(సుబ్బు)
మడిసన్నాక కూసింత కళా పోసన కావాలంటారు రావుగోపాలరావు ముత్యాలముగ్గులో. అలాగే పొలిటికల్ లీడర్ అన్నాక, కూసింత క్రీడాభిరుచి ఉండాలంటున్నారు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఫుట్బాల్ క్రీడాకారుడైన రేవంత్, సీఎం కాకముందు రోజు జిమ్ కి వెళ్ళి ఎక్సర్సైజులు చేసేవారు. ఇప్పుడు సీఎం ఐన తర్వాత జిమ్ కు వెళ్ళటం మానేసి, ఇంట్లోనే ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఈ నెల 13 న మెస్సీ టీంతో జరిగే ఫుట్బాల్ మ్యాచ్ కోసం, ఎం సి హెచ్ అర్ డి గ్రౌండ్ లో ప్రాక్టీస్ షురూ చేశారు. ప్రాక్టీస్ అంటే అట్లాంటి ఇట్లాంటి ప్రాక్టీస్ కాదు. చమటలు కారిపోయేంత సీరియస్ ప్రాక్టీస్ అన్నమాట. రోజు రాజకీయ ప్రత్యర్థులతో ఆటలాడుకునే రేవంత్ రెడ్డి.. ఈరోజు మాత్రం అసలు ఆటగాడి అవతారం ఎత్తారు. రేవంత్ మామూలోడు కాదు!