– రియల్ ఎస్టేట్ దందాకు రియల్ మాఫియాకు అడ్డాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం
– సుప్రీం కోర్టులో ఉంటే రెవిన్యూ అధికారులు చర్యలు తీసుకోరా?
– 7వేల కోట్ల రూపాయల విలువైన నాదర్ గుల్ భూములను జిల్లా అధికారులు కాపాడాలి
– మ్యూటేషన్ చేసినా ఎక్కడ కూడా రికార్డులలో లేదు.
బి ఆర్ ఎస్ నేతల రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో మీడియాతో మాజీ మంత్రి ,బీ ఆర్ ఎస్ ఎల్ పి ఉపనాయకురాలు సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రావణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి
రంగారెడ్డి: ప్రభుత్వానికి సంబంధించిన భూము లలో అక్రమాలు జరిగితే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రంగారెడ్డి జిల్లా లో వందల ఎకరాల భూములను కాంగ్రెస్ నాయకులు కబ్జాలు చేశారు. 7వేల కోట్ల రూపాయల విలువైన నాదర్ గుల్ భూములను జిల్లా అధికారులు కాపాడాలి. కబ్జాలు చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక భూ కబ్జాలు పెరిగాయి. గత 25 సంవత్సరాలుగా ప్రజాప్రతినిధిగా ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసాను. ప్రభుత్వ భూములను కాపాడటానికి వారు కృషి చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చాక ఏదో ఒక సాకు పెట్టుకొని కబ్జాలు చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్న రైతులను బయటికి పంపారు.
మ్యూటేషన్ చేసినా ఎక్కడ కూడా రికార్డులలో లేదు. హైకోర్టు సుప్రీంకోర్టు, ఆర్డీఓ కూడా ప్రభుత్వ భూమి అని చెప్పారు. ప్రైవేటు వ్యక్తులు మాత్రం రేకుల షీట్లు చేస్తూ కబ్జాలు చేస్తున్నారు. రెవెన్యూ మంత్రి నోటికొచ్చిన మాటలు మాట్లాడడం తప్ప, మేము లేవనెత్తిన అంశాలపై మాట్లాడలేదు. అధికారులకు నాదర్గుల్ భూములను కాపాడి ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం.
రక్షించాల్సిన ప్రభుత్వం భక్షించే పరిస్థితిలో ఉంది. అధికారులు కాంగ్రెస్ నేతలు కుమ్మకై 7 వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేస్తున్నారు. వ్యవసాయం చేసుకొనే రైతులను ఆదుకునేందుకు బిఆర్ఎస్ అండగా ఉంటుంది. మూడు రియల్ ఎస్టేట్ కంపెనీలు రంగారెడ్డి జిల్లా భూములు కబ్జాలు చేస్తున్నారు.
రియల్ ఎస్టేట్ దందాకు రియల్ మాఫియాకు అడ్డాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తయారైంది. ఆరు గ్యారంటీలతో గద్దె నెక్కిన రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజలను మోసం చేసింది. ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేస్తుంటే అధికారులు గుడ్డిగుర్రం పండ్లు తోముతున్నారు. ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తుంటే చర్యలు ఉండవు. ప్రభుత్వ సొంత భూములను కాపాడటంలో రెవిన్యూ అధికారులు విఫలమయ్యారు.
7 వేల కోట్ల రూపాయల భూములను దోచుకపోతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు హర్ష కబ్జాలకు రాజుగా తయారయ్యాడు. ఎన్ని కబ్జాలు చేసినా రేవంత్ రెడ్డి హోంమంత్రిగా ఏం పనిచేస్తున్నారు? కలెక్టర్ ను అడిగితే సుప్రీం కోర్టులో ఉంది అంటున్నారు. సుప్రీం కోర్టులో ఉంటే రెవిన్యూ అధికారులు చర్యలు తీసుకోరా? అధికారులు ఎన్ని అక్రమ పనులు చేసినా మంత్రులు ఎన్ని కబ్జాలు చేసినా చూస్తూ ఊరుకోవాలా ? వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే. తర్వాత అందరి సంగతులు చెపుతాం. ఫ్యూచర్ సిటీ పేరిట కాంగ్రెస్ నేతలు వేల ఎకరాల భూములను కబ్జాలు చేయటానికి సిద్ధం అయ్యారు.