ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంబటి రాంబాబు అంటేనే వివాదాలకు చిరునామాగా మారిపోయారు. తాజాగా ముఖ్యమంత్రిపై ఆయన చేసిన అసభ్యకర వ్యాఖ్యలు అహంకారానికి పరాకాష్ట అయితే, ఆయన గత చరిత్రను ఒకసారి పరిశీలిస్తే.. ఈ తరహా ప్రవర్తన ఆయనకు కొత్తేమీ కాదని స్పష్టమవుతోంది.
మహిళల పట్ల అగౌరవం – నైతిక పతనం
గతంలో సొంత పార్టీ మహిళా కార్యకర్తల సంజనను వేధించిన ఆరోపణల నుండి, “సుకన్య” అనే మహిళతో “అరగంట.. గంట” అంటూ సాగించిన ఫోన్ సంభాషణల వరకు—ఆయన వ్యక్తిత్వంపై ఎన్నో మచ్చలు ఉన్నాయి. మహిళలను అధికార బలంతో లోబర్చుకునే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు ఆయనను ఇప్పటికీ వెంటాడుతున్నాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, స్త్రీల పట్ల కనీస గౌరవం లేని ప్రవర్తనతో “ఉమనైజర్” అనే అపవాదును మూటగట్టుకోవడం ఆయన నైతిక పతనానికి నిదర్శనం.
రాజకీయ కక్ష సాధింపులు – కోడెల ఉదంతం:
మాజీ సభాపతి కోడెల శివప్రసాద్ గారిని కుట్రపూరితంగా, వ్యక్తిగతంగా వెంటాడి ఆయన ఆత్మహత్యకు కారణమైన వైకాపా ‘పాపపు ఆట’లో అంబటి రాంబాబుది కీలక పాత్ర. ఆనాడు ఆయన చేసిన పనులు నేడు శాపాలుగా మారుతున్నాయని సామాన్య ప్రజలు అభిప్రాయపడుతున్నారు. పుట్టిన సొంత కులాన్ని కూడా రాజకీయం కోసం, పదవుల కోసం దూషించడానికి వెనుకాడక దూరం చేసుకున్న దుర్మార్గుడు.
ధర్మం – నోటి దురుసు:
మన పురాణాల్లో విభీషణుడు రాక్షసుల మధ్య ఎలా ఉన్నావని అడిగితే.. “32 దంతాల మధ్య నాలుక వలె” మెలుగుతున్నానని చెప్పాడట. అంత జాగ్రత్తగా వాడాల్సిన నాలుకను అంబటి అదుపులేకుండా వాడారు. అధికారంలో ఉన్నప్పుడు అడ్డూఅదుపూ లేని అహంకారం, అధికారం పోయాక కూడా తగ్గని అదే పొగరు ఆయన నోటి దురుసును, లోపల ఉన్న రాక్షస ప్రవృత్తిని బయటపెడుతున్నాయి.
బాధ్యతారాహిత్యం – అబద్ధాల పుట్ట:
నీటి పారుదల శాఖ మంత్రిగా ఉండి కూడా “పోలవరం ప్రాజెక్టు అంటే ఏంటో నాకు అర్థం కాలేదు” అని పదవి దిగాక బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం ఆయన బరితెగింపునకు సాక్ష్యం. అడ్డగోలుగా అబద్ధాలు ఆడటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.
ఇటీవలే తిరుమల వెళ్లి ప్రస్తుతం భోజనాలు, ప్రసాదం నాణ్యత బావుంది అని కితాబు ఇచ్చారు. ఇంతలోనే కలియుగ వైకుంఠమైన తిరుమలలో లడ్డూ నాణ్యత విషయంలో కూడా తప్పుడు సమర్థనలు చేస్తూ ధర్మానికి అపచారం తలపెట్టారు. అందుకే అంటారు—”కర్మ ఎవరినీ వదలదు” అని.
మహిళలతో అసభ్య సంభాషణలు, తోటి నాయకులపై బూతు పురాణం, పోలీసులపై దౌర్జన్యం—ఇవన్నీ వెరసి అంబటి రాంబాబును ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెట్టాయి. “పొగరెక్కిన వాడు తన నాశనాన్ని తానే కొనితెచ్చుకుంటాడు” అన్నట్లుగా, నేడు ఆయన ఎదుర్కొంటున్న పరిస్థితులు ఆయన స్వయంకృతమే. ధర్మం పట్ల అపచారం తలపెట్టినా, స్త్రీల పట్ల అగౌరవంగా ప్రవర్తించినా ప్రకృతి ఎవరినీ వదిలిపెట్టదు. ఈ ఉదంతం రాజకీయ నేతలందరికీ ఒక హెచ్చరిక—”అధికారం అశాశ్వతం, సంస్కారమే శాశ్వతం!”
-చాకిరేవు