– NSUI రాష్ట్ర అధ్యక్షులు బలమురి వెంకట్
– ప్రధాని వ్యాఖ్యలకు నిరసిస్తూ BJP రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించిన బలమురి వెంకట్
వందలాది మంది విద్యార్థులు,నిరుద్యోగులు ఎన్నో సంవత్సరాలు కోట్లాది తెలంగాణ రాష్ట్రన్నీ సాధించుకున్నాం. తెలంగాణలో బలిదానాలు ఆగాలి అని సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే. దేశ ప్రధానమంత్రి స్థాయిలో ఉండి యావత్ తెలంగాణ ప్రజలు పార్లమెంట్ లో అగౌరవ పరిచిన కేడి మోడీ వెంటనే క్షమాపణ చెప్పాలి.
రెండు రాష్ట్రాల్లో అధికారం కోల్పోతామని తెలిసి కూడా ఎంతో ధైర్య సాహసాలతో నిర్ణయం తీసుకొని సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. దీనికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బాధ్యత వహించి మోడీతో క్షమాపణ చెప్పించాలి లేకుంటే రాష్టంలో ఉన్న ప్రతి జిల్లా పార్టీ కార్యాలయాలను ముట్టడించి ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేస్తామని వెంకట్ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో NSUI రాష్ట్ర కార్యదర్శి పెండెం రాజు,రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి,హైదరాబాద్ ప్రధాన కార్యదర్శులు కుందన్, ఆవేజ్,మనికాంత్,నిజాం కాలేజీ విద్యార్థులు హనుమాన్,గణేష్,నిఖిల్ సాయి,రంగారెడ్డి జిల్లా నాయకులు వినోద్ చారి,వినిత్,దీక్షిత్,శ్రీనివాస్, సాయి,హైదరాబాద్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.