Suryaa.co.in

National

మహిళా పొదుపు సంఘాలకు ప్రధాని నరేంద్ర మోడీ బహుమతి : జీవీఎల్

– బ్యాంకుల ద్వారా పూచీకత్తు లేని రుణ సదుపాయం 20 లక్షల రూపాయల వరకు పెంపుదల, పూర్తి స్థాయిలో అమలు చేయాలని పార్లమెంటులో ఎంపీ జీవీఎల్ విజ్ఞప్తి

దేశ వ్యాప్తంగా 34 మహిళా పొదుపు సంఘాలకు కేంద్ర పథకం NRLM కింద బ్యాంకుల ద్వారా రుణాలు గత సంవత్సరం మంజూరు చేస్తే కేవలం ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లో 8.4 లక్షల సంఘాలకు బ్యాంకు రుణాలు ఇవ్వడం జరిగింది అని ఎంపీ జీవీఎల్ తెలియ చేసారు.

గత సంవత్సరం పొదుపు సంఘాలకు బ్యాంకుల ద్వారా ఇచ్చిన రుణాలు ఒక లక్షా ఇరవై వేల కోట్లు దాటాయని, గత ఏడు సంవత్సరాల్లో పొదుపు సంఘాలకు కేంద్ర ప్రభుత్వ పథకం కింద తక్కువ వడ్డీకే ఇచ్చే బ్యాంకు రుణాలను నాలుగురెట్లు పెంచినందుకు ప్రధాని నరేంద్ర మోడీ కి ఎంపీ జీవీఎల్ ధన్యవాదాలు తెలియజేశారు.

ప్రధాని మోడీ నాయకత్వం లోని కేంద్ర ప్రభుత్వం NRLM పథకం కింద 20 లక్షల రూపాయల వరకు హామీ లేని బ్యాంకు రుణాలను స్వయం సహాయక బృందాలకు అందజేయాలని ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులను నిర్దేశించినప్పటికీ, కేవలం 10 లక్షల రూపాయల వరకు మాత్రమే బ్యాంకు రుణాలు అందజేయ పడుతున్నాయని, వాటిని 20 లక్షలకు పెంచేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంపీ జీవీఎల్ కోరారు.

స్వయం సహాయక బృందాలు రుణాల తిరిగి చెల్లింపులో 98 శాతం వరకు సఫలమైనందువల్ల ఈ రుణ పరిమితి 20 లక్షలకు బ్యాంకులు పెంచేలా ఖచ్చితంగా అమలు చేయాలని జీవీఎల్ కేంద్రాన్ని కోరారు.
ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయ పార్టీలు రాజకీయ కార్యక్రమాలకు మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులను హాజరు అవమని కోరడం అమానుషమని, ఆలా భవిష్యత్తులో కోరకుండా కేంద్రం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని జీవీఎల్ సభలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

LEAVE A RESPONSE