Suryaa.co.in

Andhra Pradesh

జగన్మోహన్ రెడ్డి నియంత్రత్వ పాలనపై సీజేఐకి వినతిపత్రం

• వైసీపీ ప్రభుత్వ హింసాత్మక చర్యలు, ఇవ్వాలని సమావేశంలో నిర్ణయం
• రాష్ట్రస్థాయిలో ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయం
• జిల్లా, మండల స్థాయిలో ప్రజాస్వామ్య పరిరక్షణవేదిక కమిటీల ఏర్పాటుకు చర్యలు
• ప్రభుత్వ అణచివేతకు గురైన వారికి వేదిక అండగా ఉండాలని సమావేశంలో నిర్ణయం
– జగన్మోహన్ రెడ్డి నడుపుతున్నది రాజకీయపార్టీకాదు.. ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ.
– ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం – ప్రజాస్వామ్య పరిరక్షణ సదస్సు పేరిట టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశం

సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభోపన్యాసం :
‘స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం-సేవ్ డెమోక్రసీ’ కార్యక్రమానికి విచ్చేసిన అన్నిపార్టీలు, ప్రజాసంఘాల నేతలకు, టీడీపీఅధినేత చంద్రబాబు తరపున హృదయపూర్వక నమస్కారాలు. డిసెంబర్ 30కి జగన్ రెడ్డి పాలన ప్రారంభమై 3సంవత్సరాల 7 నెలలు అవుతోంది.ఇన్నాళ్ల వైసీపీ పాలనలో5కోట్లమంది ప్రజలు రాష్ట్రచరిత్రలో ఎన్నడూలేనంతగా మోసపోయారు.ఒక్కఛాన్స్ అని నమ్మిన ప్రజలు వైసీపీకి 151 స్థానాలు కట్టబెట్టారు.మూడున్నరేళ్లలో ఏపీలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ కాబడింది.రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్ర్యాన్ని రాష్ట్ర ప్రజలు కోల్పోయారు. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజలకు మేలుచేస్తూ, వారిసంక్షేమం, అభివృద్ధి కాంక్షించాలి. ప్రతిపక్షాలు ప్రభుత్వపాలనలోని లోపాలు ఎత్తిచూపుతూ, ప్రజాసమస్యలను పాలకులదృష్టికి తీసుకెళ్తూ, ప్రజలతరుపున ప్రశ్నించాలి. ఇదే ప్రజాస్వామ్యం మనకు కల్పించిన విధానం.

రాష్ట్రానికి ఒక దుర్మార్గుడు, ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రి అయ్యాడు.తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకొని లక్షలకోట్లు దోచుకున్నాడని, దేశంలోనే అత్యున్నత విచారణసంస్థలైన సీబీఐ, ఈడీలు చెప్పాయి.అవినీతికేసులతో ఈ వ్యక్తి 16నెలలు జైల్లో ఉన్నాడు. అలాంటి వ్యక్తిని నమ్మి ఓట్లేసిన ప్రజలు, ఇప్పుడు నిత్యం విలపిస్తున్నారు. దోచుకోవడానికే జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. పాలకుల దోపిడీదెబ్బకు 37 నెలల్లోనే రాష్ట్రంలోని ప్రకృతి, సహజవనరులు మాయమవుతున్నాయి. భూములు, ఇసుక, ఖనిజాలు, ఎర్రచందనం, లాంటివాటిని జగన్మోహన్ రెడ్డి తనగుప్పెట్లో పెట్టుకున్నాడు. రాష్ట్ర సంపద దోచుకోవడం ఒకఎత్తు అయితే, రాష్ట్రాన్ని, ప్రజల్ని తాకట్టు పెట్టి దాదాపుగా రూ.6.50లక్షలకోట్లు అప్పులు తెచ్చారు. ఆ సొమ్మంతా ఏమైందో తెలియదు? అప్పులు చాలవన్నట్లు అన్నింటి ధరలు పెంచారు, పన్నులభారంతో ప్రజల్ని కుంగదీస్తున్నారు. చివరికి చెత్తపై, మరుగుదొడ్లపై, నీటిపై పన్నులేశారు. ప్రభుత్వం ఈ విధంగా దోపిడీకోసం అన్యాయంగా అడ్డదారులు తొక్కుతుంటే, ప్రశ్నించకూడదా?

ప్రశ్నిస్తే అరెస్ట్ లుచేయడం.. అర్థరాత్రిళ్లు ఇళ్లలోకి చొరబడి బలవంతంగా తీసుకెళ్లడం, సోషల్ మీడియాలో పోస్టులపెట్టారంటూ నిర్బంధించడం లాంటి చర్యలతో రాష్ట్రంలో మరేపార్టీ ఉండకూడదు అన్నంత దుర్మార్గంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడు. ముఖ్యమంత్రి దౌర్జన్యాలకు, అక్రమకేసులు, ఆకృత్యాలకు ప్రజాస్వామ్యవాదులమైన మనం ప్రజాస్వామ్యరక్షణకోసం పోరాడాము.ప్రజాస్వామపరిరక్షణలో భాగస్వాములైన ప్రతిఒక్కరికీ శిరస్సువంచి నమస్కరిస్తున్నాం. ఎప్పుడైనా సాధారణంగా ప్రభుత్వంలో వ్యతిరేకత అంటే, ఒకవ్యక్తిపైనో, ఒకప్రాంతంపైనో ఉండేది.కానీ వైసీపీప్రభుత్వం మొత్తంమ్మీద రాష్ట్రంలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అన్నివర్గాల ప్రజలు ముఖ్యమంత్రిపై చెప్పలేనంత ఆగ్రహంతో ఉన్నారువైసీపీలోని పెద్దలు, కీలకనేతలే ప్రభుత్వతీరుతో విసిగిపోయారు.దాన్నుంచి ప్రజల్ని దారిమళ్లించడానికే ముఖ్యమంత్రి కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రేపడానికి ప్రయత్నిస్తున్నాడు. తనను, తనప్రభుత్వాన్ని ప్రశ్నించారన్న అక్కసుతో మీడియాపై, ప్రజాసంఘాలపై, ఆఖరికి కోర్టులపై కూడా ముఖ్యమంత్రి దుష్ప్రచారం చేశారు.అధికారంలోకి వచ్చీరాగానే ముఖ్యమంత్రి ప్రజావేదిక విధ్వంసంతో, తన విధ్వంసకర పాలనకు అంకురార్పణచేశాడు.

అమరావతి విధ్వంసంతో యువతకు ఉపాధి, ఉద్యోగాలు లేకుండా , రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేశాడు.దుర్మార్గుడైన జగన్ రెడ్డి నాయకత్వంలో పట్టపగలే టీడీపీ కార్యాలయంపై దుండగులు దాడిచేశారు. వైసీపీ ఎమ్మెల్యే ప్రతిపక్షనేత ఇంటిపై దాడిచేస్తే, ఇదేమిటని ప్రశ్నించినవారు లేరు.ప్రశ్నించినవారిపైకి రాత్రిళ్లు పోలీసుల్ని పంపడం, జేసీబీలతో ఇళ్లు, కార్యాలయాలు కూల్చివేయడం. ధైర్యంగా పోరాడే ప్రతిఒక్కరినీ ముఖ్యమంత్రి వెనకనుంచి దెబ్బకొడుతున్నాడు.వివేకానందరెడ్డిని ఎవరు చంపారు? ముఖ్యమంత్రికి సొంత చిన్నాన్నను దారుణంగా చంపితే, ఎవరో చంపారో ఇంతవరకు తేల్చలేకపోయారు. బడుగు, బలహీనవర్గాలపై ఈ ప్రభుత్వం దాదాపు 1,644 కేసులు పెట్టింది.నన్ను, కొల్లురవీంద్రను, యనమల రామకృష్ణుడిని వేధించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలతరుపున ప్రశ్నించడమే తాముచేసిన తప్పా?స్థానికసంస్థల ఎన్నికలు రాష్ట్రంలో ఎలా జరిగాయో అందరూ చూశారు. దళితులపై అమానుషాలకు ఒడిగట్టారు, మద్యం అమ్మకాలు ప్రశ్నిస్తే దాడి, మాస్కులు అడిగితే దాడి, పల్నాడులో ఆత్మకూరులో దళితులపై దాడి.

