-
‘ ప్రజావాణి ‘ ని సందర్శించిన ఆర్మీ, నేవీ, ఏయిర్ ఫోర్స్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల బృందం
-
‘ ప్రజావాణి ‘ కార్యక్రమం గురించి వివరించిన చిన్నారెడ్డి, దివ్య
-
సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్ఠాత్మక కార్యక్రమం ప్రజావాణి అని పేర్కొన్న చిన్నారెడ్డి, దివ్య
ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం అధ్భుతంగా ఉందని, ప్రజలు ప్రజా భవన్ లో తమ సమస్యలు విన్నవించేందుకు భారీగా తరలి వస్తుండటం విశేషం అని ఇండియన్ ఆర్మీ, నేవీ, ఏయిర్ ఫోర్స్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల బృందం అభిప్రాయపడింది.
మంగళవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్, ప్రజావాణి ఇంచార్జీ డాక్టర్ జీ చిన్నారెడ్డి, ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవారాజన్ లతో ఈ బృందం అధికారులు సమావేశమయ్యారు.
ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తీరును ఈ సందర్భంగా చిన్నారెడ్డి, దివ్య ఆ బృందానికి వివరించారు. బృందంలోని కొంత మంది అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు చిన్నారెడ్డి, దివ్య సమాధానాలు ఇచ్చారు.
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అర్జీలు అందజేసిన వెంటనే సమస్యలు ఓపికతో విని సీఎం ప్రజావాణి పోర్టల్ ద్వారా సంబంధిత శాఖల అధికారులకు పంపుతామని, సీఎం ప్రజావాణి పేరిట acknowledgement ఇస్తామని, ప్రజల సమస్య పరిష్కారం అయ్యే వరకు నిరంతరంగా ఫాలో అప్ ఉంటుందని చిన్నారెడ్డి, దివ్య తెలిపారు.
మరో వైపు అర్జీలు స్వీకరించి వాటిపై ఎండార్స్ మెంట్ చేసి, సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని చిన్నారెడ్డి, దివ్య ఆ బృందానికి వివరించారు.
ప్రజావాణి కార్యక్రమం ప్రాంతాన్ని ఈ బృందం సందర్శించింది. ప్రజావాణి కార్యక్రమం జరుగుతున్న తీరు తెన్నులను పరిశీలించిన ఈ బృందం… ప్రజావాణి కార్యక్రమం అధ్భుతం అని కొనియాడింది.
ఈ కార్యక్రమంలో ఎం సీ ఆర్ హెచ్ ఆర్ డీ అధికారి మాధవీ రావులపాటి కూడా పాల్గొన్నారు.