Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు ఆస్తులపై లక్ష్మీపార్వతి వేసిన కేసు కొట్టేయడం వైసీపీకి చెంపపెట్టు

– టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు

చంద్రబాబు ఆస్తులపై లక్ష్మీపార్వతి వేసిన కేసు కొట్టేయడం వైసీపీకి చెంపపెట్టు అని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు పేర్కొ్నారు. శనివారం ఆయన మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు అక్రమ ఆస్తులు కలిగిఉన్నారని గతంలో లక్ష్మి పార్వతి సుప్రీం కోర్టులో పిటిషన్ వేసి భంగపోయారు, ఆ పిటిషన్ బుట్టదాఖలైంది. ఎన్టీరామారావు యజ్ఞాన్ని పాడుచేయడానికి వచ్చిన క్షుద్రస్త్రీ లక్ష్మీపార్వతి.

ఎన్టీరామారావు, చంద్రబాబు లు చరిత్రకారులైతే జగన్, లక్ష్మీపార్వతి లాంటివారు చరిత్రహీనులు. చంద్రబాబు ప్రజా వేదికను నిర్మించి చరిత్రకారుడైతే.. జగన్ ప్రజావేదికను కూల్చి చరిత్ర హీనుడయ్యాడు. లక్ష్మీపార్వతి నుంచి నీచ సంస్కృతిని తెచ్చి కొడాలి నానీ వాడుతున్నాడు. రాజకీయ పార్టీ పెట్టి 9 నెలల్లోనే అధికారంలోకి తెచ్చిన యుగపురుషుడు ఎన్టీరామారావు. అలాంటి వ్యక్తిపైనే మోజుపడిన వ్యక్తి లక్ష్మీ పార్వతి. ఎన్టీరామారావు జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తి లక్ష్మీపార్వతి. ఎన్టీరామారారావుపై మచ్చ తేవాలని చూసిన లక్ష్మీపార్వతిని అడ్డుకున్న చంద్రబాబుపై విషం చిమ్ముతోంది.

గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి లక్ష్మీపార్వతిని దుష్టకార్యాలకు వాడుకునేందుకు తయారు చేశారు. జగన్, లక్ష్మీపార్వతి లాంటివారు చరిత్రహీనులుగా చరిత్రపుటల్లో నిలిచిపోతారన్నది నగ్నసత్యం ఎన్టీరామారావు ఒక యుగపురుషుడు. చరిత్రకారుల జాబితా నుంచి ఆయనను తొలగించాలని ప్రయత్నించారు. ఎన్ని ఎత్తుగడలు వేసినా యుగపురుషుడి చరిత్రను మర్చిపోయాలా చేయలేరు.

నారా చంద్రబాబు నాయుడును చరిత్రకారుడిగా ప్రజలందరూ చెప్పుకుంటారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. మహానటుడిగా, రాజకీయ నాయకుడిగా ఎదిగారు. నందమూరి తారక రామారావే చంద్రబాబు ప్రతిభని గుర్తించి స్వయంగా తన కుమార్తెను ఇచ్చి అల్లుడిగా చేసుకున్నారు.

రాష్ట్రంలోని వ్యవస్థలను అడ్డం పెట్టుకొని జగన్ దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. అధికార దాహంతో తండ్రిని, తండ్రి పదవులను అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు అక్రమంగా సంపాదించారు. అధికార దాహంతో తహతహలాడిన వ్యక్తి జగన్. అనేక ప్రయత్నాలు చేసి, ప్రయత్యర్థుల మీద రాళ్ళ వర్షాన్ని కురుపించి, మత విద్వేషాలను రెచ్చగొట్టి అనేక మంది చావుకు కారణమైన చరిత్రహీనులు వైయస్. రాజశేఖర్ రెడ్డి.

రాష్ట్ర విభజన తరువాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చెప్పట్టారు. అందులో భాగంగా ప్రజల వినతులు స్వీకరించడానికి ప్రజా వేదికను నిర్మించిన చంద్రబాబు చరిత్రకారుడయ్యారు. ప్రజా వేదికను తన అధికారంతో కూల్చి చరిత్ర హీనుడుగా జగన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయారు.

చరిత్రహీనుల్లో మొట్టమొదటి వ్యక్తి లక్ష్మి పార్వతి. ఎన్టీరామారావు భార్య అనిపించుకునే అర్హత లక్ష్మీపార్వతికి లేదు. వీరగంధం సుబ్బారావుకు రెండో భార్యగా వెళ్లి ఆతరువాత ఎన్టీరామారావు వద్దకు వచ్చి భార్యగా ఉంటానంది. వీరగంధం సుబ్బారావుకు మొదట భార్య, పిల్లలు ఉన్నా రెండో భార్యగా వెళ్ళిన చరిత్రహీనురాలు లక్ష్మీపార్వతి.

ఆడవాళ్లని అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఎదగాలనుకునే వ్యక్తి జగన్. చంద్రబాబు నాయుడును అనరాని మాటలన్న కొడాలి నాని తన నిజజీవితంలో ఒకసారి తొంగి చూసుకోవాలి. కొడాలి నానీ లాంటి వెధవల సంస్కృతి చరిత్రహీనురాలైన లక్ష్మిపార్వతి అనే క్షుద్ర స్త్రీ నుంచి వచ్చింది. పశువుల కంటే హీనంగా కొడాలి నానీ వ్యవహరిస్తుంటాడు. ఒక పశువులా బరితెగించి కొడాలి నాని మాట్లాడుతున్నాడు. అతని మాటలు విన్నవారు ఎంతో ఆవేదన చెందుతున్నారు.