నడిరోడ్లపై హత్యలు జరుగుతున్నాయి.. ప్రజలంతా భయంతో వణికిపోతున్నారు.ఏ సర్వేచూసినా వైసీపీకి వచ్చేఎన్నికల్లో సింగిల్ డిజిట్ రాదనే చెప్తోంది. దాంతో ఏంచేయాలో తెలియకే ముఖ్యమంత్రి మాచర్లలో మారణహోమానికి తెగబడ్డాడు. మున్సిపల్ ఎన్నికల సమయంలో మాచర్ల వెళ్లిన టీడీపీనేతలు బొండాtd ఉమా, బుద్దావెంకన్నలను చంపడానికి యత్నించారు.వారిపై దారుణానికి తెగబడిన వ్యక్తికే ఈప్రభుత్వం మున్సిపల్ ఛైర్మన్ పదవిచ్చి సత్కరించింది. ఇవన్నీ చూశాక ప్రజాస్వామ్యం ఏమవుతుందోనన్న ఆందోళన ప్రతి ఒక్కరినీ కలిచివేస్తుంది. టీడీపీనేతలపై దాడిచేసినప్పుడే మాచర్లలో వైసీపీవారిని పోలీసులు కట్టడిచేసుంటే, మొన్నటికి మొన్న మాచర్లలో ఇళ్లు, వాహనాలు దగ్ధమయ్యేవా?వందలాది కుటుంబాలు ఇళ్లు, వాకిళ్లు, పొలాలు వదిలి ప్రాణభయంతో తలదాచుకునేవా? ఈ రోజు ఈ సమావేశం పెట్టడానికి ప్రధానకారణం రాష్ట్రంలో ప్రజాస్వామ్యపరిరక్షణ కోసం. ప్రజాస్వామ్యం ఉంటేనే రాజకీయపార్టీలు, ప్రజలు మనగలుగుతారన్నది నిజం.ప్రజాస్వామ్యపరిరక్షణలో పార్టీలన్నీ ఏకంకావాలి.. ఎన్నికలసమయంలో ఎవరి ఆలోచనల ప్రకారం వారువెళ్లడం సాధారణమే. ప్రజలకు మంచిచేయడానికి మనందరం కలిసికట్టుగా పనిచేద్దామని, ఈ సమావేశంలో ప్రజలకోసం కొన్ని తీర్మానాలు చేయాలని అభ్యర్థిస్తున్నాను. రెండు, మూడురోజుల్లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు విజయవాడ వస్తున్నారని సమాచారం. అఖిలపక్షం తరుపున శ్రావణ్ కుమార్ చొరవతీసుకొని, చీఫ్ జస్టిస్ అపాయింట్ మెంట్ తీసుకోవాలని కోరుతున్నాం.రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, ఆకృత్యాలు, దారుణాల్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాలని అందరితరుపున విజ్ఞప్తిచేస్తున్నాం.

కొంత ఆలస్యమైనా చాలారోజుల తర్వాత ఇలాంటి సమావేశం జరుపుకోవడం చాలాసంతోషాన్ని ఇచ్చింది.స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అయ్యాక కూడా ఇలాంటి వాటిపై చర్చించుకోవాల్సి రావడం బాధాకరం.ఈ సమావేశానికి ‘ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక’ అని పేరు పెడుతున్నాం.ఇకపై రాష్ట్రంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ఈ వేదిక వారికి అండగా నిలబడాలి. ప్రజాసంఘాలు, మహిళాసంఘాలు, రైతుసంఘాలు, న్యాయవాదులు అందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు.మాట్లాడటానికి అవకాశం రానివారు దయచేసి బాధపడవద్దని కోరుతున్నాం. ఇటువంటి సమావేశాలే మండల, జిల్లాస్థాయిలో నిర్వహించాలి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని కలిసేందుకు కూడా అందరం ఒకకమిటీ వేసుకొని అభిప్రాయాలు పంచుకుందాము.మద్యనిషేధం అమలుచేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి,అధికారంలోకి వచ్చాక మాటతప్పాడని లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పారు.దేశంలో ఎక్కడాలేని కల్తీమద్యం అమ్మకాలతో రాష్ట్రంలో పేదల ఆరోగ్యాన్ని హరిస్తున్నారని ఆయన చెప్పడం నిజంగా ఆలోచించాల్సిన విషయం.
ప్రజాస్వామ్యం అనేదే లేకపోతే, మనం ఇకపై దేనిగురించి, ఎక్కడా మాట్లాడలేమని తెలుసుకోండి.
ఏ వర్గాన్ని విడిచిపెట్టకుండా జగన్మోహన్ రెడ్డి కక్షతో వ్యవహరిస్తున్నాడు.. అతని నైజానికి చెక్ పెట్టేందుకు అందరం ఒక్కటై పోరాడాలి.ఏదైనా జరగరానిది జరిగి రేపు మరలా జగన్మోహన్ రెడ్డే అధికారంలోకివస్తే, అందరం రాష్ట్రం వదిలిపోవాల్సిందే.జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలోకలిపేందుకు అందరం సంఘటితమవుదాం.మాచర్లసహా, పల్నాడులో ఉన్న పరిస్థితుల్ని పరిశీలించడానికి, బాధితులకు ధైర్యం చెప్పడానికి ‘ప్రజాస్వామ్యపరిరక్షణ వేదిక’ తరుపున ఆ ప్రాంతానికి వెళ్దాం.

ముందస్తు ఉబలాటంతో ఉన్న ఈ ముఖ్యమంత్రి ముందే పోతే ప్రజలకు మేలుచేసిన వాడవుతాడు : రామకృష్ణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు
రాష్ట్రంలోని రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలతో ఒకమంచి సమావేశం ఏర్పాటు చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలగురించి ఎవరూ ఆలోచించడంలేదు.ప్రజాసంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, రైతు, మహిళాసంఘాలన్నీ వారివారి సమస్యలపై ర్యాలీలు, ధర్నాలు చేయడం ఎప్పటినుంచో జరుగుతున్నదే.ఈ ముఖ్యమంత్రి మాత్రం ఎవరినీ బయటకు రానివ్వడు. ఛలో అసెంబ్లీ కార్యక్రమం చేపడితే అడ్డుకుంటారు. రోడ్లపైకి వస్తే నిలువరిస్తారు. అసెంబ్లీ జరిగేటప్పుడే ఎవరైనా ‘ఛలోఅసెంబ్లీ’ నిర్వహిస్తారనే ఆలోచన కూడా లేకుండా పోలీసులు అసెంబ్లీ జరుగుతోంది, ఎవరూ బయటకు రాకూడదని చెప్పడం దారుణం. ఉపాధ్యాయులు ఛలో అసెంబ్లీ పెట్టారని, పోలీసుల్ని స్కూళ్లవద్ద కాపలా పెట్టారు. ఇళ్లకు వెళ్లి బెదిరించారు. ఇవన్నీ ప్రజాస్వామ్య హననానికి పరాకాష్ట.ముఖ్యమంత్రి ఎక్కడికెళ్లినా పరదాలు కట్టుకుంటున్నాడు. పదవినుంచి దిగిపోయే నాటికి ఈయన బురఖా వేసుకోవడం ఖాయం. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ధర్నాలు చేయకూడదా? పోలీసులసాయంతో ఎన్నాళ్లు అడ్డుకుంటారు? రాష్ట్రంలో జరిగేవన్నీ చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు. అధికారపార్టీ ఎమ్మెల్సీ తనవద్ద పనిచేసే డ్రైవర్ ని కొట్టిచంపి, శవాన్ని డోర్ డెలివరీ చేసిన సంఘటన దేశంలో ఎక్కడా జరగలేదు… ఈరాష్ట్రంలో తప్ప.
అంత దారుణం జరిగితే జగన్మోహన్ రెడ్డి ఏనాడైనా అది తప్పు అని అనలేదు. శ్రావణ్ కుమార్ గట్టిగా పట్టుబట్టడం వల్లే దళితుడిని చంపిన అధికారపార్టీ ఎమ్మెల్సీ జైలుకెళ్లాడు. జైలు నుంచి బయటకువస్తుంటే, అతనికి అధికారపార్టీవారు ఎదురెళ్లి, ఊరేగింపుగా స్వాగతం పలుకుతారు.తప్పుచేసిన వాడికి దండలేసి, ఊరేగింపులు చేస్తూ, ప్రజలకు రాష్ట్రానికి ఎలాంటి సంకేతం ఇస్తున్నారు.దళితుల ఓట్లతోనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ ఆ దళితులపై దారుణాలు, దుర్మార్గాలు జరుగుతున్నా ఆయన స్పందించడు.

