Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు అక్రమ అరెస్ట్ పై 39వ రోజూ కొనసాగిన నిరసనలు

టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ టీడీపీ శ్రేణుల నిరసనలు 39వ రోజూ కొనసాగాయి. అద్దంకి నియోజకవర్గం సంతమాగలూరు మండలంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ 14వ రోజు సైకిల్ యాత్ర చేపట్టారు.

కొత్తపేటలో తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు కుమారుడు బండారు సంజీవ్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు కొత్తూరు సెంటర్ హనుమాన్ ఆలయం నుంచి చింతలూరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం చింతలూరు వెంకటేశ్వర స్వామి ఆలయ సోపానాలను మోకాళ్ళపై ఎక్కి శ్రీనివాసుని దర్శించుకున్నారు.

అనంతపురం అర్బన్ లో తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వప్న ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామచంద్రపురంలో తెలుగుమహిళలు బాలాత్రిపుర సుందరి సమేత అగస్త్యేశ్వరస్వామి, ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. కదిరిలో మరకత మహాలక్ష్మి అమ్మ వారికి తెలుగుదేశం పార్టీ మహిళ నాయకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కోనసీమజిల్లా ఆలమూరు మండల కేంద్రంలో తెలుగుమహిళలు జనార్థన స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని వేదపారాయణం చేసి చంద్రబాబు నాయుడు త్వరగా జైలునుండి విడుదల కావాలని జనార్థనస్వామిని వేడుకోవడం జరిగింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 55వ డివిజన్ లో కనకదుర్గమ్మ వారి సన్నిధిలో పూజా కార్యక్రమాలు జరిపించడం జరిగింది.

చిలకలూరిపేట నియోజకవర్గం గణపవరంలో శ్రీపతి అనే తెలుగుదేశం కార్యకర్త చంద్రబాబుపై ప్రత్యేక అభిమానం చాటుకుంటూ చేపట్టిన వినూత్న నిరసన చేశారు. కాట్రూ శ్రీపతి మనవరాలు శివజోషిత ఓణీల మహోత్సవం జరిగింది. జోషిత కుటుంబసభ్యులు, తెదేపా నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రత్తిపాటి చంద్రబాబుకు మద్దతుగా ప్లకార్డులు పట్టుకుని సంఘీభావం తెలిపారు.

LEAVE A RESPONSE