Suryaa.co.in

Andhra Pradesh

సైకో పాలన పోతేనే… రాష్ట్రంలో మహిళలకు రక్షణ

-ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళా ద్రోహి
-కల్తీ మద్యం తెచ్చి మహిళల మాంగల్యాలను తెంచుతున్నాడు
-పూతలపట్టు నియోజకవర్గం కొండ్రాజు కాల్వలో మహిళలతో యువనేత నారా లోకేష్ ముఖాముఖి

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళా ద్రోహి. ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కాడు. మహిళలకు జగన్ ప్రభుత్వంలో భద్రత లేకుండాపోయింది. జగన్ పాలనలో 900 మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయి. 52,587మంది మహిళలపై దాడులు జరిగాయి. మహిళలపై దాడుల్లో ఏపీ మొదటి స్థానంలో ఉందని కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి.కల్తీ మద్యం తెచ్చి మహిళల మాంగల్యాలను తెంచుతున్నాడు. మద్యపాన నిషేధం హామీని గాలికొదిలేశాడు. వైసీపీ మహిళా మంత్రులకు మహిళలంటే గౌరవం లేదు.జగన్ ప్రభుత్వానికి మహిళల భద్రత ఏమాత్రం పట్టడం లేదు.దిశచట్టం, 21రోజుల్లో ఉరిశిక్ష అంటూ మహిళలను మోసం చేస్తున్నాడు. సైకో పాలన పోతేనే… రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఉంటుంది.

మహిళలు, రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు గురించి మాట్లాడుతుంటే బంగారుపాళ్యంలో నాపై పోలీసులు కేసు పెట్టారు. బంగారుపాళ్యం కేసుతో నాపై ఇప్పటికి 16కేసులు జగన్ ప్రభుత్వం పెట్టింది. వైఎస్.రాజశేఖరరెడ్డి, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే చంద్రబాబు పూర్తిగా సహకరించి భద్రత కల్పించారు.కానీ జగన్ ప్రభుత్వం మాత్రం నా పాదయాత్రకు 29షరతులు పెట్టి ఇరుకునపెట్టాలని చూస్తోంది. అయినప్పటికీ ప్రజల తరపున మాట్లాడేందుకు రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కును వినియోగిస్తూ యువగళం పాదయాత్ర చేపట్టాను.వైసీపీ నాయకులు, పోలీసులు ఏకమై రాష్ట్ర ప్రజలను హింసిస్తున్నారు. నిత్యావసర ధరలు పెంచి సామాన్యుల కుటుంబాలను జగన్ ప్రభుత్వం గుల్ల చేస్తోంది.

చంద్రబాబు సీఎం అయిన వెంటనే పన్నులు తగ్గించి నిత్యావసరాల ధరలను తగ్గిస్తారు.మహిళలకు విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయ రంగాల్లో సమాన అవకాశాలు అందించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. 2024లో చంద్రబాబును ముఖ్యమంత్రిగా గెలిపించుకుని మహిళలు తమ హక్కుల్ని కాపాడుకోవాలి.

LEAVE A RESPONSE