మాచర్ల కంటే దారుణంగా, పుంగనూరులో జనసేనవారిపై అధికారపార్టీ దాడిచేసింది.జనసేన నేత రైతులతరుపున పోరాడకూడదా? వైసీపీ వారు దాడిచేస్తుంటే పోలీసులు ఆపరా?పోలీసులు అధికారపార్టీకి అనుకూలంగా ఉండటం సహజంగా జరిగేదే.. కానీ ఇప్పుడు చేస్తున్నట్లు పూర్తిగా లొంగిపోయి, ఇంతలా దిగజారడం ఎప్పుడూ చూడలేదు.అధికారం ఈ ముఖ్యమంత్రికి శాశ్వతమా.. రాష్ట్రం ఏమైనా ఆయన జాగీరా? రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది, ప్రజలు అప్పులపాలయ్యారు.ముందస్తు ఎన్నికలకు వెళ్తే, ఈ ముఖ్యమంత్రి ముందే పోతాడు. ప్రజల్లో తనపై అసంతృప్తి, వ్యతిరేకత పెరుగుతోందని, 2024 వరకు ఆగితే, అసలుకే మోసం వస్తుందని గ్రహించే, ముఖ్యమంత్రి ముందస్తు ఎన్నికలకు వెళ్తాడంటున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రజాస్వామ్యంలో ప్రజాతంత్ర ప్రక్రియ అనేది జరగాలి. ప్రజాతంత్ర పద్ధతుల్లో నిరసనతెలిపే హక్కు ప్రజలకు ఉండాలి. అందరం రాష్ట్రంలోని పరిస్థితుల్ని ఛాలెంజ్ గా తీసుకొని, ప్రజలకోసం పనిచేద్దామని కోరుతున్నాను. ప్రజలందరి రక్షణకోసం మనందరం కంకణబద్ధులవుదాం.

టీడీపీ అధికారంలోకి వస్తే, ప్రజాస్వామ్యవాదుల్ని రక్షిస్తామని హామీ ఇవ్వాలి : వీ.శ్రీనివాసరావు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
ప్రజాస్వామ్య పరిరక్షణ అనే అంశంపై సరైన సమయంలో సమావేశం నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నాం.రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ విధ్వంసాన్ని ఆపాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.రాజ్యాంగానికి పునాది అయిన ప్రజాస్వామ్యం విధ్వంసమైతే, నాగరికతే అంతమై పోతుంది.డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగంలోని భావాలన్నీ సమాధి కాబడుతున్నాయి.మోదీ అండతోనే జగన్మోహన్ రెడ్డి పేట్రేగిపోతున్నాడని చెప్పాలి. ధర్నాలు, ర్యాలీలు చూస్తేనే ప్రభుత్వం భయంతో వణికిపోతోంది. సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తిని కలిస్తే, వారి తీర్పుల్నే ఈ ప్రభుత్వం హరిస్తున్న వైనాన్ని తెలియచేయాలి. టీడీపీ అధికారంలోకి వస్తే, సెక్షన్లు 144, 30 పెట్టమని, ప్రజాస్వామ్యవాదుల హక్కుల్ని పరిరక్షిస్తామని హామీ ఇవ్వాలి. అప్పుడే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కాపాడబడుతుందనే విశ్వాసం ప్రజలకు కలుగుతుంది.

పేదలకు, ధనికులకు మధ్య యుద్ధం అంటున్న ముఖ్యమంత్రి, అనంతబాబు పేదవాడని అతన్ని కాపాడాడా? : సుంకర రాజేంద్రప్రసాద్ (ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ అధ్యక్షులు)
రాష్ట్రంలో ప్రజాస్వామ్యంపై దాడిచేయడమేకాక, వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయి. పోలీస్ , సీఐడీ విభాగాలు అధికారపార్టీకి అనుబంధసంస్థలుగా పనిచేస్తున్నాయి. సీఐడీ ప్రకటనలు చూస్తుంటే హాస్యాస్పదంగా, చిత్రంగా ఉంటుంది. పేదలకు, ధనికులకు మధ్య యుద్ధం జరుగుతోంది అంటున్న ముఖ్యమంత్రి, పేదలపైనే ఎక్కువగా అధికారబలాన్ని ఉపయోగిస్తూ, అణచివేస్తున్నాడు.ఎమ్మెల్సీ అనంతబాబు పేదవాడని, ముఖ్యమంత్రి ఆయన చేసిన దారుణాన్ని సమర్థించాడా? దళితయువకుడు దారుణంగా చంపబడితే, ఎమ్మెల్సీ చంపేస్తే, పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేయడం ఏమిటి?పోలీసుల చర్యలతో అంతిమంగా సామాన్యులే నష్టపోతున్నారు. పోలీస్ వ్యవస్థతో పాటు న్యాయవ్యవస్థను కూడా లొంగదీసుకున్నామనే సంకేతాల్ని పాలకులు ఇస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఇద్దరు హైకోర్ట్ న్యాయమూర్తుల్ని బదిలీచేయించామని ప్రచారం చేస్తున్నారు. బదిలీలపై తాము న్యాయపోరాటం చేస్తున్నాం.న్యాయవ్యవస్థను కూడా లెక్కచేయమనే సంకేతాలతో ప్రజల్ని మరింత భయపెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.డీజీపీని కోర్టులో నిలబెట్టి, సీఆర్ పీసీ సెక్షన్ 151 చదివించారు. న్యాయవాదులుగా మా పోరాటం ఎప్పుడూ సాగుతూనే ఉంటుంది. రాజకీయాలకు అతీతంగా ప్రజాస్వామ్యపరిరక్షణకోసం పెద్దవేదిక ఏర్పడాలి. ఈ ప్రభుత్వమేకాదు, రేపు వచ్చే ఏ ప్రభుత్వమైనా ప్రజాస్వామ్యహక్కులకు తాము భంగం కలిగించమనే హామీని వారి మేనిఫెస్టోలో పెట్టాలి.ప్రజాస్వామ్యహక్కులు, పౌరహక్కులు ఎవరిభిక్షతోనే వచ్చేవికావు.

ప్రజల్ని చంపడం, ప్రతిపక్షాలపై దాడిచేయడం ఎలాంటి పాలన? : నరహరిశెట్టి నరసింహారావు (ఏఐసీసీ నేత)
రాష్ట్రంలో పరిపాలనలో ఎక్కడా మచ్చుకైనా నాగరికత కనిపించడంలేదు. రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారందరూ రాజ్యాంగరక్షణకోసం పోరాడారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏడవనివారు లేరు. పల్నాడులో దారుణాలకు అంతేలేదు.ప్రజల్ని చంపడం, ప్రతిపక్షాలపై దాడులుచేయడం ఎలాంటి పాలన? ఎన్నికల వేళ పార్టీల పంథాలువేరు.. కానీ తరువాత ఎవరైనా ప్రజలకోసం పనిచేయాల్సిందే. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ, స్వర్గీయ ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు స్వాగతించింది.ప్రజలకోసం బాధ్యతగల ప్రతిపక్షం చేపట్టే ఏ కార్యక్రమానికైనా తమమద్ధతు ఉంటుంది.రాజశేఖర్ రెడ్డి కూడా ఏనాడూ ప్రజలకు ముఖంచూపించడానికి సిగ్గుపడలేదు. ఈ ముఖ్యమంత్రిలా పరదాల మాటున దాక్కోలేదు. ప్రతి అరాచకాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ముందు ఉంచాలి : వడ్డే శోభనాద్రీశ్వరరావు (మాజీమంత్రి)
‘స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం-సేవ్ డెమోక్రసీ’ పేరుతో ముద్రించిన పుస్తకంలో ఈ ప్రభుత్వంలో జరిగిన దారుణాల్ని సవివరంగా తెలియచేశారు. గ్రామాల్లో ఎవరైనా ప్రభుత్వ, పాలకుల దోపిడీపై నోరెత్తితే వారి పింఛన్లు, రేషన్ కార్డులు తీసేస్తున్నారు, ఇళ్లు కూల్చేస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొద్దిరోజుల క్రితం ఒక కేసు విచారణలో స్పందిస్తూ, ‘రాష్ట్రంలో కాన్ స్టిట్యూషనల్ మిషనరీ పనిచేస్తుందా..లేదా?’ అని ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ను ప్రశ్నించింది.

