Suryaa.co.in

Andhra Pradesh

జగన్ ప్రిజనరీ ఆలోచనల ప్రతిఫలమే పోలవరం వినాశనం

– రాష్ట్రానికి వరప్రదాయినిగా నిలవాల్సిన ప్రాజెక్ట్ ను, ధనదాహం, మూర్ఖత్వంతో జగన్ బలితీసుకున్నాడు.
• గైడ్ బండ్ రిటైనింగ్ వాల్ కుంగిపోవడం, ఎగువకాపర్ డ్యామ్ దెబ్బతినడాన్ని పీ.పీ.ఏ గుర్తించేవరకు జగన్ ప్రభుత్వం నిద్రపోయింది.
• 2020లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే, 2022లో ప్రాజెక్ట్ పూర్తిచేస్తామంటూ జగన్ అతని భజనబృందం నిస్సిగ్గుగా ప్రజల్నినమ్మించే ప్రయత్నంచేసింది.
• పీ.పీ.ఏ నిపుణులబృందం, ఐ.ఐ.టీ హైదరాబాద్ నివేదికలపై ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఏంసమాధానం చెబుతాయి?
• పోలవరాన్ని నాశనంచేసిన జగన్మోహన్ రెడ్డినిపీ.పీ.ఏ విభాగం రాష్ట్రప్రజల తరుపున కాలర్ పట్టుకొని నిలదీయాలి.
• ధనదాహం, మూర్ఖత్వంతో పోలవరాన్ని నాశనంచేసి, రాష్ట్రానికి సాగు, తాగునీరులేకుండా చేసినందుకు జగన్ ప్రజలకు బహిరంగక్షమాపణ చెప్పాలి.
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు

రాష్ట్రానికి వరప్రదాయిని అయిన పోలవరం ప్రాజెక్ట్ కి జగన్మోహన్ రెడ్డి శనిలా, శాపంగా మారాడని, అతనిప్రభుత్వం ప్రాజెక్ట్ కు గుదిబండగా తయారైందని, ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలకమైన స్పిల్ వేను సుడిగుండాలముప్పునుంచి నివారించడానికి నిర్మించిన గైడ్ బండ్ రిటైనింగ్ వాల్ కుంగిపోవడం, ఎగువకాపర్ డ్యామ్ నుంచి లీకేజీలు రావడాన్ని పీ.పీ.ఏ (పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ) బృందం నిర్ధారించడం ముఖ్యమంత్రి ప్రిజనరీ ఆలో చనలకు నిదర్శనమని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనసభ్యులు నిమ్మల రామా నాయుడు తెలిపారు.

మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లా డారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే ..!

“ జగన్మోహన్ రెడ్డి ప్రిజనరీ ఆలోచనలకు పోలవరంప్రాజెక్ట్ వినాశనమే పెద్దఉదాహరణ. చంద్రబాబు విజనరీ అని ఎందుకు అంటున్నామంటే ఆయనపనితీరుచూసి. కేవలం 5 సంవత్సరాల్లో పోలవరంనిర్మాణాన్ని 72శాతంపూర్తిచేశారు. ప్రాజెక్ట్ పనులుశరవేగంగా జరిపించడంకోసం 28సార్లుప్రత్యక్షంగా పోలవరంపనుల్ని పరిశీలించారు. 82సార్లు వర్చువల్ గా అధికారులతో సమావేశమయ్యారు. 2020 జూన్ నాటికి పోలవరం పూర్తి చేయాలన్న ధృఢచిత్తంతో చంద్రబాబు ప్రాజెక్ట్ పనుల్ని శరవేగంగా జరిపించారు.

దానికి నిదర్శనమే 24గంటల్లో 32లక్షలక్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని జరగడం, ఆ ఘనత మొత్తం గిన్నిస్ రికార్డుల్లో నిలవడం. గోదావరినీటిని రాష్ట్రంలోని ఇతరనదులతో అనుసంధానంచేసేలా, రాష్ట్రానికి సాగునీరు, తాగునీరు సమస్యలేకుండా చేసేందుకు చంద్రబాబు పడినతపన, చేసినపనులే ఆయనవిజనరీ ఆలోచనకు తార్కాణాలు. 2014-19మధ్యన పోలవరంనిర్మాణంకోసం చంద్రబాబు, ఆయనప్రభుత్వం ఎంతగానో పాటుపడితే, జగన్ అధికారంలోకి వచ్చినమరుక్షణం నుంచే ప్రాజెక్ట్ ని పాడుపెట్టాడు.

