– పేర్ని నాని విలువలు లేకుండా మాట్లాతున్నాడు
– చంద్రబాబుతో పాటు అలిపిరి, రామతీర్థం కొండలు పేర్ని నాని, జగన్ రెడ్డిలు కూడా ఎక్కలేరు
– 40 ఏళ్ళకే నాపని అయిపోయిందని కొడుక్కి పగ్గాలు అప్పజెప్పిన వ్యక్తి పేర్ని నాని
– కొడాలి నాని, వల్లభనేని వంశీని అరెస్ట్ చేయించి కొడుక్కి కృష్ణా జిల్లా పగ్గాలు అప్పగించాలని పేర్ని నాని కుట్ర పన్నాడు
– పేర్ని నాని వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలి
– గోవా నూతన గవర్నర్‌గా నియమితులైన అశోక్ గజపతి రాజుకి శుభాభినందనలు
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
పేర్ని నాని వ్యాఖ్యలు వెనుక కుట్ర దాగి ఉందని, టీడీపీని రెచ్చగొట్టి కొడాలి నాని, వల్లభనేని వంశీలను అరెస్ట్ చేస్తే తన కొడుకుకి కృష్ణా జిల్లా సామ్రాజ్యాన్ని అప్పగించాలని పేర్ని నాని పన్నిన పన్నాగమే ఇందంతా అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దుయ్యబట్టారు. సోమవారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన… వైసీపీ విలువలు లేని రాజకీయాలు చేస్తుందని, పేర్ని నాని వాడిన భాష సరైనది కాదు అని వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన ఇంకా, ఏమన్నారంటే..
“కూటమి ప్రభుత్వం రావడంతో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు గాడిన పడ్డాయి. కానీ వైసీపీ, జగన్ రెడ్డి దుర్మార్గపు ఆలోచనలు, చర్యల వలన రాజకీయాలు రోడ్డున పడుతున్నాయి. సినిమాల్లో రాజనాల కుట్రలు కుతంత్రాలు ఎలా ఉండేవో నేడు జగన్ రెడ్డి కుట్రలు అలా ఉంటున్నాయి. రాజకీయాల్లో విలువలు లేకుండా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని వాడే భాష ఏంటి? ప్రజలు ఛీ కొట్టినా ఇంకా సిగ్గు రాలేదా? ఒకప్పుడు ఇలా మాట్లాడే వల్లభనేని వంశీ జైలుకు పోయి ఊసలు లెక్కపెట్టి బతుకు జీవుడా అంటూ బయటకి వచ్చాడు. జగన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు శాసనసభలో ఏమి స్క్రిప్టు ఇస్తే అది మీరు చదవాలి. అలా రాసి చదవమంటే నేను చదవను అని మాగుంట శ్రీనివాసులు పక్కకి నెట్టేశాడు. ఈరోజు పేర్ని నానిలాంటి వారు జగన్ రెడ్డి రాసిచ్చిన స్క్రిప్టును చదివేస్తూ ఘోరంగా మాట్లాడుతున్నారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబుతో నువ్వు గాని, జగన్ రెడ్డి గాని నడవగలరా?
“చంద్రబాబుకి 76 ఏళ్లు అంటూ అవహేళన చేస్తావా పేర్ని నాని? నీకు అంత కొవ్వు పట్టిందా? ఆయనతో పాటు రామతీర్థం, అలిపిరి కొండ ఎక్కగలవా? అలిపిరి బాంబ్ బ్లాస్ట్ లో చావును చూసి తిరిగొచ్చి హీరోగా నిలిబడిన వ్యక్తి చంద్రబాబు. మీ రాజ్యంలోనే అనపర్తిలో పోలీసులు చంద్రబాబుని నిలువరిస్తే ఏడు కి.మీ నడిచారు. నాడు ఆయనతో పాటు పోలీసుల నడవలేకపోయారు. చంద్రబాబు పేరు చెబితేనే వణుకు వచ్చే వ్యక్తి పేర్ని నాని. ఏ ఫైళు మీదనైనా సంతకం పెట్టాలంటే పేర్ని నానికి చెయ్యి వనికిద్ది. 40 ఏళ్లు రాగానే నాపని అయిపోయింది నా కొడుకును పెట్టుకుంటానని తప్పించుకున్న నువ్వు చంద్రబాబు గురించి మాట్లాడుతావా? సబ్జెక్ట్ పరంగా గాని, విజన్ పరంగా గాని ఎలా చూసుకున్న చంద్రబాబు పక్కన జగన్ రెడ్డి ఒక్క నిమిషం కూడా కూర్చోలేడు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ని, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ని ఒరే తురే అంటావా? నోరు అదుపులో పెట్టుకో!” అని హెచ్చరించారు.