రాజ్యాంగం ప్రకారం పౌరులకు సంక్రమించిన హక్కులు దారుణంగా హరించబడుతున్నాయి. శాంతిభద్రతల్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం, పోలీసులదే.మాచర్ల, గుడివాడ లాంటి ఘటనలకు అంతేలేకుండా పోతోంది. ఆ రెండు ఘటనలు ప్రభుత్వదుర్మార్గాలకు పరాకాష్టే అనిచెప్పాలి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ విజయవాడవస్తే, వారినికలిసి, రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధంగా జరిగే ప్రతి అరాచకాన్ని ఆధారాలతోసహా వారి ముందుంచి, చట్టబద్ధమైన పాలన జరిగేలా తగుచర్యలు తీసుకోవాలని వారిని కోరదాం. ప్రభుత్వ, పాలకుల అవినీతి అరాచకాలపై ప్రశ్నిస్తున్నారన్న అక్కసుతో ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ యాజమాన్యంపై కేసులు పెట్టారు.ఆ ఒక్క సంస్థే కాదు, అనేక పత్రికలు, ఛానళ్లు ప్రజలతరుపున ప్రశ్నిస్తుంటే, వాటి గొంతునొక్కేస్తున్నారు.పౌరహక్కుల్ని నేలమట్టం చేస్తున్న ఈప్రభుత్వంలో, ప్రజాస్వామ్యానికి రక్షణలేదు. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి వారసుడు కాదు.. రాజారెడ్డి వారసుడని 2018 లోనే చెప్పాను.

ప్రభుత్వ దుందుడుకు విధానాలకు చెక్ పెట్టాల్సిందే : కందుల దుర్గేశ్ (జనసేన)
స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం విచ్చలవిడిగా రాష్ట్రంలో నడుస్తోంది. ఏ రాజకీయపార్టీకి ఆపార్టీ ప్రజలకోసం పోరాడుతుంటే, ఈ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తోందిప్రతిపక్షాలు ప్రభుత్వ దుందుడుకు విధానాలకు చెక్ పెట్టకపోతే, ప్రజలే నష్టపోతారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు గారు రాజకీయపార్టీల విధానాలు ఎలాఉన్నా… ప్రజాస్వామ్యమనుగడకోసం అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని ఇదివరకే చెప్పారు.రాష్ట్రప్రజల శ్రేయస్సుకోసం పోరాడుతున్న వారంతా నేడు ఒకచోట సమావేశమవ్వడం శుభపరిణామం. జిల్లాలకు పేర్లుపెట్టే నెపంతో కోనసీమలో ప్రభుత్వం రాజేసినచిచ్చు ఆ వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడంలో భాగంగా జరిగిందే.అనంతబాబుపై ప్రజల్లో తీవ్రఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నప్పుడు, అంబేద్కర్ పేరు కోనసీమ జిల్లాకు పెట్టాలని చూశారు. విశాఖలో మాపార్టీ నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకున్నారు.మూడున్నరేళ్లలో ప్రజలనుంచి ఒక్క విజ్ఞప్తికూడా స్వీకరించని ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డే. అమరావతి రైతులపై, దళితులపై దాడిచేయడం, చంద్రబాబుగారి సభలు, సమావేశాల్ని అడ్డుకోవడం, ఆయన వాహనాలపై రాళ్లు వేయించడం ఇవన్నీ ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగానే భావించాలి.వైసీపీప్రభుత్వం వచ్చాక ఏ ఒక్కరోజైనా 144 సెక్షన్ లేకుండా ఉందా?పోలీసులసాయంతో ప్రభుత్వం సాగిస్తున్న నిరంకుశత్వాన్ని అడ్డుకోవాల్సిందే. లేకుంటే భవిష్యత్ లో వచ్చే ప్రభుత్వాలు ఇదే ధోరణి అవలంభిస్తాయి.

నేరస్తులే పాలకులైతే పౌరహక్కులకు రక్షణ ఉంటుందా? : ముప్పాళ్ల సుబ్బారావు (రాష్ట్ర పౌరహక్కుల సంఘం అధ్యక్షులు)
• రాష్ట్రంలో రాజ్యహింస కొనసాగుతోంది. రాజ్యహింసతో నియంత్రత్వంతో ప్రజల్ని భయపెట్టాలని చూస్తున్నారు.
• నేరస్తులే పాలకులైతే రాష్ట్రంలో పౌరహక్కులకు రక్షణ ఉంటుందా?
• వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడైన డీ.శివశంకర్ రెడ్డి వైసీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి. ఆయన జైల్లో ఉన్నా ఆ పదవినుంచి తొలగించలేదు.
• ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడిని చంపినా, అతన్ని ఆ పదవినుంచి తొలగించలేదు.
• జైలునుంచి విడుదలయ్యాక వైసీపీ ప్రజాప్రతినిధులే ఆయనకు ఘనస్వాగతం పలికారు.
• ఇలాంటి చర్యలు ప్ర్రభుత్వమే చేయడం, దళితుల్ని చంపమని ప్రోత్సహించడం కాదా?
• అనంతబాబు బెయిల్ విషయంలో సుప్రీంకోర్టులో వాదనలు జరిగేటప్పుడు అతనొక్కడే ముద్దాయి అన్నట్లు చెప్పారు. ఒక వ్యక్తిని చంపి, అతనే శవాన్ని కారులో తీసుకెళ్లి, మృతుడి ఇంటివద్ద పడేశాడా?
• పోలీసుల చేతగానితనంవల్లే అనంతబాబుకి బెయిల్ వచ్చింది.
• ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ అనంతబాబు బెయిల్ పిటిషన్ పై వాదనలు జరిగేటప్పుడు సుప్రీంకోర్టులో ఎందుకున్నాడు?
• అనంతబాబు న్యాయవాదికి సలహాలు ఇవ్వడానికే ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ అక్కడున్నారు.
• అనంతబాబుని బయటకు తీసుకురావడానికి ప్రభుత్వం, పోలీసులు శక్తివంచనలేకుండా పనిచేశారు. తూర్పుగోదావరి వైసీపీనేతలంతా అనంతబాబుకి జై కొట్టారు.
• ఏసీబీ, జేసీబీ, పీసీబీలను ఉపయోగించుకుంటూ, సీఐడీ పోలీస్ విభాగాలతో ప్రభుత్వం దౌర్జన్యాలకు పాల్పడుతోంది.
• మీడియాపై దేశద్రోహం కేసులు పెట్టడం ఏమిటి? అచ్చెన్నాయుడిని అర్థరాత్రి అరెస్ట్ చేయడానికి 200మంది వెళ్లాలా? ఆయనేమైనా తీవ్రవాదా… టెర్రరిస్టా?
• సెక్షన్ 151 ఏం చెబుతోంది? ఉద్దేశపూర్వకంగా హింసకు పాల్పడతారని భావించినప్పుడే వారిపై 151 సెక్షన్ పెట్టాలి.
• గుంటూరులో రంగనాయకమ్మపై సీఐడీ పెట్టిన కేసులేంటి?
• న్యాయమూర్తుల్ని దూషించిన కేసులో హైకోర్ట్ రిజిస్ట్రార్ పెట్టిన కేసుపైనే సీఐడీ స్పందించలేదు.
• పోలీసులు ప్రభుత్వానికి పాలేర్లమనే భావనలో ఉన్నారు తప్ప, రాజ్యాంగానికి చట్టానికి లోబడి పనిచేయాలని విస్మరించారు.
• రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగమే అమలవుతోంది. ప్రత్యర్థుల్ని వేధించడానికి, ప్రజల్ని అణచివేయడానికే ఈ ప్రభుత్వం చట్టాల్ని ఉపయోగిస్తోంది.
• ఇచ్చిన హామీలు అమలుచేయాలని ప్రజలు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు కోరడం తప్పా?
• పరదాల మాటున దాక్కుంటున్నప్పుడే ముఖ్యమంత్రి ప్రజావ్యతిరేకత తట్టుకోలేకపోతున్నాడని అర్థమైంది.
• హిట్లర్, ముస్సోలిని లాంటి నియంతలకు పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుంది.

జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరికీ పూర్తిగా తెలియదు..వచ్చే ఎన్నికల్లో గెలవడం కోసం ఆయనేం చేయబోతున్నాడో ఎవరూ ఊహించలేరు : జడ శ్రావణ్ కుమార్ (జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు)
• ప్రజాస్వామ్యం రాష్ట్రంలో ఏవిధంగా వయొలెట్ అవుతుందనే అంశంపై 75 ఏళ్లతర్వాత ఇప్పుడు ఇక్కడ చర్చించాల్సి రావడం దురదృష్టకరం, మరో విధంగా ఆహ్వానించదగ్గ పరిణామం.
• పాకిస్తాన్ లాంటి దేశాలు కూడా ప్రజల నిరసనల్ని గౌరవిస్తున్నాయి.
• చిన్నపిల్లల అల్లరి శృతిమించినప్పుడు వారిని కొట్టి, తిరిగి బుజ్జగించడానికి ఒక చాక్లెట్ కొనిచ్చినట్టే, జగన్మోహన్ రెడ్డి తాను హింసించిన ప్రజల్ని రేపు దారికి తెచ్చుకోవడానికి వారి అకౌంట్లలో డబ్బులు వేసి, వారిని చల్లబరచాలని చూస్తున్నాడు.
• ఈ దుర్మార్గపు ప్రభుత్వంలో బాధితులైన ప్రతి ఒక్కరినీ చైతన్యవంతుల్ని చేయాల్సిన బాధ్యత మనపైనే ఉంది.
• దళితుల పక్షాన పోరాడుతున్న నాపై, నా కార్యాలయంపై దాడికి యత్నించారు.
• ప్రజాస్వామ్యంపై దాడికి సంబంధించి టీడీపీ ముద్రించిన పుస్తకం చాలాచిన్నది. అలాంటి వందలపుస్తకాలు వేసినా, ప్రభుత్వం చేసిన దుర్మార్గాలను ప్రజల ముందు ఉంచలేం.
• ఎస్సీఎస్టీల భూములు లాక్కున్న అంశాలకు సంబంధించి కేవలం హైకోర్ట్ లోనే 10వేల రిట్ పిటిషన్లు ఉన్నాయి. వాటిలో 1000 పిటిషన్లపై తానే వాదనలు వినిపించి, వారి భూములు కాపాడాను.
• వేలకోట్ల ఎస్సీఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లించిన కేసుల్లో వాదిస్తున్నాను.
• 2021లో ఎస్సీఎస్టీ సబ్ ప్లాన్ నిధుల దారిమళ్లింపుపై కేసువేయబట్టే, ఈ ప్రభుత్వం మరలా ఆ నిధుల్ని తాకడానికి కూడా ధైర్యంచేయలేదు.
• జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బాధితులైన ప్రతి ఒక్కరినీ చైతన్యపరచాల్సిన బాధ్యత తెలుగుదేశంపైనే ఉంది.
• తెలుగుదేశంతో పోలిస్తే, ఇక్కడున్న పార్టీలన్నీ చిన్నవి. జగన్మోహన్ రెడ్డిని గద్దె దించగలిగేది తెలుగుదేశంపార్టీనే.
• ఆ పార్టీ ప్రతిపార్టీని, ప్రతి ఒక్కరినీ కలుపుకొని, ప్రతిఒక్క ఓటుని ఒడిసిపట్టాలి.
• తమిళనాడులో స్టాలిన్ 26పార్టీలను కలుపుకొని ముఖ్యమంత్రి అయ్యాడు.
• మీరంతా జగన్మోహన్ రెడ్డిని ఒకవైపే చూశారు.. రేపటి ఎన్నికల్లో గెలుపుకోసం ఆయనేం చేయబోతున్నాడో ఎవరూ ఊహించలేరు.
• రాష్ట్రంలో ప్రజాస్వామ్యపరిరక్షణకోసం ఒక సమావేశం పెట్టాలని తాను చంద్రబాబుగారికి విన్నవించాను.
• రేపు జగన్మోహన్ రెడ్డిని గద్దెదించేది ఎస్సీఎస్టీలే. ‘గడపగడపకు దగాప్రభుత్వం’ అనే పేరుతో ప్రతి ఎస్సీఎస్టీ కుటుంబాన్ని తమపార్టీ తరుపున కలవబోతున్నాం.
• పవన్ కల్యాణ్ తనబలాన్ని అంచనావేసుకొని, తగిన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం.
• బలాబలాలు అంచనావేయకుండా మతవాద, కులవాద రాజకీయాలుచేస్తే, అంతిమంగా ప్రజలే నష్టపోతారని తెలియచేస్తున్నాను.
• నాలాంటి ఎందరో ప్రాణాలు పణంగాపెట్టి, బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ఈ ప్రభుత్వంపై పోరాడుతున్నారని ఇక్కడున్న ప్రతిఒక్కరూ గ్రహించాలని విజ్ఞప్తిచేస్తున్నాను.
• జగన్మోహన్ రెడ్డి నడుపుతున్నది రాజకీయపార్టీకాదు.. ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ.
• జగన్మోహన్ రెడ్డి మరలా అధికారంలోకి రాకుండా, ప్రతిఒక్కరూ, ప్రతిపార్టీ కసితో పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది.

రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని వదిలేసి, ఎవరికి వారు వారిసమస్యలపై పోరాడుతున్నారు : లక్ష్మణ్ రెడ్డి (జన విజ్ఞానవేదిక అధ్యక్షులు)
• ప్రజలు ప్రధానసమస్యలు చర్చించకుండా పాలకులు సమస్యలు కానివాటిని సమస్యలుగా చిత్రీకరిస్తున్నారు.
• ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఇదివరకు నిరంతరం ఏదో ఒకసమస్యపై పోరాడేవారు. అలాంటివారు ఇప్పుడు 1వ తేదీన జీతం వస్తే చాలనుకుంటున్నారు.
• రైతులు, మహిళలు వారి సమస్యలపై పోరాడకుండా చేస్తున్నారు.
• అన్నిపార్టీలు ఈనాడు ఒకేవేదిక మీదకు రావడం చాలాగొప్పవిషయం. ఇదే ఒరవడి ఇకముందు కూడా కొనసాగాలి.
• 2014-19తో పోలిస్తే ఈ ప్రభుత్వంలో రాష్ట్రానికి వచ్చే ప్రత్యక్షవిదేశీపెట్టుబడులు 14రెట్లుతగ్గాయి.
• 1952 నుంచి చూస్తే ఇరిగేషన్ ప్రాజెక్ట్ లకు ఈ ప్రభుత్వం కేటాయించిన నిధులు చాలాచాలా తక్కువ.
• సామాజిక పురోగతిసూచిలో రాష్ట్రం 23వ స్థానంలో ఉండటం బాధాకరం.
• రాష్ట్రంలో వేలకోట్ల అవినీతి జరుగుతున్నా దానిపై ఎవరూ మాట్లాడటం లేదు.
• మద్యపాననిషేధ ప్రచారకమిటీకి ఛైర్మన్ గా ఉన్న నేను, జగన్ రెడ్డి ఇచ్చిన హామీని నమ్మాను.
• మద్యపాననిషేధం గురించి ఏం చేయబోతున్నారోనన్న ఉత్సుకతతో తాను ముఖ్యమంత్రిని కలిసినప్పుడు తీవ్రంగా నిరుత్సాహపడ్డాను.
• గతంలో ఒక ప్రైవేట్ మద్యం దుకాణం పరిధిలో సాధారణంగా చుట్టూ వందబెల్ట్ షాపులు ఉండేవి.
• కానీ ఇప్పుడు ఒక బైక్ తీసుకొని ఇంటింటికీ మద్యం అమ్ముతున్నారు. ప్రతి ఊరిలో కల్తీమద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి.

