– ఎమ్మెల్యే సుజనా కు, కార్యాలయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థుల తల్లిదండ్రులు
విజయవాడ: నగరంలోని ప్రజలకు సమస్యలు వస్తే కార్పొరేటర్ కో, రాజకీయ పార్టీ నాయకులనో, ఎమ్మెల్యే నో ఆశ్రయించాల్సి ఉంటుంది. వారిని కలిసి పిఫార్సు లేఖ కానీ, సంబందిత అధికారులకు ఫోన్ చేయించడమో చెయ్యాలి. మరి ఇవన్నీ తెలియని నిరుపేదలకు పనులు అవ్వాలంటే గగనమే.. వారి సమస్య తీరాలంటే ఆసాధ్యమే. మరి అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి.
ఒక సీనియర్ జర్నలిస్ట్ ఫోన్ కాల్ తో ఒక పేదింటి చిన్నారుల పని మొత్తం వాళ్లు ఇంట్లోనుంచి బయటకు రాకుండానే కొన్ని గంటల్లోనే పూర్తయి ఇద్దరు చిన్నారులు బడి బాట పట్టేందుకు తోడ్పడింది. వివరాల్లోకి వెళితే …. ఏలూరు కు చెందిన షేక్ నాజర్ , రమీజా దంపతులు తన ఇద్దరు పిల్లలతో కలిసి కొద్ది నెలల క్రితం జీవనోపాధి నిమిత్తం విజయవాడ వచ్చి కంసాలి పేటలో నివాసం ఉంటున్నారు. వారి కుమార్తె షేక్ సుహానా (9) మూడో తరగతి , కుమారుడు షేక్ జాను (10) 5వ తరగతి చదువుతున్నారు. ఏలూరు నుంచి వచ్చిన ఈ ఇరువురికీ టీసీ లేని కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చుకోలేదు. నిరుపేద కుటుంబానికి చెందిన వారు కావడంతో కనీసం వారికి మొబైల్ ఫోన్ సౌకర్యం కూడా లేదు.
విద్యా సంవత్సరం మధ్యలో లని ఒకరు, టీ సీ లేదని మరొకరు… ఇలా ప్రతి స్కూల్ లోను నిబంధనలు, ఆంక్షలు పేరుతో పాఠశాలల్లో చేర్చుకోలేదు. పేదవారు కావడంతో ప్రైవేటు స్కూల్ లో చదివించే స్తోమత లేక పోవడంతో వారు ఇంటి వద్దే తిరుగుతున్నారు. కొద్ది రోజులుగా ఇది గమనించిన అదే ప్రాంతంలోని ఒక జర్నలిస్ట్ వారి తల్లిదండ్రులతో మాట్లాడి విషయం తెలుసుకున్నాడు. వారి సమస్యను కార్పొరేషన్, సర్వశిక్షా అభియాన్ అధికారులకు, విద్యా శాఖ వారికి తెలియ పరచినా ఎవరూ పట్టించుకోలేదు. సదరు జర్నలిస్టు ఈ విషయాన్నిసీనియర్ పాత్రికేయులు అంకబాబు కు తెలిపాడు. ఆయన విషయాన్ని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయ కార్యదర్శి పత్రిపాటి శ్రీధర్ కు తెలియ చేశారు. శ్రీధర్ వెంటనే ఆ ప్రాంతానికి చెందిన సుజనా మిత్ర కోఆర్డినేటర్ ను పంపి వివరాలు రప్పించారు.
విషయాన్ని ఎమ్మెల్యే సుజనా కు చెప్పడంతో ఆయన కలెక్టర్ తో మాట్లాడి ఇద్దరు చిన్నారులకు అడ్మిషన్ ఇప్పించాలని విజ్నప్తి చేశారు. ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి శ్రధర్ కలెక్టర్ తో సంప్రదింపులు జరపడంతో ఇద్దరు చిన్నారులకు అడ్మిషన్ లు ఇప్పించారు. పాతబస్తీ వించిపేట మహమద్ ఆలీపురం నగరపాలక సంస్థ ఫాఠశాలలో షేక్ జాను ను ఐదవ తరగతిలో, అతని సోదరి సుహానా ను 3 వ తరగతి లో చేర్చుకున్నారు. సుజనా కార్యాలయ సిబ్బంది , సుజనా మిత్రా కోఆర్డినేటర్ నజియా భాను తో కలిసి తల్దండ్రులకు అవగాహన కల్పించి వించిపేటలోని విఎంసి ఉర్దూమోడల్ ప్రైమరీ స్కూల్ లో చేర్పించారు.. ఎమ్మెల్యే సుజనా చౌదరి, విద్యాశాఖ అధికారుల ఆదేశాలతో విద్యార్థులు ఇద్దరినీ తమ పాఠశాలలో చేర్చుకున్నామని ప్రిన్సిపల్ అమీనాభి, సెకండ్ గ్రేడ్ టీచర్ హఫీజ్ తెలిపారు.
వారికి ఎక్కడ చేర్చాలి ఎలా చేర్చాలి అనే అంశంలో తల్లిదండ్రులకు సరైన అవగాహన లేకపోవడంతో టీ సీ కూడా తీసుకోలేక పోయారన్నారు. త్వరితగతిని స్పందించి విద్యార్థులను పాఠశాలకు చేర్చేల కృషిచేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు, ఆయన కార్యాలయ కార్యదర్శి శ్రీధర్ కు , సిబ్బందికి విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.. ఈ మొత్తం విషయాన్ని సదరు జర్నలిస్టు ట్విట్టర్ లో పోస్టు చేయడంతో పాటు ఎమ్మెల్యే సుజనా చౌదరి, వారి కార్యాలయం పేద పిల్లలకు అందించిన సహకారాన్ని కొనియాడారు.