థలాలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంటే సోషల్ డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందంటూ చంద్రబాబు కోర్టుకు వెళ్లి అడ్డుకోవడం, స్టేలు తేవడం చూశాం. మరి వీళ్లు రైతులు, రైతాంగం ఎలా అవుతారు?
రైతు అనేవారెవరైనా… వండటానికి బియ్యం లేకపోయినా.. తన అన్నం కుండలో ఉన్న అన్నాన్ని ఆకలిగా ఉన్నవారికి పెట్టే గొప్ప ధర్మవేత్తగా, దయార్థహృదయుడుగా ఉంటారు. మరి ఇదే పాదయాత్రలో పాల్గొన్న రైతు నిజమైన రైతేనా అనే అనుమానం కలుగుతుంది. అమరావతిలో రైతుల పేరుతో ఉన్న పెట్టుబడిదారుల్ని మోసం చేసింది ఎవరు? ఎవరైతే భూములు ప్రభుత్వానికి లీజ్‌కు ఇచ్చారో వాళ్లందర్ని మోసం చేసింది ఎవరు? అయిదేళ్లు అధికారాన్ని అనుభవించి, ఇచ్చిన భూములను కనీసం ప్లాట్లుగా కూడా విభజించకుండా… వారిని మోసం చేసిందీ, వంచించిందీ… ఇప్పుడు నక్క వినయాలు పోతున్న చంద్రబాబు కాదా?
పెట్టిన పెట్టుబడులు ఇరుక్కుపోవడంతో వారి ఆర్థిక బలహీనతలు క్యాష్ చేసుకుని, తగుదునమ్మా అంటూ వారిని ఇక్కడ నుంచి అక్కడ వరకూ పాదయాత్ర పేరుతో నడిపిస్తూ.. మళ్ళీ మళ్ళీ మోసం చేస్తున్నది చంద్రబాబు నాయుడు కాదా?ఎన్టీ రామారావు దగ్గర నుంచి పార్టీని, అధికారాన్ని లాక్కుని… ఆయన చనిపోయిన తర్వాత ఫోటోకు దండేసి, సాష్టాంగ నమస్కారం పెట్టడానికి… ఇవాళ అమరావతిలో చేస్తున్న తంతుకి ఏం తేడా ఉందని చంద్రబాబును సూటింగా ప్రశ్నిస్తున్నాం.
దశాబ్ధాల పాటు జర్నలిజానికి చుక్కానిగా మేము ఉన్నాం అని చెప్పుకునే వ్యక్తులు.. అమరావతి యాత్ర గురించి రోజూ తాటికాయంత అక్షరాలతో ఏం రాస్తున్నారు? పోలీసులు ఝులుం అట. వాళ్లు చూపించే వీడియోల్లోనే రైతుల ముసుగులో ఆకుపచ్చ కండువాలు వేసుకున్న పచ్చ కార్యకర్తలు, పోలీసుపై ఏవిధంగా దాడి చేసి, దుర్భాషలాడుతున్నారో అర్థం అవుతుంది. వాళ్లు చూపించే విజువల్స్‌కు… కింద రాసే రాతలకు ఏమాత్రం పొంతనలేకపోవడం అనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇది నిజంగానే రైతుల యాత్ర అని ఊదరగొడుతున్న ఒక వర్గం మీడియాకు ఇంకా అర్థం కాకపోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం.
రాయలసీమలో హైకోర్టు పెట్టడానికి వీల్లేదంటారు. విశాఖలో పరిపాలన రాజధాని ఉండకూడదని, మొత్తం మాకే కావాలని మాట్లాడతారు. రాజధానులకు సంబంధించి, సంబంధం లేని అభివృద్ధి కార్యక్రమాలను కూడా అడ్డుకునేందుకు కోర్టులకు వెళ్లి స్టేలు తేవడం చూశాం. రాజధాని అనేది అమరావతిలోనే ఉండాలి, మేము బాగుపడిన తర్వాతే ఏ జిల్లా అయినా బాగుపడాలనేది దుర్మార్గపు ఆలోచన చంద్రబాబుది. జగన్‌గారు గెలిస్తే మీరంతా నాశనం అయిపోతారు, అభివృద్ధి అంతా నాశనం అయిపోతుందంటూ కృష్ణా, గుంటూరు జిల్లాలో చంద్రబాబు 2019 ఎన్నికల ముందు నుంచి పాట మొదలుపెట్టాడు.
ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల్లోనూ మీకు సిగ్గుంటే, ఉప్పూ, కారం తింటుంటే, వైయస్సార్ సీపీని ఓడించాలంటూ వంగి వంగి దండాలు పెట్టి వెళ్లాడు, ఏమైంది? ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు గడ్డి పెట్టి శృంగభంగం చేశారు. అమరావతి ప్రజల్లో జగన్‌గారి మీద ఎలాంటి అభిప్రాయం ఉందో టీడీపీకి వత్తాసు పలికే మీడియాకు ఇంకా అర్థం కాకపోవడంతో నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి.
