Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో జగన్ దుర్మార్గపు పాలనకు పోలీసుల దౌర్జన్యం తోడయింది

– పోలీసులు తమ నెత్తి మీద 3 సింహాలకు బదులు 3 ఫ్యాన్ రెక్కలు పెట్టుకోండి.
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు

జగన్ రెడ్డి ఓ వైపు వైసీపీ రౌడీలను అడ్డుపెట్టుకుని ప్రజల్ని, మరో వైపు పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ నేతల్ని హింసిస్తున్నారు. వైసీపీ అరాచక పాలనకు వత్తాసు పలకడం దుర్మార్గం.టీడీపి నేత బుద్దా వెంకన్న అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సమాజంలో అల్లర్లు సృష్టిస్తూ అరాచకాలు చేస్తున్న వైసీపీ గుండాలను వదలి టీడీపీ నేతలపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారు. టీడీపీ కార్యకర్తల్నివైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కొడాలి నాని…కొంతమంది వైసీపీ నేతలు టీడీపీ కార్యకర్తల్ని రెచ్చగొట్టేలా, సభ్యసమాజం తలదించుకునేలా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు? వారిపై ఏం చర్యలు తీసుకున్నారు? 3 ఏళ్లలో ఎంతమంది వైసీపీ నేతల్ని అరెస్ట్ చేసారు? పోలీసులు తమ నెత్తి మీద 3 సింహాలకు బదులు 3 ఫ్యాన్ రెక్కలు పెట్టుకోండి. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చెప్పినట్టు విని డి జిపి, డి. జి. పి చెప్పినట్టు విని కొంతమంది పోలీసులు వారి భవిష్యత్ ను వారే అంధకారంలోకి నెట్టుకుంటున్నారు. తక్షణమే బుద్దా వెంకన్నను విడుదల చేయాలి.

LEAVE A RESPONSE