Suryaa.co.in

Andhra Pradesh

కొత్త రేషన్ కార్డులు జారీకి రంగం సిద్ధం

మంత్రి నాదెండ్ల

రాష్ట్ర ప్రభుత్వం మరోకీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో నూతన రేషన్ కార్డులు జారీ చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఆ ప్రక్రియ ప్రారంభించామని.. డిజైన్ పూర్తికాగానే అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

అలాగే కొత్తగా వివాహమైన జంటలు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే.. వారికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. అర్హత ఉన్నవారికి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు అందిస్తామని.. త్వరలోనే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మరింత క్లారిటీ ఇస్తామన్నారు.

LEAVE A RESPONSE