– చేనేతపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలి
– సెస్సులను పూర్తిగా ఎత్తివేసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి
– జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో కేంద్రానికి కేటీఆర్ బహిరంగ లేఖ
హైదరాబాద్ : జీఎస్టీ స్లాబ్ రద్దు లేదా మార్పు అంటూ కేంద్రం గత వారం రోజులుగా ప్రచారం చేసుకుంటుంది. వీటి ద్వారానే ప్రజల జీవితాల్లో నిజమైన దీపావళి వస్తుంది అంటూ ప్రాపగాండ చేస్తుంది. గత పుష్కరకాలంగా లక్షల కోట్ల రూపాయలు పెంచిన పెట్రోల్, డీజిల్, ఎల్పిజి రేట్ల రూపంలో ప్రజల నుంచి దోచుకుంది.
ఒకవైపు ప్రతినెల వేలాది రూపాయలు పెట్రోల్, ఎల్పిజి, డీజిల్ రూపంలో భారం మోపుతూ, జిఎస్టి స్లాబ్ మార్పు వలన కేవలం పదుల రూపాయల భారం తగ్గిస్తామంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ధరల తగ్గింపుపైన చిత్తశుద్ధి ఉంటే దానికి ప్రాథమిక కారణమైన పెట్రో ధరలను తగ్గించాలి
పెట్రోల్, డీజిల్ తగ్గితే రవాణా భారం తగ్గి దాదాపు అన్ని వస్తువుల ధరలు తగ్గుతాయి. పెట్రోల్, డీజిల్, ఎల్పిజిపైన పన్నులు తగ్గించి, సెస్సులను పూర్తిగా ఎత్తివేసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. లేకుంటే మీ మాటలు మరొక జుమ్లాలాగా మిగిలిపోతాయి. చేనేతపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలి
అన్ని జీవిత బీమా మరియు ఆరోగ్య బీమా పాలసీలపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలి.విద్యకు సంబంధిత ఫీజులపై విధించే జీఎస్టీని పూర్తిగా తొలగించాలి. క్యాన్సర్ చికిత్సకు అవసరమైన మందులు మరియు ప్రాణాలు కాపాడే జీవనావశ్యక ఔషధాలపై జీఎస్టీని పూర్తిగా తొలగించాలి.