కంకిపాడు : విద్యాబుద్ధులు నేర్పించవలసిన గురువు వికృత చేష్టలతో పాఠశాలకు వచ్చిన చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తించిన కీచక టీచర్ పై ఫోక్సు చట్టం కింద కేసు నమోదు చేశారు. కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో జరిగిన ఈ సంఘటన పాఠశాలల్లోని చిన్నారుల భద్రతపై అనుమానాలు లేవనెత్తుతుంది.
ఈడుపుగల్లు గాంధీ నగర్ లో గల ఎంపీపీ మోడల్ పాఠశాల లో మండవ వెంకట శ్రీనివాస్ అనే 60 సంవత్సరాల ఉపాధ్యాయుడు నాలుగో తరగతి చదువుతున్న ఓ చిన్నారి పట్ల గత కొంతకాలంగా అసభ్యంగా ప్రవర్తించడం ఈ విషయం ఇంటిలో చెప్తే కొడతానని బెదిరించడంతో ఆ చిన్నారి ఈ బాధను మనసులోనే దాచుకొని భయాందోళనకు గురై జ్వరం బారిన పడటంతో తల్లిదండ్రులు ఆరా తీయడంతో అసలు విషయం బయటకు వచ్చింది.
ఇందులో దోషి ప్రధానోపాధ్యాయురాలు రూపవాణి కూడా, ఎందుకంటే పాఠశాలలోని చిన్నారులు ఆగస్టు 15 రోజే ఈ కీచక టీచర్ అసభ్య ప్రవర్తనపై ఫిర్యాదు చేసిన, ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం గాని ఆ టీచర్ను ప్రశ్నించడం గాని తల్లిదండ్రులకు చెప్పడం గాని చెయ్యకుండా ఇంటికాడ చెప్పొద్దంటూ చిన్నారులనే బెదిరించారు. అందుకే పోలీసులు ఆమెపైన కూడా కేసు నమోదు చేశారు.
ఇక విద్యాశాఖ పోలీస్ అధికారులు పాఠశాలలో తల్లిదండ్రులతో సమావేశం నిర్వహిస్తే ఈ సమావేశంలో అనేక భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. కీచక టీచర్ మండవ వెంకట శ్రీనివాస్ పాఠశాలలో క్లాస్ రూమ్ లో బూతు వీడియోలు చూస్తూ ఆ చిన్నారులతో ఒళ్ళు నొక్కించుకునేవాడని, చిన్నారులు బాత్రూం కి వెళ్తుంటే వారితో పాటే బాత్రూం సైతం వెళ్లేవాడని అంతేకాకుండా అభం శుభం తెలియని చిన్నారుల ప్రైవేట్ పార్ట్స్ సైతం టచ్ చేసేవాడని గత కొన్ని నెలలుగా అనేకమంది విద్యార్థులతో ఇలాగే ప్రవర్తిస్తున్నట్లు తెలిసింది.
అంతేకాదు ఈ కీచక ఉపాధ్యాయుడి చేష్టలు పాఠశాలలోని అధ్యాపకులు ఇతర సిబ్బంది మొత్తానికి తెలుసని అయినా వారు బయటకు పక్కనివ్వకుండా కాపాడారని వాస్తవం బయటపడింది. ఇవే కాదు.. పాఠశాలలో ఉపాధ్యాయులు ఓ గదిలో మీటింగ్ పెట్టుకుని కూర్చుంటే స్వీపర్ విద్యార్థులకు పాఠాలు చెప్పేవారని ఇదే విషయాన్ని ప్రధానోపాధ్యాయురాలు అడిగితే అదేమీ లేదని దాటవేశారని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు.
కంకిపాడు ఎస్ఐ సందీప్ మాట్లాడుతూ..తమకు ఫిర్యాదు వచ్చిన వెంటనే విచారణ చేపట్టి ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని విషయం తెలిసినా ఫిర్యాదు చేయని ప్రధానోపాధ్యాయురాలు పైన కూడా కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.నిందితుణ్ణి న్యాయస్థానంలో హాజరు పరచగా రిమాండ్ విధించారని..విచారణ వేగవంతంగా పూర్తి చేసి నిందితుడికి తగిన శిక్ష పడే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
కంకిపాడు మండల ఎంఈఓ మాట్లాడుతూ.. తమకు ఫిర్యాదు అందిన వెంటనే ఉన్నత అధికారులకు నివేదికలు పంపి ఆ ఉపాధ్యాయుని తక్షణమే సస్పెండ్ చేశామని తెలిపారు.ఇలాంటి చర్యలను తాము సమర్ధించమని పాఠశాలలో అందరి పైన విచారణ జరిపి బాధ్యులైన వారి పైన కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
బాధితురాలు తల్లి మాట్లాడుతూ.. ఆ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు శ్రీనివాస్ పిల్లలు పట్ల బ్యాడ్ టచ్ చేస్తూ బాగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. అక్కడ జరిగే తంగమంతా ప్రధానోపాధ్యాయురాలు స్వీపర్కు తెలిసిన ఎవరు బయటపెట్టకుండా పిల్లలను భయభ్రాంతులకు గురి చేశారు. పాప తన పడుతున్న ఇబ్బంది తమ దృష్టికి తీసుకు వచ్చిన తర్వాత ఇంకా ఎవరెవరికి ఇలా చేస్తున్నారని అడిగితే కొందరు పేరు చెప్పగా వారి ఇంటికి కూడా మేము వెళ్లి విచారించగా వారు కూడా సదరు మాస్టారు పై ఇలా చేస్తున్నారని చెప్పారు.
ఇంతకాలం మీరు ఎందుకు చెప్పలేదు అని పిల్లలను ప్రశ్నిస్తే మా టీచర్ చెప్పొద్దు అని చెప్పితే మమ్మల్ని కొడతారు అని చెప్పడం గమనార్హం. గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఇంకొక సంవత్సర కాలంలో రిటైర్మెంట్ అవుతున్న ఆ మాస్టారికి కఠినంగా శిక్షించాలని మేం కోరుతున్నాం.