Home » అమ్మ కోసం మొక్క

అమ్మ కోసం మొక్క

– వర్షం అతివృష్టి అనావృష్టి గా ఉంది

అమరావతి: “అమ్మ కోసం ఒక చెట్టు” అనే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విజయవాడ నగరంలోని బి.ఆర్ టీఎస్ రోడ్ లో ఉన్న కేంద్రీయ విద్యాలయం, ఎదురుగా ఉన్న రోడ్డు లో చెట్లు నాటారు.

అనంతరం దగ్గుబాటి పురంధేశ్వరి మీడియా తో మాట్లాడుతూ .. పార్టీని బలోపేతం చేయడం పై దృష్టి సారించాం.సమాజంలో ఉండే అన్ని అంశాలపై కూడా బిజెపి ఏకాగ్రత పెట్టింది. వర్షం అతివృష్టి అనావృష్టి గా ఉంది. దేశంలో..ఢిల్లీలో ఇటీవల 53 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు చేరాయి.

శ్యామా ప్రసాద్ ముఖర్జీ వర్థంతి 23 జూన్ నుండి జులై 6 శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వరకూ మొక్కలు నాటాలని జాతీయ స్థాయిలో పార్టీ నిర్ణయం తీసుకుంది. ప్రకృతి ని తల్లి గా భావిస్తాం. అందుకే అమ్మ కోసం మొక్క అనే పేరు తో జాతీయ స్థాయిలో ఈకార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈరోజు కార్యకర్తలు తో కలిసి మొక్కలు నాటడం జరిగిందన్నారు. పర్యావరణ కాలుష్యం వల్ల రైతులు, ప్రజలు నష్టాలు చెవి చూస్తున్నారు అన్నారు.

ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ,మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజి,యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీగ,బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పలపాటి శ్రీనివాసరాజు,పార్లమెంట్ ఇంఛార్జ్ మువ్వల వెంకట సుబ్బయ్య,బిజెపి జిల్లా సీనియర్ నాయకులు భోగవల్లి శ్రీధర్, పిట్టలగోవిందు, పీయూష్ దేశాయ్ ,మహిళా మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గాయత్రి ఉపాధ్యక్షురాలు బొమ్మదేవర రత్నకుమారి జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల గోవింద్ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు ఎర్ర సునీత , షేక్ రజీనా నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply