తూర్పుగోదావరి జిల్లా తునిలో అక్రమ గంజాయిని అడ్డుకునేందుకు పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు .జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని తుని పట్టణ పోలీసులు చేపట్టారు. గంజాయి అక్రమ రవాణా అడ్డుకునేందుకు గత కొద్ది రోజులుగా పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా తుని ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, హైవే వాహనాలను తనిఖీలు చేస్తున్నారు.దీనిలో భాగంగా తుని రైల్వే స్టేషన్ లో డాగ్స్ స్క్వేడ్ తో పట్టణ సిఐ సన్యాసిరావు,సిబ్బంది కలిసి ప్రయాణీకుల బ్యాగ్ లను,లగేజీ ని తనిఖీలు చేశారు.