Suryaa.co.in

Telangana

పేకాట మంత్రి దయాకర్ రావుని బర్త్ రఫ్ చేయాలి

*గుట్కాలు రాయుళ్ళు, గ్యాంబ్లర్స్ తో బంగారు తెలంగాణ సాధ్యం కాదు. ఇలాంటి సన్నాసులకు మంత్రులుగా కొనసాగే అర్హత లేదు
*మంత్రులకు జూదం ఆడుకోమని లైసెన్స్ ఇచ్చారా ? సామాన్యులకు ఒక చట్టం, మంత్రులకు ఒక చట్టమా ? పోలీసులు సెలక్టివ్ పోలీసింగ్ మానుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
– ఎఐసిసి జాతీయ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్

”బాధ్యతాయుత మంత్రి పదవిలో వుంటూ ఆ పదవి ప్రతిష్టను దిగజార్చి, సభ్య సమాజం సిగ్గుపడే రీతిలో జూదం ఆడుతూ పేకాట రాయుడిగా పట్టుబడ్డ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని బర్త్ రఫ్ చేయాలి” అని డిమాండ్ చేశారు ఎఐసిసి జాతీయ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేకాట ఆడుతూ పట్టుబడ్డ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఈ వ్యవహారం పై దాసోజు శ్రవణ్ తీవ్రంగా స్పందించారు.

”గతంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ నిషేధిత మత్తు పదార్ధాలు బహిరంగ ప్రదేశాల్లో తింటూ మీడియా కంటికి చిక్కిన సంఘటన ఇంకా గుర్తే వుంటుంది. తెలంగాణాలో పొగాకు గుట్కా బ్యాన్ చేసిండ్రు కదా, మరి ఈమంత్రులకు యెట్లా దొరికింది? ఎవరు స్మగుల్ చేస్తుండ్రు? ఎట్లా సప్లై చేస్తుండ్రు? అని ప్రశ్నిస్తూ.. బ్యాన్ చేసిన మత్తు పదార్ధాలు తింటున్న మంత్రులపై పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టాలని గతంలో డిమాండ్ చేశాం. కానీ తేలు కుట్టిన దొంగల్లా ప్రభుత్వం, అధికారులు దానిపై స్పందించకుండా మంత్రులని కాపాడే ప్రయత్నం చేశారు. ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు పరాకాష్టగా తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేకాడుతూ పట్టుబడ్డ చిత్రాలు సామజిక మాధ్యమాల ద్వారా వైరల్ అవుతున్నాయి. లాంటి సన్నాసి మంత్రుల ద్వారా బంగారు తెలంగాణ ఎలా సాదిస్తారో సిఏం కేసీఆర్ చెప్పాలి ? అని ప్రశ్నించారు దాసోజు.

”మంత్రులుగా గుట్కాలు తింటే కేసులు పెట్టరు. పేకాట ఆడుతూ పట్టుబడినా కేసులు పెట్టరు. జూదం ఆడుతున్నారనే సమాచారంతో తాజాగా మాదాపూర్ పోలీసులు రైడ్ చేస్తే ఎమ్మల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో సహా పలువురు పట్టుపద్దారని వార్తలు వచ్చాయి. కానీ ఈ కేసులో మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పేరు లేకుండా చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల కోసం ప్రత్యేకంగా చట్టాలు, రాజ్యాంగం ఉందా ? అసలు కేసీఆర్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అనుసరిస్తుందా ? ఇంత దుర్మార్గమా ? కేసీఆర్ ఇలాంటి సన్నాసులందరిని మంత్రులుగా చేసి, వారితో పని చేయించకుండా, వాళ్ళ శాఖలు కూడా తన కంట్రోల్ పెట్టుకుని డమ్మీ మంత్రులుగా మార్చి , పనిలేని మంత్రులని పేకాటరాయుళ్ళు గా మార్చుతున్నారా ? అని ప్రశ్నించారు దాసోజు.

సాధారణ పౌరులు వినోదం కోసం పేక ఆడితే, కేసులు పెట్టి నానా హింసలు పెట్టె పోలీసులు ఎందుకు ఎర్రబెల్లి , మరియు ఇతర ఎమ్మెల్యే ల పై చర్యలు ఎందుకు తీసుకోరు. అదికూడా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు కూతవేటు దూరంలో banjarahills పరిధిలో ఇంత దుర్మార్గం జరుగుతుంటే పోలీసులు ఎందుకు ప్రేక్షక పాత్ర పోషిస్తుండ్రు.

ఎర్రబెల్లి కి, తెరాస ఎమ్మెల్యే లకు పేకాడమని ప్రత్యేక లైసెన్స్ ఇచ్చారా?
‘2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత పేకాట క్లబ్బులన్నీ మూసేస్తామని కేసీఆర్ గొప్పగా చెప్పారు. మొన్న అసెంబ్లీలో కూడా పేకాటపై ఉక్కుపాదం మోపమని వెల్లడించారు. కానీ నేడు మంత్రి ఎర్రబెల్లి పేకాడుతూ పట్టుబడ్డారు. కానీ మంత్రిపై ఎందుకు ఇంకా చర్యలు తీసుకోవడం లేదు ? కంచే చేను మేసినట్లు పోలీసు కంట్రోల్ రూమ్ కి కూతవేటు దూరంలోనే మంత్రి పేకాడుతున్నట్లు సామజిక మాధ్యమాల్లో వార్తలు వెలువడుతున్నాయి. అయినా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. మంత్రులకు జూదం ఆడుకోమని లైసెన్స్ ఇచ్చారా ? సామాన్యులకు ఒక చట్టం , మంత్రులకు ఒక చట్టమా ? అని నిలదీశారు దాసోజు.

గుట్కా రాయుళ్ళు, గ్యాంబ్లర్స్ తో బంగారు తెలంగాణ సాధ్యం కాదు. ఇలాంటి సన్నాసులకు మంత్రులుగా కొనసాగే అర్హత లేదు. వెంటనే వీరిని మంత్రి పదవుల నుంచి బర్త్ రఫ్ చేసి క్రిమినల్ కేసులు పెట్టాలి. పోలీసులు సెలక్టివ్ పోలీసింగ్ చేయకుండా చట్టం ముందు అందరూ సమానం అనే సత్యాన్ని గ్రహించి అనైతిక చర్యలకు పాల్పడుతున్న మంత్రులపై కేసులు పెట్టాలి” అని డిమాండ్ చేశారు దాసోజు.

LEAVE A RESPONSE