ముఖ్యమంత్రి అవ్వగానే జగన్ పోలవరంవినాశనానికి శ్రీకారంచుట్టాడు.
ముఖ్యమంత్రి అవ్వగానే జగన్ పోలవరం నిర్మాణపనులు నిలిపేయడంద్వారా ప్రాజెక్ట్ వినాశనానికి శ్రీకారంచుట్టాడు. ప్రాజెక్ట్ పనుల్లో భాగంగా ఒకేపనిని రెండుసంస్థలుచేస్తే భవిష్యత్ లో ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రమాదంఏర్పడితే ఎవరుబాధ్యతవహిస్తారన్న పీపీఏ సందేహాల్ని ఖాతరుచేయకుండా జగన్ ఏకపక్షంగా, మూర్ఖత్వంతో వ్యవహరించాడు. రివర్స్ టెండరింగ్ డ్రామాలాడి, రిజర్వ్ టెండరింగ్ చేసి, పోలవరంప్రాజెక్ట్ ని బలితీసుకు న్నాడు.పోలవరంప్రాజెక్ట్ పూర్తై ఉంటే జూన్ 1 నాటికే కాలువల్లో ఉధృతంగా నీటి ప్రవాహం ఉండేది. కానీ ఇప్పుడు కాలవల్లో మోకాలిలోతునీళ్లులేవు.

2019మేలో ముఖ్యమంత్రిగా బాధ్యతలుచేపట్టిన జగన్, వెంటనే పోలవరంప్రాజెక్ట్ పనులు నిలిపేస్తున్నట్టు నిర్ణయంతీసుకున్నాడని టైమ్స్ ఆఫ్ ఇండియాపత్రిక జూన్ 1న కథనం ప్రచురించింది.

2019 మే నెలలో రాష్ట్రముఖ్యమంత్రిగా ప్రమాణంచేసిన జగన్, పోలవరంప్రాజెక్ట్ కి సంబంధించి జరుగుతున్న అన్నిపనులు నిలిపేస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నాడు. జగన్ తీసుకున్న నిర్ణయాన్ని జూన్ 1న జాతీయదినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా ప్ర ముఖంగా ప్రచురించింది. సరైన ప్రత్యామ్నాయఏర్పాట్లు చేయకుండా, పనులుచేస్తున్న ఏజెన్సీలనుకాదని జగన్ ఏకపక్షంగా తీసుకున్ననిర్ణయంవల్లే పోలవరంబలైంది.2019 ఆగస్ట్ 16న అప్పటి పీ.పీ.ఏ సీఈవో ఆర్.కే.జైన్ ప్రాజెక్ట్ పనులుచేస్తున్న ఏజెన్సీలను మార్చవద్దని జగన్ ప్రభుత్వానికి లేఖరాసి మర్యాదపూర్వకంగా విన్నవించుకున్నారు.

ఎవరుచెప్పినా, ఏంజరిగినా తాను అనుకున్నదే జరగాలన్న ముఖ్యమంత్రి తనపెడధో రణితో, ముందుకెళ్లి అప్పటివరకు పోలవరంప్రాజెక్ట్ పనులుచేస్తున్న నవయుగ, బేకమ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సంస్థల్ని జగన్ నిర్దాక్షణ్యంగా తొలగించాడు. ఎగువకాపర్ డ్యామ్ పనులు టీడీపీప్రభుత్వంలో 80శాతంపూర్తయ్యాయి. జూన్, జూలైలో వరదలు వచ్చేనా టికి ఎగువకాపర్ డ్యామ్ పనులుపూర్తయితే, వరదలధాటికి డయాఫ్రమ్ వాల్ దెబ్బతి నకుండాఉండేది. ఎగువ కాపర్ డ్యామ్ పనులుచేస్తున్నసంస్థను కాదన్న జగన్ నిర్ణయమే డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి ప్రధానకారణం.

వరదనీటిని మళ్లించే యంత్రాంగం ప్రాజెక్ట్ ప్రాంతంలో అందుబాటులో లేకుండా చేయడంకూడా మరోకారణం. ఏజెన్సీసంస్థలు, అధికారులు, యంత్రాంగం ఎవరూలేకుండా చేసిన జగన్ ప్రాజెక్ట్ ని గాలికివదిలేయడంతో టీడీపీ ప్రభుత్వంలో జరిగినపనులన్నీ నీళ్లపాలయ్యాయి. ఐ.ఐ.టీ హైదరాబాద్ నిపుణులు డయాఫ్రమ్ వాల్ ను పరిశీలించి, ఎందుకు దెబ్బతి న్నదోవివరిస్తూ పీ.పీ.ఏకు నివేదికఇచ్చింది. ఒకేపనికి రెండుఏజెన్సీలను నియమిం చడం కూడా డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి కారణమనితేల్చింది.