టీడీపీప్రభుత్వం ముస్లింలకు అమలుచేసిన పథకాల్ని జగన్ వచ్చాక రద్దుచేయడమో, నిబంధనలు మార్చడమో చేశాడు : బషీర్ అహ్మద్ ( ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ రాష్ట్ర అధ్యక్షులు)
• జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కువగా బాధింపబడుతోంది ముస్లింలే.
• టీడీపీప్రభుత్వం ముస్లింలకు అమలుచేసిన విదేశీవిద్య పథకంతో వేలాదిమంది ముస్లిం యువత విదేశాలకు వెళ్లి, జగన్ రెడ్డి వచ్చాక అక్కడే ఇరుక్కుపోయారు.
• ఆ పథకాన్ని మార్చిన జగన్ ప్రభుత్వం, దాన్ని ఎవరికి దక్కకుండా నిబంధనలు మార్చింది.
• దుల్హన్ పథకం కింద ఈ ప్రభుత్వం మూడేళ్లలో రూపాయి ఇవ్వలేదు.
• మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ రుణాలు ఒక్కపైసా కూడా ఏ ఒక్క ముస్లింకు ఈ ప్రభుత్వం ఇవ్వలేదు.
• వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు ఈప్రభుత్వం ఎలాంటిచర్యలు తీసుకోవడంలేదు. అర్హతతలేని వారిని బోర్డు సీఈవోలుగా నియమించారు.
• ఈ ప్రభుత్వం వచ్చాక రాజమహేంద్రవరంలో బలైన ముస్లింకుటుంబం మొదలు, నిన్న నరసరావుపేటలో జరిగిన ముస్లింపెద్ద హత్యవరకు జరిగిన ఘటనలన్నీ జగన్మోహన్ రెడ్డి ముస్లింల వ్యతిరేకి అనడానికి ప్రబలనిదర్శనాలుగా నిలిచాయి.
• ముస్లింమైనారిటీల మద్ధతుకోసం తెలుగుదేశంపార్టీ వారికి ఒకగొప్ప భరోసా కల్పించాలని కోరుతున్నాం.

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వస్తేనే, వచ్చేఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయి : చలసాని అజయ్ కుమార్ (భారత న్యాయవాదుల సంఘం ప్రధానకార్యదర్శి)
• అమరావతి ప్రాంతంలో స్థానికుల్ని ఒక ఊరినుంచి మరోఊరికి వెళ్లకుండా ఈ ప్రభుత్వం అడ్డుకుంది.
• ముళ్లకంచెలు వేసి, గుడికి వెళ్లాలన్నా తమ అనుమతి తీసుకోవాలని స్థానికుల్ని జగన్ సర్కారు బెదిరించింది.
• హైకోర్టు న్యాయవాదుల్ని కూడా బయటకురాకుండా అడ్డుకున్నారు.
• వచ్చేఎన్నికలు గవర్నర్ పాలనలో జరగాలి. అప్పుడే ఎన్నికలు సక్రమంగా జరుగుతాయి.
• జగన్మోహన్ రెడ్డి పాలనే ఉంటే నామినేషన్లు వేసే పరిస్థితి కూడా ఉండదు.
• స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన అరాచకాలు అందరూ చూశారు.
• ఈ సమావేశంలో రాష్ట్రంలో రాష్ట్రపతి (గవర్నర్) పాలన పెట్టాలనే అంశంపై ఏకగ్రీవ తీర్మానం చేయాలని కోరుతున్నాను.

రాష్ట్రాన్ని పాలిస్తున్న వ్యక్తే బెయిల్ పై ఉంటే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి చెప్పినా ఏం ఉపయోగం? : వరప్రసాద్ (ఆప్)
• మరో సంవత్సరంలో ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఈ సమావేశం నిర్వహించడం చాలామంచిది.
• 40 ఏళ్లక్రితం ఒక సినీనటుడు ప్రజల్ని చైతన్యం చేశాక, మరలా ఆస్థాయిలో ఇప్పుడున్న పార్టీలు ఎందుకు చైతన్యవంతుల్ని చేయలేకపోతున్నాయి?
• ఓటు అమ్ముకోకుండా ప్రజల్ని జాగరూకుల్ని చేయడంలో ఎందుకు విఫలమవుతున్నాము?
• పెత్తందారీవ్యవస్థ, డబ్బురాజకీయాల్ని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఒకస్థాయికి తీసుకెళ్లాడు.
• రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వ్యక్తే బెయిల్ పై ఉన్నాడనే విషయం మర్చిపోయి, సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తికి విన్నవించుకుంటే ఏం లాభం?
• కోడికత్తి శ్రీనివాస్ కి రాని బెయిల్ అనంతబాబుకి వచ్చింది.
• బాబాయ్ ని చంపినవారు దర్జాగా పార్లమెంట్ లో తిరుగుతున్నారు.
• ఎలాంటి వ్యక్తుల పాలనలో, ప్రజల బతుకులు ఎలా ఉంటాయో వారికి వివరించాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీపైనే ఉంది.
• 40శాతం మంది ఓట్లు వేయడానికి బూత్ లకు రావడంలేదు…వారిపై దృష్టి పెట్టాలి.

ప్రభుత్వ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం నుంచి రాష్ట్రాన్ని కాపాడటానికి ఇప్పటికైనా ప్రతిపక్షం వడివడిగా అడుగులేయాలి : పోతుల బాలకోటయ్య (దళిత జేఏసీ అధ్యక్షులు)
• స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం గురించి మాట్లాడుకుంటున్నందుకు సిగ్గుపడాలి.
• ఒక రాష్ట్రం ఒకరాజ్యం రాజ్యాధికారంకోసం మతాధికారంకోసం చేస్తున్నదాడినే స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అని 18వ శతాబ్దంలో చెప్పారు.
• మాస్కు అడిగినందుకు సుధాకర్ ని… మాస్క్ పెట్టుకోలేదని లాఠీదెబ్బలతో విక్రమ్ కుమార్ ని చంపారు.. దొంగతనం నేరంమోపి హింసించి వేధించి అబ్దుల్ సలాంని కుటుంబంతో సహా బలిగొన్నారు. వడ్డీడబ్బులు కట్టలేదని రమావత్ మంత్రూభాయ్ ని ట్రాక్టర్ తో తొక్కించారు.
• నంద్యాల నాగమ్మ, వజీరా, మహాలక్షి, గుంటూరు రమా, ఇలాంటి అభాగినులు ఎందరో. పేరేచర్లలో దళితబాలికపై జరిగిన సామూహికఅత్యాచారం ఘటన యావత్ రాష్ట్రానికే మాయనిమచ్చ.
• ఆ అత్యాచారంకేసులో నిందితులు 80మంది. ఇలాంటి దారుణాలు జరిపించడానికేనా.. నాఎస్సీలు, నాఎస్టీలు, నాబీసీలు, నా ముస్లింలు అనిచెప్పడం?
• రాజధానికి భూములిచ్చిన ఎస్సీఎస్టీలపై ఎస్సీఎస్టీ కేసులా? ఇలాంటి దారుణాలపై మూడేళ్లుగా పోరాడుతున్నాం.
• ఇప్పటికైనా ప్రతిపక్షం ఆలస్యంగా ఒకఅడుగువేసింది. ఇకపైన అయినా వడివడిగా అడుగులు వేయాలని కోరుతున్నాం.
• రావణ సంహారంలో రాముడికి ఉడతసహా, వానరులు అందరూ సహకరించారు.
• రాముడు అందరినీ కలుపుకొని యుద్ధంచేశాడు కాబట్టే, అది ధర్మసంస్థాపనార్థం జరిపిన యుద్ధం అయ్యింది.
• ఈ పోరాటంలో ఎక్కువ బాధ్యత తీసుకోవాల్సింది తెలుగుదేశంపార్టీనే. అంతేగానీ తెలుగుదేశం పార్టీ పెద్దన్నకాదు.
• తోస్తే కిందపడే పిట్టకాదు.. జగన్మోహన్ రెడ్డి. ఆయుధాలు, బాంబులతో వచ్చేఎన్నికలు జరపడానికి సిద్ధమవుతున్నారని గ్రహించండి.
• రాష్ట్రంలో సాగుతున్న స్టేట్ స్పాన్సర్ టెర్రరిజంపై పోరాడటానికి ఢిల్లీ పాలకులు కూడా కలిసిరావాలి.
• తెలుగుజాతి, తెలుగుబిడ్డలు ఢిల్లీపీఠాన్ని వణికించారని గుర్తుంచుకోండి.
• ఇప్పుడు కలిసికట్టుగా ఉద్యమిస్తేనే స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజానికి ముగింపు పలకగలం.

