Suryaa.co.in

Andhra Pradesh

ప్రియా పచ్చడి.. మేరీ రెడ్డి- మార్టిన్ లూథర్ రెడ్డి.. ఒక సీఐడీ

– ఎంపీ రఘురామకృష్ణంరాజు చెప్పిన కొత్త ..‘పాతకథ’
– ఎవరా మేరీ రెడ్డి? ఏమా మార్టిన్ లూథర్‌రెడ్డి కథ?
– రాజుగారి కామెడీ కంప్లైట్

జగన్ సర్కారును రచ్చబండ పెట్టి ప్రతిరోజూ ఉతికి ఆరేసే నర్సాపురం వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు.. ఈసారి రామోజీరావు ప్రియాపచ్చడిపై పడ్డారు. వ్యంగ్యాస్త్రాలు విసరడమనే విలువిద్యలో.. ‘అర్జున’ అవార్డు అందుకున్న రఘురామరాజు చూపు, ఈసారి కృష్ణాజిల్లా లోని జొన్నపాడు వాస్తవ్యురాలైన, మేరీ రెడ్డి, వైఫాఫ్ మార్టిన్ లూథర్‌రెడ్డిపై పడింది. ఆ సీరియస్ కామెడీ కంప్లైంట్ కథ మీరే వినండి.

ఎప్పుడో చాలా దశాబ్దాల క్రితం తనకు రామోజీరావు వాటా ఇవ్వకుండా మోసం చేశారని, ఇప్పుడు యూరీరెడ్డి సీఐడీకి కంప్లైంట్ ఇచ్చినట్లుగానే.. అప్పడే మరో కథ జరిగింద ంటూ ఒక పాతకథను.. ఎంపి రాజు గారు కొత్తగా తెరపైకి తీసుకువచ్చారు.

రామోజీరావు తమ అమ్ముమ్మ పేరైన ప్రియా పేరు పెట్టుకుని.. ఆమె తయారుచేసిన పచ్చళ్ల ఫార్ములా తీసుకుని.. ఇస్తానన్న వాటా ఇవ్వకుండా పచ్చళ్ల బిజినెసు చేశారన్నది, ఆ కథలాంటి ఫిర్యాదు సారాంశం. మేరీ రెడ్డి, వైఫాఫ్ మార్టిన్ లూథర్‌రెడ్డికి జరిగిన ఈ ‘అన్యాయపు కథ’విని, సదరు రామోజీరావుపై చర్యలు తీసుకోవాలన్నది కథ చేసిన డిమాండు.

ఇంతకూ ఈ ముచ్చట్లన్నీ ఫిర్యాదు రూపంలో తనకు ఎవరో పంపారని, రాజు గారు చావు కబురు చల్లగా చెప్పారు. ఇన్ని చెప్పిన రాజు గారు.. తాను బయటపెట్టిన ఈ ఫిర్యాదుతో సీఐడీ సీరియస్ అవడం ఖాయమని కూడా, తొందరపడి ముందే కూశారు.

ఇంతకూ ఎవరా మేరీ రెడ్డి? ఎవరా మార్టిన్ లూథర్‌రెడ్డి? మేరీ రెడ్డి పచ్చళ్లు తయారుచేయడమేమిటి? ఆ సూత్రాన్ని రామోజీకి చెప్పడమేమటి? రామోజీ సదరు మేరీ రెడ్డికి, ప్రియా పచ్చళ్లలో వాటా ఇవ్వకపోవడం ఏమిటన్నది మాత్రం..రాజు గారికి కంప్లైంట్ చేసిన ఆకాశసీతక్క చెప్పలేదట. అలాగని రాజు గారూ చెప్పలేదు.

రాజు గారికి ఆ అజ్జాత ఆకాశసీతక్క పంపిన కామెడీ కంప్లైట్ సారాంశం ఇదీ.. దయచేసి కామెడీ అనుకోకుండా, భృకుటి ముడిచి, కన్నార్పకుండా .. రాజుగారు ఫార్వార్డ్ చేసిన కామెడీ కంప్లైట్ చదవండి.

రఘురామ రెడ్డి ఐపీఎస్ , డిఐజీ , సి ఐ డి గారికి ,
అయ్యా అప్పట్లో మా ఇంటికి అన్నదాత పత్రిక గురించి చెబుతా అని మా తాత గారి దగ్గరకు రామోజీ రావు గారు వచ్చారు.
మoచి పని చేస్తున్నావ్ , బోజనం చేయాల్సిందే అని ఆ భోజనంలో మా నాయనమ్మ చేసిన ఆవకాయ , గోంగూర పచ్చడి కూడా వడ్డించారు .
అయితే ….ఆ పచ్చళ్లు బాగా నచ్చిన రామోజీ రావు గారు మా అత్తయ్యలకు పంపటానికి తయారు చేసిన పచ్చళ్ల జాడీలను ఎత్తుకు పోయి …. మా తాత గారు అప్పుడప్పుడు మా నాయనమ్మను ప్రియ అని పిలుస్తారు , అలా ఆ రోజు పిలవగా విని – ఆ పేరు కూడా బాగుంది అని ; అదే పేరుతో పచ్చళ్లు పక్క ఊరిలో అమ్మి డబ్బు చేసుకున్నారు .
ఆ తర్వాత ఎంత ప్రయత్నం చేసినా ఆ రుచి రాక ; మా నాయనమ్మ గారి ఫార్ములా చెప్పమని , వ్యాపారంలో వాటా ఇస్తా అని బ్రతిమిలాడారు .
పోనీలే అని సహాయం చేస్తే – ఇస్తా అన్న వాటా ఇవ్వకుండా మోసం చేశారు .
అలా – ప్రియా పచ్చళ్లకు న్యాయమైన వారసులం మేమే .
అందువల్ల AP CID వారు అత్యవసరంగా యూరి రెడ్డి గారి కేసు నమోదు చేసిన మాదిరిగా మాకేసు కూడా నమోదు చేయగలరు అంతే వేగంతో. మాకు మీరే న్యాయం చేయగలరు . పైగా ఈ మోసం ఆంధ్రాలోనే జరిగింది . తెలంగాణ లో కాదు యూరి రెడ్డి /మార్గదర్శి మాదిరిగా .

ఇట్లు మేరీ రెడ్డి , వైఫ్ అఫ్ మార్టిన్ లూథర్ రెడ్డి , జొన్నపాడు , కృష్ణా జిల్లా

నాకు ఎవరో ఈ కంప్లైంట్ పంపారు. చాలా సీరియస్ మాటర్ అనిపించింది . సీఐడీ ఊరుకోదు. చూద్దాం ఏమి చేస్తారో ?

LEAVE A RESPONSE