– నేలవిడిచి సాము చేస్తున్న కూటమి ప్రభుత్వం
సుదీర్ఘ రాజకీయ , పాలన అనుభవం కల చంద్రబాబు నాయకత్వం లోని కూటమి ప్రభుత్వం ఈ దుస్సాధ్యమైన ప్రాజెక్టుని ఎందుకు ఒక ఎమోషనల్ ప్రాజెక్టుగా ప్రొజెక్ట్ చేస్తున్నారో అర్థం కాదు . వైఎస్ హయాంలో ప్రారంభించబడిన పోలవరం ప్రాజెక్ట్ ఈరోజుకీ దిక్కూదివాణం లేదు . మోడీ అన్నట్లు ఎంతో మందికి ఏటీఎం కావటం మినహాయించి రాష్ట్రానికి ఏం ప్రయోజనం కలగలేదు .
82 వేల కోట్లు ప్రస్తుత అంచనా . ఒక వేళ ప్రారంభమయినా ఆనాటికి కనీసం లక్షాయాభైవేల కోట్లు అయినా ఆశ్చర్యం లేదు . వాతావరణం దృష్ట్యా నల్లమల అడవుల్లో 18 వేల ఎకరాలలో అడవులను కొట్టివేయవలసి ఉంటుంది . సాధ్యమా !? ఇరవై కి.మీ టన్నెల్సను తవ్వాలి . అయ్య బాబోయ్ .
అయిదు చోట్ల నీటిని లిఫ్ట్ చేయాలి . దీనికి సుమారు 3,337 మెగా వాట్ల పవర్ కావాలి . ఎంత ఖర్చు అవుతుందో ప్రజలు ఆలోచించాలి . 82 వేల కోట్లకు కాను 41 వేల కోట్లు అప్పుల ద్వారా , 16,380 కోట్లు కేంద్రం గ్రాంట్ , 8,190 కోట్లు రాష్ట్ర వాటా , 16,380 కోట్లు ప్రైవేటు పెట్టుబడి . ఇదీ డబ్బుల లెక్క .
చంద్రబాబు ఈ ప్రాజెక్ట్ మీద మనసు పారేసుకుంటే , పర్యావరణ అనుమతులు వస్తే , మొత్తం ప్రాజెక్టుని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వటం బెటర్ . వాళ్ళ చావేదో వాళ్ళు చస్తారు . అయితే ఈ ప్రైవేటోళ్ళు మన ఇండియన్ బాంకుల వద్ద అప్పు తీసుకోకుండా ఫారిన్లో అప్పులు చేయాలనే షరతు విధించాలి . లేకపోతే ఇండియన్ బాంకులకు ప్రైవేటోళ్ళు అప్పులు ఎగ్గాడతారు . అప్పుడు కూడా మనకే నష్టం .
చంద్రబాబు ప్రెస్టేజికి పోకుండా ముందు పెండింగులో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసుకోవటం మంచిది . లేకపోతే 2029 ఎన్నికలకు ఇది కూడా పెద్ద ఇష్యూ అవుతుంది .మళ్ళా మోడీ ఏటీఎం అంటారు . ఆదానీకో , అంబానీకో , మేఘాకో పూర్తిగా ఇచ్చేయండి . ఆల్ ది బెస్ట్.
మనవి : బాధ్యత కల ప్రజలు ఈ ప్రాజెక్ట్ గురించి భావోద్వేగాలను పక్కన పెట్టి అధ్యయనం చేయండి .
– ప్రొఫెసర్ దోగిపర్తి అనంత రామ సుబ్రహ్మణ్యం