పేదలకు అన్నంపెడుతున్నా ఈ ప్రభుత్వం సహించలేకపోతోంది : పీ.వరప్రసాద్ (రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా)
• 22ఏళ్లుగా ప్రజలకోసం పోరాడుతున్నా…నాపై ఎప్పుడూ కేసులు లేవు. ఈ ప్రభుత్వం వచ్చాక ఎన్నికేసులు పెట్టిందో నాకే తెలియదు.
• అప్పులు, రైతులఆత్మహత్యల్లో, దళితులు, మహిళలపై దాడుల్లో రాష్ట్రం నంబర్-1.
• పేదలకు అన్నం పెడుతున్నా ఈ ప్రభుత్వం సహించడంలేదు.
• అనంతబాబు దళితుణ్ణి చంపిన హత్యకేసులో ప్రభుత్వబాధితుల తరుపున వాదించిన ప్రతిఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

దళితులపై జగన్ రెడ్డి ప్రేమ ధృతరాష్ట్రుడి కౌగిలి లాంటిది : పేరుపోగు వెంకటేశ్వరరావు (ఎమ్.ఆర్.పీ.ఎస్. జాతీయఅధ్యక్షులు)
• జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు రావడానికి కారణం ఎస్సీఎస్టీలే.
• ఆయన్ని క్రైస్తవులంతా ‘మరోజీసస్’ అని నమ్మి ఓట్లేశారు.
• అధికారంలోకి వచ్చాకే జగన్మోహన్ రెడ్డి మరో మతోన్మాది అని అర్థమైంది.
• సుబ్రహ్మణ్యం అనే దళితుడిని చంపిన వ్యక్తిని ఊరేగించడం ఈ రాష్ట్రంలోనే చూశాం.
• అమరావతి ఎస్సీఎస్టీలపై అట్రాసిటీ యాక్ట్ పెట్టడం ఇక్కడే చూశాం.
• రాజ్యాంగబద్ధంగా గతప్రభుత్వం దళితులకు అమలుచేసిన 27 పథకాల్ని జగన్ రెడ్డి అర్థంతరంగా రద్దుచేశాడు.
• అమ్మఒడితో జగన్ దళిత విద్యార్థులకు స్కాలర్ షిప్ లు ఎగ్గొట్టి, తీవ్ర అన్యాయంచేస్తున్నాడు.
• దళితులపై జగన్ రెడ్డి ప్రేమ ధృతరాష్ట్ర కౌగిలి లాంటిది. రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని అఖిలపక్ష సమావేశాలు నిర్వహించాలి.
• జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ బాధితుల జాబితాలో అగ్రభాగం దళితులదే.
• అటువంటి దళితుల్ని అక్కునచేర్చుకుంటే, జగన్మోహన్ రెడ్డి కోటకూల్చడం పెద్దలెక్కేం కాదు.

అధికారంలోకి వచ్చీరాగానే జగన్ అప్రజాస్వామిక పద్ధతులతో పాలన ప్రారంభించాడు : అక్కినేని వనజ (సీపీఐ)
• రాష్ట్రంలో ఎవరూ తనను ప్రశ్నించకూడదన్న నియంత్రత్వపోకడల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు.
• అధికారంలోకి వచ్చీరాగానే అప్రజాస్వామిక పద్ధతుల్లో పాలన ఆరంభించాడు.
• మా కార్యాలయాల్లో సమావేశాలు కూడా పెట్టుకోకుండా పోలీసులు అడ్డుకున్నారు.
• రైతులు, రైతుకూలీలు, వ్యాపారులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మహిళలు ఎవరూ ఈ ప్రభుత్వంలో సంతోషంగా లేరు.
• ఉపాధ్యాయుల్లో తనకు వ్యతిరేకంగా ఉద్యమించారనే, జగన్మోహన్ రెడ్డి వారిని ఎన్నికల విధులనుంచి తప్పించాడు.
• మనకు చాలాతక్కువ సమయమే ఉందని అందరం గ్రహించాలి. ఎవరు ఏమైపోయినా, రాష్ట్రం ఎటుపోయినా జగన్ కు తన రాజకీయప్రయోజనాలే ముఖ్యం.
• రాజకీయ వ్యవస్థకు ప్రజాస్వామ్యం అనేది వెన్నెముక లాంటింది.
• ప్రజాస్వామ్య విలువలు కలిగిన రాజకీయవ్యవస్థకోసం అందరం మనకున్న ఆలోచనలు, అభిప్రాయాలు పక్కనపెట్టి, రాష్ట్రంకోసం ముందుకు రావాలి.
రాజ్యహింసతోనే 175 స్థానాలు గెలవాలన్నది జగన్ ఆలోచన : రావి సుబ్రహ్మణ్యం (నవతరం పార్టీ)

• జగన్మోహన్ రెడ్డి పదేపదే ‘వైనాట్ 175’ అంటున్నారు.
• అలాంటి మాటలు అనాల్సింది మా కే.ఏ.పాల్ అన్నగారు.
• 175 స్థానాలు గెలవడానికి జగన్ ఓట్లనుకాక, కత్తులు, కఠార్లనే నమ్ముకుంటున్నాడు అనిపిస్తోంది.
• స్థానికసంస్థల ఎన్నికలసమయంలో జరిగిన దాడులే అందుకు రుజువులు.
• రాజ్యహింస అనేది ఒకప్పుడు నక్సలైట్ల నినాదం. రాజ్యహింసే వచ్చేఎన్నికల్లో జగన్ నినాదంగా మారబోతోంది.
• చిలకలూరిపేట నియోజకవర్గంలో మంత్రి విడదల రజనీ జూనియర్ జగన్ గా వ్యవహరిస్తున్నారు.
• యడవల్లి రైతుల అధీనంలో ఉన్న 420 ఎకరాల ఏకపట్టాభూమిని ఆక్రమించడానికి సిద్ధమయ్యారు.
• ఆ భూమి ఆమెపరం కాకుండా పోరాడుతున్న మాపై తప్పుడుకేసులు పెట్టించారు.
• జగన్ రెడ్డి ఏంచేస్తే, విడదల రజనీ అదేచేస్తుంది. అదే సిలబస్ ప్రకారం మాచర్లలో మారణహోమం సృష్టించారు.
• దళితుల కాళ్లుకడిగి ఆ నీళ్లు తలపై చల్లుకునే నేను దళితులకు వ్యతిరేకంగా మాట్లాడానని దుష్ప్రచారం చేయించింది.

