-పాదయాత్రలో లోకేశ్ తొలిఅడుగు పడకముందే ప్రభుత్వం సగం చచ్చింది. ఆయన అడుగేస్తే, ఈ ప్రజాకంటకప్రభుత్వం అథ:పాతాళంలోకే
– టీ.ఎన్.ఎస్.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్
ప్రజాకంటక ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడమే లక్ష్యంగా, జగన్ రెడ్డి నయవంచనకు బలైన దళిత, గిరిజన, బహుజన, మైనారిటీ వర్గాలకు నేనున్నానని ధైర్యం చెప్పేందుకే టీడీ పీ యువనేత నారాలోకేశ్ ‘యువగళం’ పేరుతో 27వ తేదీనుంచి ప్రజలతో మమేకం కాబోతు న్నాడు. లోకేశ్ ప్రజల్లోకి వెళితే తమప్రభుత్వ పునాదులు కదులుతాయన్న భయం ఇప్పటికే పాలకుల్లో మొదలైంది. ఆ భయం, వణుకుతోనే లోకేశ్ యాత్రకు ఇప్పటికీ ప్రభుత్వం అనుమ తివ్వలేదు. జగన్ రెడ్డి గతంలో యాత్రలుచేసినప్పుడు, అప్పటిప్రభుత్వాల అనుమతి తీసుకోలేదు. కానీ లోకేశ్ చట్టప్రకారం ప్రభుత్వాన్ని అనుమతి కోరారు. ప్రభుత్వం దుర్భుద్ధితో స్పందించకుంటే, న్యాయస్థానాల్ని ఆశ్రయించైనా, ఆయన ప్రతి ఇంటి తలుపు తడతారని స్పష్టం చేస్తున్నాం. లోకేశ్ అడుగు పడకముందే ఈప్రభుత్వం సగంచచ్చింది. ఇక అసలు అడుగుపడితే, ఆ అడుగు, వామనుడి మూడో అడుగులా ఈ ప్రభుత్వాన్ని అథ:పాతాళానికి తొక్కేస్తుంది అనడం అతిశయోక్తి కాదు.