మూడు నెలల్లోపూర్తికావాల్సిన కాపర్ డ్యామ్ పనుల్ని రాష్ట్రప్రభుత్వం 14నెలలు అయినా ఎందుకు పూర్తిచేయలేకపోయిందని కూడా ఐ.ఐ.టీ హైదరాబాద్ తన నివేదికలో ప్రశ్నించింది. 2020ఆగస్ట్ లో వరదలువచ్చే సమయానికి ఎగువ, దిగువకాపర్ డ్యామ్ లపనులు పూర్తిచేయకపోవడమే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణమని తేల్చింది. ఐ.ఐ.టీ హైదరాబాద్ నివేదికపై ముఖ్యమంత్రి ఏంసమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నాం.

2020లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే, 2022లో ప్రాజెక్ట్ పూర్తిచేస్తామంటూ జగన్ అతని భజనబృందం నిస్సిగ్గుగా ప్రజల్నినమ్మించే ప్రయత్నంచేసింది.

2020 ఆగస్ట్ లో పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే, జగన్మోహన్ రెడ్డి, అతని మంత్రులు అసెంబ్లీలో 2021జూన్ కి, 2022 డిసెంబర్ కి ప్రాజెక్ట్ ని పూర్తిచేస్తామని ప్రగ ల్భాలు పలికారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే, రెండేళ్లవరకు ప్రాజెక్ట్ లో అదిఉందో లేదోకూడా తెలుసుకోకుండానే జగన్ అతని భజనబృందం నిస్సిగ్గుగా ప్రజల్ని నమ్మిం చే ప్రయత్నంచేసింది. తమప్రభుత్వచేతగానితనం ప్రజలకు తెలియకుండా చేసేందుకు ప్రతిపక్షాలను, ప్రజల్ని, ఇతరసంఘాల నాయకుల్ని ఎవరినీ ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్ల కుండా అడ్డుకుంది.

పీ.పీ.ఏ, ఐ.ఐ.టీ హైదరాబాద్ నివేదికలపై ముఖ్యమంత్రి ఏంసమాధానం చెబుతాడు?

2022నాటికి పూర్తవ్వాల్సిన పోలవరంప్రాజెక్ట్ జగన్ నిర్వాకం, ప్రభుత్వతప్పిదాలతోనే నిలిచిపోయిందని చెబుతూ, సాక్షాత్తూ పోలవరం ప్రాజెక్ట్ కార్యదర్శి, ఏపీప్రభుత్వ ప్రధానకార్యదర్శికి లేఖరాశాడు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి, గైడ్ బండ్ కొట్టుకు పోవడానికి, పోలవరంపూర్తిగా అటకెక్కడానికి జగన్మోహన్ రెడ్డి మతిలేని ఆలోచనలే కారణం. ఈ మాటమేంచెప్పడంకాదు.. పీ.పీ.ఏ నిపుణులబృందం, ఐ.ఐ.టీ హైదరా బాద్ వారే తేల్చారు. పీ.పీ.ఏ, ఐ.ఐ.టీ హైదరాబాద్ నివేదికలపై ముఖ్యమంత్రి ఏం సమాధానంచెబుతాడు?

ధనదాహం, మూర్ఖత్వంతో పోలవరాన్ని బలితీసుకున్న జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రప్రజల పక్షాన పీ.పీ.ఏ నిలదీయాలి.

ఆంధ్రప్రదేశ్ ను కరువురహితంగా మార్చే గొప్పప్రాజెక్ట్ ని జగన్మోహన్ రెడ్డి తనదుర్మా ర్గపు ఆలోచనలతో సర్వనాశనంచేశాడు. జగన్ రాష్ట్రానికి, మరీముఖ్యంగా రైతాంగానికి చేసిన అన్యాయంపై ప్రతిపౌరుడు ఆయన్ని చొక్కాపట్టుకొని నిలదీయాలి. తాము చెప్పి నా వినకుండా ఒకేపనిని రెండుఏజెన్సీలకు ఎందుకు ఇచ్చారని, దానివల్ల ప్రాజెక్ట్ కు జరిగిననష్టాన్ని ఎవరుభర్తీచేస్తారని పీ.పీ.ఏ కూడా ముఖ్యమంత్రిని ప్రశ్నించాలి.

తన ధనదాహంతో, మూర్ఖత్వంతో పోలవరంప్రాజెక్ట్ ను బలితీసుకున్న జగన్మోహన్ రెడ్డి క్ష మార్హుడు. జగన్ నిర్వాకంతో గోదావరికృష్ణా డెల్టా స్థిరీకరణ నిలిచిపోయింది. గోదావరి నీరు ఉత్తరాంధ్రకు, రాయలసీమకు చేరకుండా వృథాగా సముద్రంపాలైంది. ఇన్నిఘోరమైన తప్పిదాలకు పాల్పడిన ముఖ్యమంత్రిని పోలవరంప్రాజెక్ట్ అథారిటీ నిలదీసి, కఠిన చర్యలుతీసుకోవాలి.” అని రాష్ట్రప్రజల తరపున నిమ్మల డిమాండ్ చేశారు.

 

LEAVE A RESPONSE