– అనుచిత వ్యాఖ్యలపై నిప్పులు చెరిగిన పవన్ కల్యాణ్
అమరావతి: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత రెడ్డిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న చేసిన అనుచిత వ్యాఖ్యలపై జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. ఆమెకు పవన్ సంఘీభావం ప్రకటిస్తూ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న వ్యాఖ్యలు సభ్య సమాజం తల దించుకునేలా ఉన్నాయి… రాజకీయాలను రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప వ్యక్తిగత దూషణలు తగవన్నారు. మహిళా ఎమ్మెల్యేను ఉద్దేశించి ప్రసన్న మాట్లాడిన మాటలు సంస్కార రహితంగా ఉన్నాయని, సీనియర్ రాజకీయ నాయకుడైన ప్రసన్న చేసిన దిగజారుడు వ్యాఖ్యలు ప్రతి ఒక్కరు ఖండించాలని కోరారు. సభ్యతా సంస్కారాలు లేని ప్రసన్న లాంటి నాయకులను రాజకీయాల నుంచి బహిష్కరించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.