రప్పా… రప్పా అంటూ సినిమా తీయండి…
“నాడు వల్లభనేని వంశీ, కొడాలి నాని, నేడు పేర్ని నాని, ప్రశన్న కుమార్ రెడ్డిలకు ఏమైంది? రాష్ట్రాన్ని అరాచకరాజ్యంగా మార్చాలని వైసీపీ చూస్తోంది. గంగమ్మ తిరునాళ్ళలో పొట్టేలు తలలు నరికినట్టు రప్పా రప్పా నరకాలా అని ప్లేకార్డులు ప్రదర్శిస్తే తప్పేంటని జగన్ రెడ్డి మాట్లాడాడు. వైసీపీ ఆలోచనలు ఏంటో రప్పా రప్పా అని బూతుల డైరెక్టర్ చేత సినిమా తీయించండి. రాజకీయాల్లో పేర్ని నాని లాంటి వారిని చూసి మేం రాజకీయాల్లో ఉన్నామని చెప్పుకోవడానికే సిగ్గుపడాల్సి వస్తుంది. రాజకీయ నాయకులు అంటే ప్రజలకు దురభిప్రాయాన్ని ఏర్పడేడట్లు వైసీపీ చేసింది.
అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంతోమంది మహానేతలు రాష్ట్రపతి, ప్రధానులు అయ్యారు. అలాంటి రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డిలాంటి రాజకీయ ఉన్మాదులను చూస్తుంటే నవ్వాలో ఏడవాల్లో తెలయడం లేదు. కొడాలి నాని, వల్లభనేని వంశి అంతపెద్ద హీరోలు అయితే కూటమి ప్రభుత్వం అధికారొంలోకి రాగానే ఎక్కడికి పోయి దాక్కున్నారు?” అని ప్రశ్నించారు.
కొడుకుకి కృష్ణా జిల్లాను అప్పగించాలని పేర్ని నాని స్కెచ్…
“కొడాలి నాని, వల్లభనేని వంశిలపై టీడీపీని రెచ్చగొట్టి వారిద్దరిని తిరిగి జైలుకి పంపిస్తే పేర్ని నాని కొడుకు కిట్టుకు మొత్తం కృష్ణా జిల్లా రాజ్యాన్ని అప్పగించాలని చూస్తున్నట్లు పేర్ని నాని కుట్ర ఉంది. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. ప్రజాసేవలోకి వచ్చాక ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలి, సేవ చేయాలనే తపన ఉండాలి. కానీ, నేడు సాక్షి పత్రికను చదువుతుంటే రాష్ట్రం నాశనం అయిపోవాలి, తిరిగి వైసీపీ చేతుల్లోకి రాష్ట్రం రావాలి, మరలా వైసీపీ నాయకుల కాళ్ల కింద నలిగిపోవాలి అనే విధంగా ఉంటుంది. పేర్ని నాని వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పించు జగన్ రెడ్డి. పేర్ని నాని వాడిన ప్రతి మాట జగన్ రెడ్డి నోటినుంచి వచ్చినట్లే అని ప్రజలు భావిస్తున్నారు.” అని అన్నారు.
దేశ ప్రధానికే చంద్రబాబు ఆదర్శంగా నిలిచారు….
చంద్రబాబు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. పక్క రాష్ట్రాలు చంద్రబాబు విజన్‌ను చూసి నేర్చుకుంటున్నాయి. సాక్షాత్ దేశ ప్రధానే చంద్రబాబు చేస్తున్న ఐటీ అభివృద్ధుని చూసి నేను గుజరాత్లో అమలు చేశాను అని అన్నారు. జగన్ రెడ్డి ఏమి చేశాడో ఒక్కటి చెప్పండి. ఏదైనా ఉందా అంటే బాబాయిని చంపడం, తల్లి చెల్లిని గెంటేయడం, ఇంకో చెల్లి నా తండ్రిని చంపిన వారి పేర్లన్ని ఉన్నాయి అరెస్ట్ చేయండని కోర్టు చుట్టూ తిరగడం. ఇటువంటి రక్త చరిత్ర ఉన్నవ్యక్తి దేశంలో ముఖ్యమంత్రిగా చేసిన వారి చరిత్రలో జగన్ రెడ్డి తప్పించి మరెవ్వరూ లేరు.
