మంత్రి విశ్వరూప్ ఇంటిపై దాడి..

Spread the love

ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే కోనసీమ రణ క్షేత్రంగా మారింది. ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనంతటికీ కారణం.. జిల్లా పేరు మార్చడమే. అవును.. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సర్కార్.. కోనసీమ జిల్లాను ఏర్పాటు చేసింది. అంతా సవ్యంగా ఉన్న క్రమంలో..

కోనసీమ జిల్లా పేరును బీఆర్ అంబేద్కర్ జిల్లాగా మారుస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఇదే కోనసీమ వాసులకు ఆగ్రహం తెప్పింది. కోనసీమనే ముద్దు.. మరే పేరు వద్దు అంటూ ప్రభుత్వ
amalapuram నిర్ణయానికి వ్యతిరేకంగా కోనసీమ సాధన సమితి గళమెత్తింది. ఈ క్రమంలో భారీ ర్యాలీకి పిలుపునిచ్చింది.వందల సంఖ్యలో జనాలు తరలిరావడంతో పరిస్థితి అదుపు తప్పింది. కలెక్టరేట్‌ ముట్టడికి యువకులు, నిరసనకారులు ప్రయత్నించారు. కోనసీమ సాధన సమితి పిలుపు నేపథ్యంలో

పోలీసులు అమలాపురం వ్యాప్తంగా 144 విధించారు. అమలాపురం మొత్తాన్ని అష్టదిగ్భంధనం చేశారు. అయినప్పటికీ వెనక్కి తగ్గలేదు నిరసనకారులు. ఒక దశలో పోలీసులతో తీవ్ర ఘర్షణకు దిగిన ఆందోళనకారులు.. వారిపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో 20 మందికిపైగా పోలీసులు గాయపడ్డారు. ఆ

తరువాత పోలీసులను తప్పించుకుని వచ్చిన ఆందోళనకారులు.. కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన టెంట్‌ ను ధ్వంసం చేశారు. కలెక్టర్ రేట్ ఎదుట ఒక బస్సును దగ్ధం చేశారు.

మంత్రి విశ్వరూప్ ఇంటిపై దాడి..
మంత్రి విశ్వరూప్‎కు నిరసన సెగ తగిలింది. కోనసీమ జిల్లాను కొనసాగించాలని జేఏసీ నేతలు, స్థానిక యువకులు ఆందోళనకు దిగారు. కోనసీమ జిల్లా పేరు మార్పు చేయొద్దంటూ మంత్రి విశ్వరూప్ ఇంటి వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మంత్రి విశ్వరూప్ ఇంటిపై రాళ్ల దాడి చేశారు. అక్కడ ఉన్న కార్లకు

నిప్పు అంటించారు. మంత్రి విశ్వరూప్ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో మంత్రి విశ్వరూప్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరోవైపు మంత్రి విశ్వరూప్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Leave a Reply