– బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు విజయలక్ష్మి
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో ఏబీవీపీ స్టేట్ సెక్రటరీ ఝాన్సీ మీద పోలీసుల దుశ్చర్య అమానుషం. నిరంకుశంగా జుట్టు పట్టి లాగడం అమానవీయం. ఏబీవీపీ కార్యదర్శి ఝాన్సి పై పోలీసుల దాడిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.
కాంగ్రెస్ ప్రభుత్వంలో కనికరం, దయ లేకుండా పోలీస్ మార్క్ ట్రీట్‌మెంట్‌ను చూపిస్తున్నారు. తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా ముఖ్యమంత్రి గారు? ముఖ్యమంత్రి గారు మహిళలకు కావాల్సింది బస్సులో ఉచిత ప్రయాణం కాదు, మహిళలకు కావాల్సింది ఫ్రీడం ఆఫ్ ప్రొటెక్షన్ – ఫ్రీడం ఆఫ్ స్పీచ్.
వ్యవసాయ ఉద్యాన వర్సిటీ భూముల జీవో నెంబర్ 55ను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు నిరసనకు దిగారు. వారికి మద్దతుగా నిలిచి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఏబీవీపీ మహిళా కార్యకర్తపై లేడీ కానిస్టేబుల్స్ వ్యవహరించిన తీరు చూస్తే సభ్యసమాజం తలదించుకుంటోంది. సాటి మహిళ అని కూడా చూడకుండా లేడీ కానిస్టేబుల్ వ్యవహరించడం దుర్మార్గం. వ్యవసాయ వర్సిటీ భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది.
సిరులు పండించడంతోపాటు దేశానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా అన్నం పెడుతున్న గుండెకాయవంటి వ్యవసాయవర్సిటీని చీల్చడం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం సరికాదు. రాష్ట్ర వ్యవసాయ ఉద్యాన వర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయింపు నిర్ణయం ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి.
రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగానికి మేలు చేయకూర్చి దేశంలోనే అగ్రగామిగా చేసి రైతులకు నష్టాలు జరగకుండా రైతులు పండించే ప్రతి పంటకు లాభం వచ్చే విధంగా నూతన వంగడాలను విత్తనాలను పై పరిశోధన, అభివృద్ధి కోసం ఏర్పాటు చేయబడింది.
అలాంటి వర్సిటీలో 35 సంవత్సరాలుగా మెడిసిన్ ప్లాంట్స్ వెజిటేబుల్స్ సీడ్స్ ఆ గ్రూప్ ఫారెస్ట్రీ మొదలగు వాటిపై ఎన్నో రకాల పరిశోధనలు జరిగి రైతాంగాన్ని పటిష్టం చేయడానికి ఎనలేని కృషి చేయడం జరుగుతోంది. కొత్త సర్కార్ ఆగ్రో బయోడైవర్సిటీ కొనసాగుతున్న పార్కులో రాష్ట్ర హైకోర్టుకు సంబంధించిన భవనాలను కట్టడానికి జీవో నెంబర్ 55ను తీసుకరావడం సరికాదు.
అగ్రికల్చర్ వర్సిటీలో హైకోర్టు భవనాలను కట్టడం అంటే రాష్ట్రంలోని వ్యవసాయ రంగాన్ని తుంగలో తొక్కి వ్యవసాయ అభివృద్ధికి అడ్డుకట్ట వేయడమే. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి వర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించే నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమం మరింత తీవ్రంగా మారుతుంది.
మానవహక్కుల సంఘం సుమోటోగా తీసుకోవాలి. మహిళాహక్కుల సంఘం స్పందించాలి. విద్యార్థి, మహిళాలోకం ఝాన్సీకి అండగా నిలవాలి. ఏబీవీపీ విద్యార్థినిపై దాడికి పాల్పడిన మహిళా పోలీసులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న వారిపై రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ విధానాన్ని విడనాడాలి. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి.