– నేడు విచారణకు హాజరుకావాలని ఆదేశం
అల్లు అర్జున్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మంగళవారం తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులు సోమవారం సాయంత్రం ఆయనకు చేరాయి. కోర్టులకు వెళ్లి పోలీసుల ఎదుట హాజరవ్వకుండా మినహాయింపులు తెచ్చుకుంటారన్న ఉద్దేశంతో పొద్దుపోయాక ఈ నోటీసులు పోలీసులు జారీ చేసినట్లుగా భావిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు ఈ అంశంపై చాలా సీరియస్ గా ఉన్నారు. అందుకే అల్లు అర్జున్ డుమ్మా కొట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.