– అధికారులకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశం
బనగానపల్లె: అవుకు సమీపంలోని తిమ్మరాజు రిజర్వాయర్ ఆయకట్టు కింద ఉన్న బిళ్ళగడ్డ పొలాలకు సంబంధించిన అవుకు, చెర్లోపల్లె గ్రామాల రైతులు కొన్నేళ్ళుగా తీవ్రమైన సాగు నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు.. ఆయా రైతుల పంట పొలాలకు సాగునీటి సరఫరా సరిగా లేకపోవడంతో వలన ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో సాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ తిమ్మరాజు చెరువు నీటి సంఘం ప్రతినిధులు, ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట రమణ నాయక్ రైతులతో కలిసి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళారు.
ఈ సమస్యపై సానుకూలంగా స్పందించిన మంత్రి బీసీ తక్షణమే రెవెన్యూ అధికారులు, ఎస్ఆర్బీసీ కెనాల్ అధికారులకు సాగునీటి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో అధికారులు వెనువెంటనే స్పందించి రైతులకు తాత్కాలిక పరిష్కారం చూపారు. ఈ నేపథ్యంలో సోమవారం మళ్లీ క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసిన రైతులు తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. దీంతో మరోసారి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఎస్ఆర్బీసీ అధికారులతో ఫోన్ లో మాట్లాడి శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో అవుకు, చెర్లోపల్లి గ్రామ రైతులు మంత్రి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చెర్లోపల్లి, అవుకు గ్రామ రైతులు పాల్గొన్నారు.