-జగన్ రెడ్డి దుష్ప్రచారాలను తిప్పికొడుతున్నందుకే ఐ-టీడీపీపై వైసీపీ నాయకుల కక్ష సాధింపు
– టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు
జగన్ రెడ్డి దుష్ప్రచారాలను తిప్పికొడుతున్నందుకే ఐ-టీడీపీపై వైసీపీ నాయకులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు వివరించారు. ఆదివారం తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో నకిలీ ప్రభుత్వం నడుస్తోంది. వైసీపీ జగన్ స్థాపించిన పార్టీ కాదు. వరంగల్ కు చెందిన శివకుమార్ అనే అతని నుండి అరువు తెచ్చుకున్న పార్టీ వైసీపీ.
జగన్.. తన తండ్రి ఫొటో, తండ్రి చావును అడ్డం పెట్టుకొని అనేక అబద్ధాలు చెప్పి పార్టీని పటిష్టపరచుకున్నారు. జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డిని రిలయన్స్ వారు చంపించారని చెప్పి.. నాడు రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించారు. ఆ తరువాత రిలయన్స్ కు చెందిన నత్వానీని వైసీపీ ఎంపీగా ఎన్నుకున్నారు. లేని పింక్ డైమెండ్ ను చంద్రబాబునాయుడు ఇంట్లో ఉందని చంద్రబాబుపై అనేక నిందారోపణలు చేసి ఒక్కటీ నిరూపించలేకపోయారు. జగన్ బాబాయిని చంపింది కూడా చంద్రబాబేనని అబద్ధాలు చెప్పారు. ప్రస్తుతం వైసీపీ పోగు చేసుకుంటున్న అవినీతి సొమ్ము ను ఎన్నికల్లో ఖర్చుపెట్టి మళ్లీ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తోంది.
అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క పని చేయలేదు. వైసీపీ దుర్మార్గాలను చూసి వైసీపీ వారే ఇతర పార్టీల్లోకి మారుతున్నారు. సొంత బాబాయినే పొట్టన పెట్టుకున్నారన్నది జగమెరిగిన సత్యం. జగన్ దుర్మార్గ, దుష్ప్రచారాలను తిప్పికొడుతూ నిజాలను నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకెళ్తున్న ఐ-టీడీపీ సాంకేతిక విభాగంపై వైసీపీ కక్ష సాధింపుకు పాల్పడుతోంది. ఐటీడీపీపై బురదజల్లుతోంది. గతంలో ఉండవల్లిలో అనూష అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త వైసీపీ అవినీతిని ఎదుర్కొంటుంటే ఆమెను అనేకరకాలుగా హింసించారు.
పార్టీ కోసం ప్రాణాలర్పించే కార్యకర్తలు ఐటీడీపీలో ఉన్నారు. టీడీపీ కార్యకర్తలు పార్టీని కాపాడుకోవడానికి ప్రాణాలైనా పణంగా పెడతారు. తెలుగుదేశం పార్టీ కోసం పోరాడేవారు నేడు ప్రతి గ్రామంలో ఉన్నారు. వైసీపీలో భూకబ్జాదారులు అధికమయ్యారు. దళితులపై అత్యాచారాలు జరిగినా, ఎవరినైనా కొట్టి డబ్బు లక్కోవాలని ప్రయత్నించినా, వాలంటీర్లు అఘాయిత్యాలకు పాల్పడినా, వైసీపీ ఆకృత్యాలకు పాల్పడినా గ్రామంలోని ఐ-టీడీపీ కార్యకర్త నుండి రాష్ట్రంలోని ఐ-టీడీపీ కార్యకర్త వరకు ప్రతి క్షణం అప్రమత్తమై అడ్డుకుంటారు. వైసీపీ నాయకులు విధ్వంసాలకు పాల్పడతామంటూ ఐ-టీడీపీ చూస్తూ ఊరుకోదు.
మహిళల పట్ల వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్న తీరు చాలా జుగుప్సాకరంగా ఉంటోంది. వైసీపీ నాయకుల వద్ద సాంకేతికతను టీడీపీ నాయకులకు అప్పతిష్టపాలు చేయడానికి వినియోగిస్తున్నారు. ఈ సాంకేతికతను రాష్ట్రం అభివృద్ధి చెందడానికి వినియోగించండి. వైసీపీ వద్ద ఉన్న సాంకేతికతను నేరాలు తగ్గించడానికి వినియోగించాలి. రైతులు ఎదుర్కొంటున్న నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగులమందు సమస్యలను సాంకేతికత ఉపయోగించి పరిష్కరించాలి. అత్యంత త్వరగా నిర్మాణాలు జరిగేలా సాంకేతికత తీసుకురావాలి.
అచ్చెన్నాయుడు, చింతకాయల విజయ్, వెంకటపతిరాజు, వంగలపూడి అనిత, టీడీపీ యువత వైసీపీ నాయకుల బెదిరింపులకు భయపడేదిలేదు. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం. ప్రజలకు నిజాలు తెలిపేందుకు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో తెలుగుదేశం విభాగం ఐటీడీపీ పనిచేస్తుందే తప్ప పారిపోయే పరిస్థితి లేదు. ఖచ్చితంగా తెలుగుదేశం సాంకేతిక విప్లవం ప్రజల కోసమే. నకిలీ పార్టీ, నకిలీ మంత్రి, నకిలీ పోస్టులు ఫేక్ పోస్టులు ఎన్ని పెట్టినా ఎదుర్కొనే సత్తా ఐ-టీడీపీకి ఉందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు నొక్కి వక్కాణించారు.