Suryaa.co.in

Telangana

17న ప్రీతి ఆత్మహత్య కేసు విచారణ

వరంగల్: వరంగల్ కేఎంసీ అనస్తీషియా విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడైన డా. సైఫ్ ఈ నెల 17న ఉమ్మడి వరంగల్ ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానంలో హాజరుకానున్నారు. న్యాయమూర్తి నేర నిర్ధారణ విచారణ చేయనున్నారు. అనంతరం ట్రయల్ తేదీల కోసం కేసు వాయిదా వేస్తారు. గత సంవత్సరం ఫిబ్రవరి 26న ప్రీతి హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది.

LEAVE A RESPONSE