ఒక ప్రభుత్వ టీచర్ ని తను కోరుకున్న చోటు కి బదిలీ చేయమని…. ఒక ముఖ్యమంత్రి…. విద్యాశాఖ మంత్రికి సిఫారసు చేశారు.
ఆ సిఫారసు చూసిన విద్యా శాఖ మంత్రి, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి, ఆ టీచర్ ని బదిలీ చేయడం సాధ్యం కాదు, అది నిబంధనలకు విరుద్ధం అని చెబుతారు.
ముఖ్యమంత్రి ఆశ్చర్యపోయి చూస్తుండగా… విద్యా శాఖ మంత్రి వివరిస్తారు.
*సార్ ఇంతకుముందు ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు, అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ… తమకు కావాల్సిన విధంగా బదిలీలు చేయించుకునేవారు. దాని వల్ల ఎంతో మందికి అన్యాయం జరిగేది, విద్యా సంవత్సరం మధ్యలో ఉపాధ్యాయుల బదిలీల వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోయేవారు. అలా జరగకూడదని… మనం ఒక శాస్త్రీయ విధానాన్ని ప్రారంభించాము. కౌన్సిలింగ్ ద్వారా, కేవలం వేసవి సెలవులలో మాత్రమే, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వారికి ప్రాధాన్యతనిస్తూ… న్యాయబద్ధంగా, అర్హతను బట్టి, సిఫారసులకు అతీతంగా బదిలీలు చేస్తున్నాము. అందరూ సంతోషంగా ఉన్నారు, ఎందుకంటే అర్హులకు న్యాయం జరుగుతుంది*
ఇప్పుడు చెప్పండి సార్….. మనం ప్రారంభించిన విధానాన్ని మనమే ఉల్లంఘిద్దామా?
వద్దు వెంకటేశ్వరరావు… నేను ఇంకెప్పుడు సిఫారసు చేయను…… మంత్రి చెప్పిన మొత్తం విన్న ముఖ్యమంత్రి నోట్లో నుంచి….. దూసుకొచ్చింది సమాధానం.
వ్యవస్థను గౌరవించి, నిబంధనలకు ప్రాధాన్యత ఇచ్చిన ఆ ముఖ్యమంత్రి పేరు నారా చంద్రబాబు నాయుడు. ఆ విద్యాశాఖ మంత్రి పేరు మండవ వెంకటేశ్వరరావు.
నా మాటే శాసనం……. అని విర్రవీగుతూ….. ప్రతిరోజు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న…… అరాచక పాలకులను చూస్తుంటే….. పదవి అంటే అధికారం కాదు…. బాధ్యత అని…… పనిచేసిన….. ఆ ముఖ్యమంత్రిని, ఆ విద్యాశాఖ మంత్రి ని…. ఏమనాలి?
– రామ్మోహన్, జర్నలిస్టు