Suryaa.co.in

Telangana

శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర వెనక పీకే కుట్ర:డీకే అరుణ

హైదరాబాద్: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర.. ఒక బోగస్ అని బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ అన్నారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమని స్పష్టం చేశారు.శ్రీనివాస్ గౌడ్‌ను చంపాల్సిన అవసరం ఎవరకీ లేదన్నారు. తన అవినీతిని కప్పిపుచ్చుకోవటానికి మంత్రి తాపత్రయ పడ్తున్నారని అన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ అవినీతిపై పోరాడుతోన్న వారికి కచ్చితంగా షల్టర్ ఇస్తామని స్పష్టం చేశారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర వెనుక… ప్రశాంత్ కిషోర్ కుట్ర ఉందని ఆరోపించారు. ”రాత్రి వేళ ఇంటిపై రాళ్ళు వేయటం కాదు.. దమ్ముంటే నాపై రాజకీయంగా పోరాడాలి. ఇది బెంగాల్ కాదు.. పీకే వ్యూహాలు తెలంగాణలో పనిచేయవు. నీకు భార్య, పిల్లలున్నారని కేసీఆర్ గుర్తుంచుకోవాలి. మహిళాగా కేసీఆర్ ప్రభుత్వ అరాచకాలపై పోరాడుతాను. పులిలా ఉండే పోలీస్ ఆఫీసర్ స్టీఫెన్ రవీంద్ర.. పిల్లిలా మారటం బాధాకరం” అని డీకే అరుణ వ్యాఖ్యలు చేశారు.

LEAVE A RESPONSE