Suryaa.co.in

Telangana

కేసీఆర్ బంగారు భారత్ నినాదం హాస్యాస్పదం

– రాష్ట్రాన్ని దివాళా తీయించిన కేసీఆర్ ఇప్పుడు దేశం వైపు చూస్తున్నాడు
– మాజీ పీసీసీ అధ్యక్షుడు

కేసీఆర్ బంగారు భారత్ నినాదం హాస్యాస్పదం గా ఉంది. ఇంగిత జ్ఞానం లేకుండా కేసీఆర్ మాట్లాడుతున్నాడు. కూటిలో రాయి తీయలేని వాడు .. ఏట్లో రాయి తీస్తా అన్నట్లు ఉంది.రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన చరిత్ర కేసీఆర్ ది.రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది కాక .. ఇప్పుడు దేశాన్ని భ్రష్టు పట్టిస్తనంటున్నాడు. కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఓ భ్రమ. దేశానికి నాయకత్వం వహించడానికి కేసీఆర్ కు ఉన్న బలమెంత .. ఆయన అనుభవం ఎంత?

రాష్ట్రాన్ని దోచుకున్న నీచమైన చరిత్ర కేసీఆర్ ది. రాష్ట్రాన్ని దివాళా తీయించిన కేసీఆర్ ఇప్పుడు దేశం వైపు చూస్తున్నాడు. కేసీఆర్ 8 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టు నైనా పుర్తి చేశాడా? కాళేశ్వరం తో ఒక్క ఏకరాకైనా నీళ్ళు ఇచ్చాడా? కేసీఆర్ నక్కజిత్తుల మాటలకు కాలం చెల్లిపోయింది. కేసీఆర్ నిజస్వరూపం ప్రజలకు అర్థం అవుతోంది. సైకిల్ టెర్రరిస్ట్ అంటూ మోదీ మాట్లాడటం సరికాదు.ప్రధానిగా ఉన్న వారు ఇలాంటి మాటలు మాట్లాడటమా? ఎన్నికలు ఉన్నాయి కదా అని ఏది పడితే అది మాట్లాడటం ఏంటి? చేతగాని ఆసమర్థులు దేశాన్ని పాలిస్తున్నారు.

LEAVE A RESPONSE