కుటుంబాలపై మాటల దాడి చేస్తుంటారు. మా తల్లిదండ్రులపై కాకాణి గోవర్ధన్ రెడ్డి, చంద్రబాబు కుటుంబంపై వల్లభనేని వంశి దూషించారు. ఇటువంటి వ్యక్తులను పార్టీలో పెట్టుకొని రాజకీయాలను, వ్యవస్థలను భ్రష్టు పట్టించిన వ్యక్తి జగన్ రెడ్డి. వెంటనే ఈ విషయంలో జగన్ రెడ్డి కలగజేసుకొని పేర్ని నాని చేత క్షమాపణలు చెప్పకపోతే వైసీపీ అనే పార్టీ తుడుచుపెట్టుకుపోతది. పద్ధతిగా ఉండి క్షమాపణలు చెప్పండి” అని డిమాండ్ చేశారు.
కూటమి ప్రభుత్వంలో రాజకీయ కక్షలు లేవు – తప్పు చేస్తే శిక్ష తప్పుదు…
చట్టం తనపని తాను రాజ్యాంగబద్ధంగా చేసుకుంటూపోతుంది. ఎటువంటి రాజకీయా కక్షలు మేము చేయడం లేదు. రాజకీయ విరుధిని అరెస్ట్ చేయాలనే మనస్తత్వం ఉన్న వ్యక్తి చంద్రబాబు గారు కాదు. తప్పు చేసిన ప్రతి ఒక్కడు ఎంత స్థాయిలో ఉన్న చట్టం ముందు నించుపెడుతున్నాం. వారు శిక్ష అనుభవించడం తప్పదు. అది ప్రశన్నకుమార్ రెడ్డి అయినా, వల్లభనేని వంశీ అయినా. వైసీపీ నాయకులు వారంతట వారే రోచ్చగుంటలో దిగి ఏదిపడితే అది మాట్లాడుతూ జైలుకు పోయే పరిస్థితిని తెచ్చుకుంటున్నారు.
ఒక మనిషిని నిన్ను చంపేస్తే దిక్కెవరు అనడం సెక్షన్ 307 కింద వచ్చినప్పుడు రాత్రికి వేసేసి పగలు పరామర్శించండి అని పేర్ని నాని అన్న వ్యాఖ్యలు 307 సెక్షన్ కింద రాదా? ఇప్పుడు పేర్ని నానిని వదిలేస్తే అదే బాటలు మిగిలిన వైసీపీ నాయకులు కూడా మాట్లాడుతారు. ఏవైనా క్రిమినల్ ఆక్టివిటీస్ అంటే మనకు బీహార్ గుర్తుకువచ్చేది. అంతకుమించి చెడ్డ పేరు మన రాష్ట్రానికి తీసుకురావాలని వైసీపీ ప్రయత్నిస్తుంది. మద్యం కుంభకోణంలో రోజురోజు బయటకు వస్తున్న వాస్తవాలను చూస్తుంటే నేర సామ్రాజ్యంలాంటి ఒక సినిమాను చూస్తున్నట్లు ఉంది” అని అన్నారు.
గోవా గవర్నర్‌గా నియమితులైన అశోక్ గజపతిరాజు శుభాభినందనలు…
“విజయనగర సామ్రాజ్యాన్ని ఏలిన వారసుడు, నిజాయితీపరుడు, క్రమశిక్షణ నాయకుడు పూసపాటి అశోక్ గజిపతిరాజు గోవా రాష్ట్రానికి గవర్నర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించడం సంతోషంగా ఉంద. ప్రధాని నరేంద్రమోదీకి, సీఎం చంద్రబాబుకి, కూటమి ప్రభుత్వానికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. తరతరలా నుంచి విజయనగరాన్ని పరిపాలించి ఎన్నో విద్యా సంస్థలు, సేవా కార్యక్రమాలను చేస్తూ మచ్చలేని సామ్రాజ్యంగా అశోక్ గజపతిరాజు గారి కుటుంబం నిలిచింది” అని గుర్తుచేసుకున్నారు