చంద్రన్న దేవుడు అంటూ… కుప్పంలో ఓట్లు అడుక్కోవడానికి వెళ్లిన లోకేష్ మాట్లాడం చూస్తే వారి బుద్ధి ఇక మారదా… అనే అనుమానం వస్తుంది? వారి భావజాలం మారదు. 2019 ఎన్నికలకు ముందు కూడా చంద్రబాబు బంధువు ఒకరు… తిరుపతి వెంకన్నకు కూడా కులాన్ని ఆపాదిస్తూ… “వెంకన్న చౌదరి మా బంధువే. వెంకటేశ్వరస్వామి మా కమ్మవాళ్లే” అని ఒకరంటే… ఇంకొకడు ఏకంగా మా నాన్న దేవుడు అంటాడు. చంద్రబాబు ఎవరికి దేవుడు? మైక్ దొరికితే ఏదిపడితే అది మాట్లాడటం, పిచ్చి ప్రేలాపనలు చేయడమా?
చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి అనైతికంగా ఓటర్లను ఏమార్చడానికి నాంది, ముగింపు ఆయనతోనే. డబ్బులతో రాజకీయాలు నడపాలనే నీచ మనస్తత్వం చంద్రబాబుది. కుప్పంలో ఓటుకు రెండువేలు ఇస్తూ మీరు తిరుగుతున్న మాట వాస్తవమా కాదా? రాజకీయాల దగ్గర నుంచి ఎన్టీఆర్‌ను గద్దె దించడం వరకూ కొనుగోలు బతుకు చంద్రబాబుదే. కొనుగోలు, కొనుక్కునే మనస్తత్వం మీ నాన్న చంద్రబాబుది, అది మీ రక్తంలోనే ఉందనేది నారా లోకేష్ గుర్తెరిగితే మంచిది.
రెండున్నరేళ్లలో హంద్రీనీవా ప్రాజెక్ట్ విషయంలో ఏం పీకారని లోకేష్ మాట్లాడుతున్నాడు. 1989 నుంచి 2019 వరకు కుప్పంలో ఎమ్మెల్యేగా గెలిచి ఏడ్చినోడు ఎవడ్రా అని మేము అనవచ్చు. అయితే మాకు సభ్యత, సంస్కారం ఉంది. మీ నాన్న కాదా అక్కడ ఎమ్మెల్యే. అన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, 14ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన బాబు .. హంద్రీనీవాకు ఏం చేశారో చెప్పాలి. రెండున్నరేళ్లలోనే ఏం చేశావని జగన్‌గారిని అడుగుతావా? ” నాన్నారు ఏం పీకారంటూ” లోకేష్ వాళ్ళ నాన్నను అడగవచ్చు కదా ? ఇలా మాట్లాడినోడి నాలుకను ఏం చేయాలి?
అప్పులు చేసి, సత్యం రామలింగరాజు లాంటి వ్యక్తుల కాళ్ళు పట్టుకుని అమెరికా పంపిస్తే.. ఈ బూతులేంటిరా అని లోకేష్‌ను వాళ్ల అమ్మానాన్న అయినా నాలుక చీరేయాలి కదా? కుప్పం గడ్డ చంద్రబాబు అడ్డా అని చెప్పుకోడానికి రేపు జరిగే మున్సిపల్ ఎన్నికల ఫలితాలే తేలుస్తాయి. రెండున్నరేళ్లలో ముఖ్యమంత్రి గారు కుప్పం వచ్చారా అని ప్రశ్నిస్తున్నారే? కుప్పం ఎమ్మెల్యేగా ఏడిసినోడు మరి ఈ రెండున్నరేళ్లలో తండ్రీకొడులు ఎందుకు వెళ్ళలేదు? ఈరోజు కుప్పం మున్సిపాల్టీ ఎన్నిక వచ్చిందని వెళ్ళింది నిజం కాదా..?
27 ఏళ్లుగా కుప్పం ఎమ్మెల్యేగా వున్న మీ నాన్న ఏం పీకాడో ముందు అడుగు లోకేష్. ఈ రెండున్నరేళ్లలో మీరిద్దరు ఎప్పుడైనా కుప్పంలో కనిపించారా? ఏం పీకారు? ఏం పీకుతావు… ఇది తప్పితే ఇంకో మాట మీ నోట్లో నుంచి వస్తుందా? 2019 నుంచి మొదలుపెట్టి ఇప్పటివరకూ మేము ఏం పీకామో మీకు కనిపించలేదా? రేపు కుప్పంలో పీకినా మీకేమీ కనిపించదు.
ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేయడం కాదు. టీడీపీ హయాంలో ప్రజలకు నిత్యావసర వస్తువులు ఫ్రీగా ఇచ్చేవారా? మీ హెరిటేజ్‌లో చింతపండు ఎంతకు అమ్మారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. గతాన్ని ప్రజలు మర్చిపోతారాని అనుకుంటే పొరపాటే. దైర్యాన్ని మీ నాన్న దగ్గర, నీ దగ్గరే చూడాలి. డబ్బు మూటలతో మీరు పంపించిన వ్యక్తి తెలంగాణలో కేసీఆర్ దగ్గర దొరికేస్తే ..తెల్లారేసరికి నువ్వు, మీనాన్న ఎక్కడ ఉన్నారు?. కరకట్ట కింద తేలారు? అలాంటిది ధైర్యం, దమ్ము గురించి మీరు మాట్లాడటమా?
ధైర్యం, సాహసం, పట్టుదల, సంకల్పం అంటే జగన్ మోహన్ రెడ్డిది. పది జన్మలు ఎత్తినా నువ్వు, మీ నాన్న జగన్ కాలి గోటికి కూడా సరిపోరు. సోనియాగాంధీతో చీకట్లో చేతులు కలిపి.. మీ పార్టీ నేతలు కూడబలుక్కుని కోర్టులో తప్పుడు కేసులు వేసి, అక్రమంగా 16 నెలలు బెయిల్ రాకుండా రాజకీయంగా దెబ్బతీసి, మానసికంగా నిర్వీర్యం చేయాలని చూశారు. అయినా ఏమాత్రం తగ్గలేదు. ఆత్మసాక్షితో, మనోదైర్యంతో చంద్రబాబు, సోనియాకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మొనగాడు జగన్.
పాపపు సొమ్ముతో 23మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినా ఏమాత్రం తగ్గకుండా.. ఇంతింతై వటుడింతై అన్న చందాన… ఇవాళ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 151 ఎమ్మెల్యేలతో గెలిచి, అక్కడితో ఆగకుండా ఈ రాష్ట్రంలో మీరు ఒక్క ఎమ్మెల్సీ పదవి కూడా గెలవలేని స్థితికి మిమ్మల్ని తీసుకు వచ్చారు.
ఇంత జరిగినా మీకు జ్ఞానం కలగకపోవడం మీ దౌర్బాగ్యం. పులి కడుపున పులి పుడుతుంది. పులి లాంటి వైయస్ రాజశేఖర్‌రెడ్డిగారికి పులిలాంటి జగన్‌గారు పుడితే…నక్కలాంటి చంద్రబాబుకు గుంటనక్కలాంటి లోకేష్ పుడతాడు. లోకేష్‌ను చదువుకోమని విదేశాలకు పంపిస్తే చదువు రాలేదు కానీ…మంచి బూతులు మాత్రం నేర్చుకుని వచ్చాడు. అబద్దాలు, కుట్రలు నేర్చుకొచ్చాడు. ఇలాంటి లోకేష్‌ను తెలుగుదేశం పార్టీ భవిష్యత్ వారసుడిగా చెప్పుకోవడం కూడా సిగ్గుచేటు. టీడీపీ జెండా మోసే నిఖార్సయిన కార్యకర్తలకు ఇది మానసిక వ్యధ కలిగించే విషయంగా చెప్పుకోవాలి.
డిస్కంలకు బకాయిలు ఉన్నాయి కట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారని పయ్యావుల కేశవ్ జేమ్స్‌బాండ్ లా ఏదో తవ్వి తీసినట్టు మాట్లాడుతున్నాడు. 2019 మే 30 వరకూ టీడీపీ సర్కార్ ఉంది కదా. అప్పటికి డిస్కంలకు ఏపీ సర్కార్ రూ.17వేల కోట్లు బకాయిలు చెల్లించాలి. మరి ఈవిషయం పయ్యావులకు అప్పడు కనిపించలేదా? షాడోగారు ఈ విషయం అప్పుడు కనిపెట్టలేకపోయాడా?
2014లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పవర్ సప్లయి కంపెనీలకు బకాయిలు రూ.3వేల కోట్లు. వీళ్లు అధికారంలో నుంచి దిగేసరికి బకాయిలు రూ.21వేల కోట్లకు వెళ్లిపోయారు. 2014లో మీరు అధికారంలోకి వచ్చేసరికి విద్యుత్ సరఫరా చేసే కంపెనీల ఆర్థిక నష్టాలు రూ.33వేల కోట్లు ఉన్నాయి. టీడీపీ అధికారం నుంచి వెళ్లిపోయేటప్పటికి అవి సుమారు రూ.70వేల కోట్లకు చేరాయి. ఇప్పుడు కొత్తగా శ్రీరంగనీతులు చెబుతారా?