కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థలను “నరేంద్ర మోడీ జేబు సంస్థలుగా” మార్చుకొని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులైన సోనియా గాంధీ రాహుల్ గాంధీ లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ద్వారా నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ అక్రమ కేసులు బనాయించి నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని బిజెపి కక్ష సాధింపు ధోరణితో అధికార దుర్వినియోగానికి పాల్పడటాన్ని దేశ ప్రజలు గమనిస్తున్నారు!
బీజేపీ అధికార దాహంతో మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రతిపక్షాల గొంతు నొక్కి భారతదేశ ఆర్థిక వ్యవస్థను కుక్కలు చింపిన విస్తరిలా చేసింది. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను బిజెపి పార్టీ సంస్థలుగా మార్చిన ఘనత ప్రధానమంత్రికే దక్కుతుంది!
భారత దేశ వ్యాప్తంగా మోడీ గ్రాఫ్ రోజురోజుకీ పడిపోతుంది దేశ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీయే దేశానికి శ్రీరామరక్ష అన్న నినాదంతో రాబోయే రోజులలో బిజెపికి తగిన గుణపాఠం నేర్పబోతున్నారు!దేశ ప్రధాని హోదాలో ప్రతిపక్షాల పై విషం చిమ్ముతూ వాస్తవాలు ప్రజలకు తెలియకుండా దర్యాప్తు సంస్థల ముసుగులో ప్రతిపక్షాలపై దాడులు చేస్తూ దేశాన్ని ముక్కలు చేసే ఈ ప్రయత్నాన్ని దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో ఖండించాలి.మోదీ షా నాయకత్వంలోని బిజెపి దిగజారుడు రాజకీయాలతో “చీప్ ట్రిక్స్” తో దేశవ్యాప్తంగా కమలం వాడిపోతుంది.
కాంగ్రెస్ హయాంలో దేశ ప్రధానిలుగా ఎంతో మంది సమర్థవంతంగా పనిచేసారు దేశ ఆర్థిక అభివృద్ధి ని ప్రపంచ దేశాల స్థాయికి తీసుకెళ్లారు కానీ బిజెపి హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ కుక్కలు చింపిన విస్తరిలా మారింది. సోనియా గాంధీ,రాహుల్ గాంధీ లపై అక్రమంగా బనాయించిన ఈడి కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.