Suryaa.co.in

National Telangana

యూజీసీ చైర్మన్ డాక్టర్ జగదీశ్వర్ తో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ జానయ్య భేటీ

న్యూఢిల్లీ: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ ఆల్ధాస్ జానయ్య బుధవారం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ డాక్టర్ జగదీశ్వర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు జాతీయ విద్యా విధానం యొక్క ప్రాధాన్యత, ఆవశ్యకతపై చర్చించారు. జాతీయ విద్యా విధానంపై ఉన్న పలు అపోహలను డాక్టర్. జగదీశ్వర్ ఈ సందర్భంగా నివృతి చేశారు.

అలాగే భవిష్యత్తు అవసరాల కనుగుణంగా వ్యవసాయ విద్యాలయం నిర్మాణంపై కూడా డాక్టర్. జగదీశ్వర్ పలు సూచనలు చేశారు. వచ్చేనెల 20వ తేదీన జరగనున్న వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవాలలో పాల్గొనవలసిందిగా ప్రొఫెసర్ జానయ్య చేసిన విన్నపానికి డాక్టర్ జగదీశ్వర్ సానుకూలంగా స్పందించారు. తాను ఈ కార్యక్రమంలో పాల్గొంటానని హామీ ఇచ్చారు.

వ్యవసాయ విశ్వవిద్యాలయం క్యాంపస్ లో నూతనంగా నిర్మించ తలపెట్టిన బాలికల వసతి గృహ నిర్మాణానికి యు జి సి తమవంతు సహకారాన్ని అందిస్తుందని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఇరువురి మధ్య తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకొని.. తమ గ్రామంలో తాము గడిపిన రోజులను వారు గుర్తు చేసుకున్నారు. యూజీసీ చైర్మన్ డాక్టర్ జగదీశ్వర్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య లది నల్గొండ జిల్లాలోని మామిడాల గ్రామం కావటం విశేషం.

LEAVE A RESPONSE