జగన్మోహన్ రెడ్డి తాను కూర్చున్నకొమ్మల్నితానే నరుక్కుంటున్నాడు : షుబ్లీ (ముస్లిం హక్కుల పరిరక్షణసమితి)
• సముద్రాన్ని మించిన సమస్యలు, ఇబ్బందుల్ని ఒకేవేదికమీద చర్చించలేము.
• మరీముఖ్యంగా ఈ ప్రభుత్వంలో మైనారిటీలపై జరిగిన దాడులు.
• జగన్మోహన్ రెడ్డి ఎక్కిన అధికారమనే చెట్టుకొమ్మలు ఎస్సీఎస్టీ, బీసీ, మైనారిటీలు.
• తాను కూర్చున్నకొమ్మల్ని తానే నరుక్కుంటున్న వ్యక్తి ఏమవుతాడో చెప్పాల్సిన పనిలేదు.
• అయేషామీరా అత్యంతకిరాతకంగా చంపబడి 15 ఏళ్లు అయ్యింది. ఆ దారుణం రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో జరిగితే, ఆమె కుటుంబానికి ఇప్పటికీ న్యాయం జరగలేదు.
• పొన్నూరుసభలో చంద్రబాబు గారు మాట్లాడుతూ, ఈ ప్రభుత్వంలో ముస్లిం మైనారిటీలపై జరిగిన దారుణాలు 43 అన్నారు. వాటిసంఖ్య దాదాపు 73వరకు ఉందని చెబుతున్నాం.

రాజకీయంగా పోరాడుతూనే సామాజిక అంశాలపై ఉద్యమించాలి : రమాదేవి (ఐద్వా అధ్యక్షురాలు)
• మాచర్ల ఘటన వచ్చేఎన్నికలు ఎలా ఉండబోతాయి అనడానికి రిహార్సల్స్.
• రాజకీయంగా పోరాడుతూనే సామాజిక అంశాలపై ఉద్యమిస్తేనే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యం.
• సమాజంలో మనుషుల మధ్య అంతరాలు ఉన్నట్టే, హక్కుల అమలు జరుగుతుందనేది ప్రతిఒక్కరూ ఆలోచించాలి.
• సమానత్వం లేకుండా ప్రజాస్వామ్యహక్కుల్ని కాపాడలేం.
• దారుణాలకు సంబంధించిన సాక్ష్యాలను తారుమారుచేసే పోలీసులపై చర్యలు లేకుంటే బాధితులకు న్యాయం జరుగుతుందా?
• డ్వాక్రామహిళల సదస్సు పెట్టాలనుకుంటే, పోలీసులు మమ్మల్ని బలవంతంగా ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లారు.

స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంతో జగన్ తన ప్రత్యర్థుల్ని దారికి తెచ్చుకునే ప్రయత్నంచేస్తున్నాడు : చెవుల కృష్ణాంజనేయులు
• జగన్ ప్రభుత్వంలో బాధితులు కానివారెవరు.
• స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంతో తన ప్రత్యర్థుల్ని ఆయన దారికి తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు.
• రాజ్యాంగం కల్పించే జీవించేహక్కుని కాలరాసే పరిస్థితి రాష్ట్రంలో ఉంది.
• మూడున్నరేళ్లలో జగన్మోహన్ రెడ్డి అన్ని రాజకీయపార్టీలను భయకంపితుల్ని చేశాడనే చెప్పాలి.
• వైసీపీకి ఓట్లేయలేదని పల్నాడుప్రాంతంలో ప్రజల్ని దారుణంగా భయపెట్టారు.
• ఆత్మకూరు దళితుల్ని జగన్ హింసించినప్పుడే అన్నిపార్టీలు స్పందించాల్సింది.
• జర్నలిస్టులపై ఎన్నడూలేని విధంగా జగన్ టార్గెట్ చేశాడు. ఈ ప్రభుత్వం వారిపై అన్యాయంగా నిర్భయ కేసులు పెట్టింది.
• ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా అందరం ప్రజలతో మమేకమవ్వాలి.

జగన్ ప్రభుత్వం కోతలు, కూల్చివేతల ప్రభుత్వం. బీసీలకు జగన్ చేసింది శూన్యం : నూకాలమ్మ (జాతీయబీసీసంఘం రాష్ట్రమహిళా అధ్యక్షురాలు)
• బీసీలతోపాటు..ఎస్సీఎస్టీలు మైనారిటీలపై జరిగే దాడుల్ని కూడా ఖండిస్తున్నాం.
• నియంతను గద్దెదించడానికి వివిధపార్టీలు, నేతలు ఒక్కటవ్వాల్సిందే.
• జగన్ ప్రభుత్వం కోతలు, కూల్చివేతల ప్రభుత్వం.
• ఏ రాజకీయపార్టీకి అయినా బీసీల ఓట్లే కీలకమని గుర్తించండి.
• బీసీ కమిషన్ వేశామంటున్న జగన్ రెడ్డి, బడుగుబలహీన వర్గాలకే ఏం న్యాయంచేశాడో చెప్పాలి.
• రాజకీయ పదవుల్లో బీసీలకు సమానవాటా ఇచ్చారా?
• బీసీ మంత్రులపై రెడ్డి మంత్రుల్ని ఇన్ ఛార్జ్ లుగా నియమించారు.
• 56 బీసీకార్పొరేషన్లతో ఎంతమంది బీసీయువతకు ఆర్థికసాయం చేశారో చెప్పండి?
• పుంగనూరులో బలమైన బీసీనేతను అంతంచేయాలని చూశారు. దాంతో బీసీవర్గాలు ఏకమయ్యాయి.

దళితులపై సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన దాడులు ఎక్కువయ్యాయి : కొరివి విజయ్ కుమార్ (దళిత మేథావిసంఘం నేత)
• రాజ్యంలో ఎవరు అధికారంలో ఉన్నా స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజాన్ని అణచివేయాల్సిందే.
• రాజ్యాంగాన్ని పరిరక్షించలేని పార్టీలను ప్రజలు విశ్వసించరు అనడానికి జగన్ ప్రభుత్వమే ఉదాహరణ.
• ఎవరు రేపు రాజ్యానికి రాబోతున్నారో వారు రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని హామీ ఇవ్వాలి. అలా చేయకుంటే, ఇలాంటి సమావేశం మరలా జరపాల్సి వస్తుంది.
• ఎస్సీఎస్టీలపై దాడులకు సంబంధించి 7500కి పైగా కేసులు నమోదయ్యాయి. వాటిలో ఒక్కదానిపై కూడా సరైన ఛార్జ్ షీట్ వేయలేదు.
• అత్యాచారం కేసుల్లో 3, 4 ఏళ్లు అవుతున్నా ఛార్జ్ షీట్లు వేయడంలేదు.
• దళితులపై ఆర్థిక, సామాజిక, విద్యాపరమైన దాడులు ఎక్కువయ్యాయి.
• ప్రజాస్వామ్యపరిరక్షణ, రాజ్యాంగరక్షణ కోసం తెలుగుదేశంపార్టీనే చొరవచూపాలి.

ప్రజాస్వామ్య పరిరక్షణవేదిక తీర్మానాలు
తీర్మానం 1 : అన్ని రాజకీపార్టీలు, ప్రజాసంఘాలు, వివిధవర్గాల నేతలు రాష్ట్రంలోని స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజానికి సంబంధించిన వివరాలను వివరిస్తూ, భారతప్రధాన న్యాయమూర్తిని కలిసి వినతిపత్రం ఇవ్వడం.
తీర్మానం 2 : రాష్ట్రస్థాయి ప్రజాస్వామ్యపరిరక్షణ కమిటీ ఏర్పాటుచేయడం.
తీర్మానం 3 : ప్రతిజిల్లా, నియోజకవర్గ, మండలస్థాయి వరకు ఈ వేదిక ఏర్పాటుకావాలి.
తీర్మానం 4 : పోలీసుల ఏకపక్ష, దమన నిరంకుశచర్యలను నిరసిస్తూ బాధితులకు రక్షణగా ప్రతిమండల, జిల్లాస్థాయిలో ప్రజాస్వామ్యపరిరక్షణ వేదిక అండగా నిలవాలి.
తీర్మానం 5 : గ్రామ, మండలస్థాయిలో ప్రజల్ని చైతన్యం చేసే కార్యక్రమాల్ని నిరంతరం కొనసాగిచండం.
తీర్మానం 6 : ప్రజాస్వామ్యపరిరక్షణకోసం పాడుపడే ప్రతిఒక్కరిపై జరిగే దాడిని ఈ వేదిక తీవ్రంగా ఖండిస్తోంది.

LEAVE A RESPONSE