Suryaa.co.in

Andhra Pradesh

అక్టోబరు 3న పాలిసెట్ స్పాట్ అడ్మిషన్లు

సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి
సెప్టెంబరు 30 న అయా కళాశాలల నోటీస్ బోర్డులో ఖాళీల వివరాలు
పాలిసెట్ రాయకున్నా, రాసి ర్యాంకు రాకున్నా అర్హులే

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో మిగిలిన సీట్లను ఆక్టోబరు 3వ తేదీ నిర్వహించే స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ ద్వారా భర్తీ చేయనున్నట్లు సాంకేతిక విద్యా శాఖ కమీషనర్, ప్రవేశాల కన్వీనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఆసక్తి కలిగిన విధ్యార్ధులు సెప్టెంబరు 30వ తేదీన అయా పాలిటెక్నిక్ కళాశాలల నుండి అందుబాటులో ఉన్న సీట్ల వివరాలను తెలుసుకోవచ్చన్నారు. సంబంధిత కళాశాల నోటీస్ బోర్డులో విభాగాల వారిగా ఖాళీ సీట్ట వివరాలను పొందుపరుస్తారని స్పష్టం చేసారు.

స్పాట్ అడ్మిషన్ పొందగోరు విద్యార్ధులు పదవతరగతి ఉత్తీర్ణులు అయి ఉంటే సరిపోతుందని, పాలిసెట్ ఎంట్రన్స్ రాయకపోయినా, రాసినప్పటికీ ర్యాంకు రాకపోయినా సీటు పొందవచ్చన్నారు. అక్టోబరు 3వ తేదీనే అడ్మిషన్లకు సంబంధించిన మొత్తం ప్రక్రియ ముగుస్తుందని, ఆసక్తి ఉన్న అభ్యర్దులు తమ ఒరిజినల్ ధృవీకరణ ప్రతాలతో హాజరు కావాలని నాగరాణి తెలిపారు.

ప్రవేటు పాలిటెక్నిక్ లలో ప్రవేశాలకు రూ.25,000, ప్రభుత్వ పాలిటెక్నిక్ లలో రూ.4,700 ఫీజును సైతం అదే రోజు చెల్లించ వలసి ఉంటుందన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఇదే చివరి అవకాశమని పదవతరగతి ఉతీర్ణులైన విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కన్వీనర్ సూచించారు.

స్పాట్ అడ్మిషన్ లో సీటు పొందిన విధ్యార్ధులు తక్షణమే తరగతులకు హాజరు కావాలని ఉంటుందన్నారు. మరింత సమగ్ర సమాచారం కోసం రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల కార్యాలయాలను సంప్రదించవచ్చని కమీషనర్ పేర్కొన్నారు.

LEAVE A RESPONSE