సుప్రీం కోర్టే కేసు కొట్టేసిన తర్వాత లక్ష్మీపార్వతి తగ్గకపోగా తీరూ, తెన్నూ లేకుండా పిచ్చి ప్రేలాపన పేలుతోంది. రాజశేఖర్ రెడ్డి ఇచ్చే డబ్బులకు కక్కూర్తిపడి యుగపురుషుడు యన్.టి. రామారావు జీవితంలో మచ్చ తెచ్చిన వ్యక్తి లక్ష్మి పార్వతి. రామారావు యజ్ఞాన్ని పాడుచేయడానికే లక్ష్మీపార్వతి వచ్చింది. నాడు లక్ష్మీపార్వతి రాజశేఖర్ రెడ్డి వద్ద డబ్బులు తీసుకొని ఎన్టీరామారావు జీవితంలో మచ్చ తేవడానికి ప్రయత్నించింది. నేడు రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకొని చంద్రబాబు జీవితంలో మచ్చ తేవాలనే ప్రయత్నచేశారు. దానికి సుప్రీం కోర్టు చెంప దెబ్బ కొట్టింది. లక్ష్మీపార్వతి చెడు సంస్కృతి, చెడు సాంప్రాదాయాలున్న మహిళ.

అందరూ దేవుడిలా భావించే రామారావు లాంటి వ్యక్తిపై మోజు పడ్డ లపాకి. దేవుడికున్న శక్తులన్నింటిని లాక్కొనే కుట్ర చేసిన మహిళ ఆవిడ. రామారావు గారి భార్యగా చెలమణి అయ్యే ప్రయత్నం చేస్తున్న ఆవిడ ఇంటి పేరు ఏంటి? ఆమె తల్లితండ్రులు ఇచ్చిన ఇంటి పేరేంటి. మెట్టినిల్లు ఇంటి పేరు వీరగంధం అయితే నందమూరి అని ఎందుకు పెట్టుకోవల్సి వచ్చింది?. పాలకుండలాంటి రామారావు జీవితంలో విషం జిమ్మాలని ప్రయత్నించింది. లక్ష్మీపార్వతి కుమారుడు కోటేశ్వర ప్రసాద్ తన తల్లి లక్ష్మీపార్వతి అని చెప్పుకోవడానికే సిగ్గుపడుతుంటాడు. బసవతారంకంకు 12 మంది పిల్లలు పుడితే 13వ వాడిగా కోటేశ్వర ప్రసాద్ ఎలా అవుతాడు?

ప్రజల కోసం ఎంతో పాటుపడిన వ్యక్తి రామారావు. ఆయన జీవితంలో మచ్చ పెట్టి, పార్టీని లాక్కోవాలనే ప్రయత్నం చేసింది లక్ష్మి పార్వతి. దానికి చంద్రబాబు నాయుడు అడ్డుపడి తెలగుదేశం పార్టీ తెలుగు ప్రజల ఆత్మగౌరవ పార్టీ అని.. నాశనం చేయాలనే చూస్తే ఊరుకోనని పార్టీని కాపాడుకున్నారు. అలా కాపాడారు కనుకనే తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఇంకా బతికేఉంది.

లక్ష్మీపార్వతి పై వేధింపుల ఫిర్యాదు
వినుకొండ పోలీసు స్టేషన్ లో లక్ష్మీ పార్వతి పై ఫిర్యాదు చేసిన కోటి లక్ష్మీపార్వతి తనను లైంగికంగా వేధిస్తోందని కోటి అనే వ్యక్తి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఇలాంటి మహిళలను అడ్డం పెట్టుకొని వైయస్. రాజశేఖర్ రెడ్డి నుంచి జగన్ రెడ్డి వరకు చంద్రబాబు నాయుడు పరువు తీయాలని ప్రయత్నించారు. ఏమీ చేసుకోలేకపోయారు. 1999 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడును అధికారంలో నుంచి దించాలని వైయస్. రాజశేఖర్ రెడ్డి దాదాపు 13 పిటిషన్ల వేశారు. ఆఖరికి గవర్నర్ కి కూడ పిటిషన్ ని ఇచ్చిన పరిస్ధితి. ఎన్ని పిటిషన్లు ఇచ్చినా చంద్రబాబు నాయుడుని ఏం చేయలేకపోయారు.

ఎన్ని ప్రయత్నాలు చేసినా చంద్రబాబు చేతిపై ఉన్న కుంటి వెంట్రుకని కూడ పీకలేకపోయారు. 2011లో ఆదాయానికి మించి ఆస్తులన్నాయని వైయస్.విజయమ్మ చంద్రబాబు నాయుడు పై కేసులు వేయడం జరిగింది. అనేక పిటిషన్లు వేశారు. విజయమ్మ వేసిన కేసులను సైతం సుప్రీం కోర్టు కొట్టివేసింది.

జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు నాయుడు పై అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందంటూ కేసులు వేశారు. ఇన్ సైడ్ ట్రేడింగ్ జరగలేదు ఇలాంటి కొత్త పదాలను తీసుకు రావద్దని సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసింది. ప్రజలకిచ్చే ఫైబర్ గ్రిడ్ లో విపరీతంగా మోసం జరిగిందని ఆరోపించారు. పెగాసిస్ ని తీసుకొచ్చి లోకేష్ అవినీతికి పాల్పడ్డారన్నారు. దేన్నీ నిరూపించలేకపోయారు. మేం అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ అంతు తేలుస్తాం అని కొడాలి నాని కారు కూతలు కూశాడు. మాంత్రిక పుత్రుడికి ఎవరు అధికారంలో ఉన్నారో కూడ తెలియడం లేదు చంద్రబాబు నిప్పు.. నిప్పుకు చెదలు పట్టించలేరని లక్ష్మీపార్వతి, నానిలాంటివారు గ్రహించాలని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు పేర్కొన్నారు.

LEAVE A RESPONSE