Suryaa.co.in

Andhra Pradesh

సైకో జగన్ ది జేసిబి పరిపాలన

– అశోక్ లేలాండ్ లాంటి అనేక కంపెనీలు
– జగన్ పాలనలో బాదుడే బాదుడు
– వైసిపి నేతలు మట్టి తవ్వుకుంటున్నారు తప్ప ఇళ్లు కట్టలేదు
– రూ.200 పెన్షన్ ని రూ. 2000 కి పెంచింది టీడీపీ
– ఉమ్మడి కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం మల్లవల్లి గ్రామస్తులతో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్

టిడిపి హయాంలో ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటు చేశారు. పేదలకు ఇళ్లు కట్టడానికి 100 ఎకరాలు కేటాయించారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ భూముల్లో వైసిపి నేతలు మట్టి తవ్వుకుంటున్నారు తప్ప ఇళ్లు కట్టలేదు. టిడిపి హయాంలో పసుపు కుంకుమ కింద 20 వేలు ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం లో మాకు సాయం అందలేదు. ఉన్న పండుగ కానుకలు కూడా జగన్ ప్రభుత్వం ఆపేసింది.

ఇళ్లు నిర్మించుకున్న వారికి జగన్ ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదు. గ్రామంలో కొన్ని కాలనీల్లో సిసి రోడ్లు, డ్రైనేజ్, తాగునీరు లేదు. జగన్ ప్రభుత్వం మల్లవల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ని నాశనం చేసింది. మాకు ఉద్యోగాలు లేకుండా చేశారు. ఉన్న కంపెనీలు అన్ని ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయి. జగన్ పాలనలో 2 వేల మందికి ఉద్యోగాలు కల్పించిన అశోక్ లేలాండ్ కంపెనీ వెళ్ళిపోయింది. గ్రామంలో వైఎస్ఆర్ జలకళ కింద బోర్లు వేస్తాం అని లంచం తీసుకొని బోర్లు వెయ్యకుండా మోసం చేశారు.  -మల్లవల్లి గ్రామస్తులు

లోకేష్ మాట్లాడుతూ.. టిడిపి సైకిల్ కి రెండు చక్రాలు. ముందు చక్రం సంక్షేమం, వెనుక చక్రం అభివృద్ది. రూ.200 పెన్షన్ ని రూ. 2000 కి పెంచింది టిడిపి. పండుగ కానుకలు, పెళ్లి కానుక, పసుపు కుంకుమ,చంద్రన్న భీమా లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది టిడిపి.

మల్లవల్లి లో 1400 ఎకరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం లో ఉన్నప్పుడు కొంత మంది నాయకులు భూములు కొట్టేయడానికి ప్రయత్నిస్తే పోరాడింది టిడిపి. మల్లవల్లి లో భూములు కాపాడి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటు చేసింది టిడిపి. జగన్ విధ్వంసం తో పరిపాలన మొదలు పెట్టాడు. ప్రజవేదిక కూల్చి పరిపాలన మొదలు పెట్టాడు. సైకో జగన్ ది జేసిబి పరిపాలన.

మీరు పాలిచ్చే ఆవుని వద్దనుకొని తన్నే దున్నపోతు ని తెచ్చుకున్నారు.మల్లవల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో 75 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కేవలం సైకో పాలన వలన పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. అశోక్ లేలాండ్ లాంటి అనేక కంపెనీలు తీసుకొస్తే జగన్ ఆ కంపెనీలను తరిమేస్తున్నాడు.

నిరుపేద కుటుంబాలకు ఇవ్వడానికి టిడిపి ప్రభుత్వం మల్లవల్లి లో 100 ఎకరాలు కేటాయించింది. జగన్ ప్రభుత్వం వచ్చి కనీసం ఆ భూముల్లో పేదలకు ఇళ్లు కట్టలేదు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మల్లవల్లి లో పేదలకు కేటాయించిన 100 ఎకరాల్లో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తాం.

జగన్ పాలనలో బాదుడే బాదుడు. విద్యుత్ ఛార్జీలు 9 సార్లు, ఆర్టీసి ఛార్జీలు 3 సార్లు, పెట్రోల్ , డీజిల్ ధరలు, చెత్త పన్ను, ఇంటి పన్ను విపరీతంగా పెంచేశాడు.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నిత్యావసర సరుకుల ధరలు, పెంచిన పన్నులు, విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ తగ్గిస్తాం.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో మహిళలకి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం. ఆడ బిడ్డ నిధి కింద మహిళలకు నెలకు రూ.1500 ఇస్తాం. ఆర్టీసి లో ఉచిత ప్రయాణ.
ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి విద్యకు సహాయం అందిస్తాం. ఒక బిడ్డ ఉంటే రూ.15 వేలు. ఇద్దరు ఉంటే రూ.30 వేలు ఇస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మల్లవల్లి లో పెండింగ్ లో ఉన్న సిసి రోడ్లు, డ్రైనేజ్ ఏర్పాటు చేస్తాం. సురక్షిత తాగునీరు అందిస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మల్లవల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ కి పెద్ద ఎత్తున కంపెనీలు తీసుకొచ్చి స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తాం.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయానికి ఎన్టీఆర్ జలకళ ద్వారా బోర్లు ఏర్పాటు చేస్తాం.మల్లవల్లి లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తాం. సైకిల్ పాలన కావాలా లేక జేసిబి పరిపాలన కావాలో మీరు ఆలోచించండి. మల్లవల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ బాధితులకు న్యాయం చేసే బాధ్యత నాది. అర్హులు అందరికీ న్యాయం చేస్తాం.

యార్లగడ్డ వెంకట్రావ్:
మల్లవల్లి గ్రామంలో భూముల సమస్య నాకు తెలుసు. టిడిపి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సమస్య పరిష్కరిస్తాం.

సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించిన బీసీ ద్రోహి జగన్

– నారా లోకేష్ ను కలిసిన గౌడ సామాజికవర్గీయులు
గన్నవరం నియోజకవర్గం సింగన్నగూడెం గౌడ సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• మా గ్రామంలో గౌడ సామాజికవర్గం అధికంగా ఉన్నాం, మాకు కమ్యూనిటీ హాలు నిర్మించాలి.
• గ్రామంలోని గౌడ కులస్తులకు పనిముట్లు అందించాలి.
• కల్లుగీత కార్మికులకు గుర్తింపు కార్డులు, సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలి.
• సింగన్న గ్రామంలోని ఎట్టివాగుపై 7కి.మీ వద్ద హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలి.
• గ్రామంలో ఇంటర్నల్ రోడ్లను సీసీ రోడ్లుగా మార్చాలి. గూడెం రెవెన్యూ గ్రామానికి ప్రత్యేకంగా ఫెయిర్ అడంగల్ మంజూరు చేయాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక గౌడలతోపాటు అన్ని బిసి కులాలకు నిర్లక్ష్యం చేశారు.
• కులానికొక కుర్చీలేని కార్పొరేషన్ ఏర్పాటుచేసి తీరని అన్యాయం చేశాడు.
• బీసీలకు చెందాల్సిన రూ.75,790 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించిన బిసిద్రోహి జగన్.
• టిడిపి అధికారంలోకి వచ్చాక సింగన్నగూడెంలో గౌడలకు కమ్యూనిటీ హాలు నిర్మిస్తాం.
• గౌడ కులస్తులకు ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందిస్తాం.
• కల్లుగీత కార్మికులకు గుర్తింపు కార్డులుఇచ్చి సబ్సిడీ రుణాలు, చంద్రన్నబీమా అమలుచేస్తాం.
• ఎట్టివాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు చేపడతాం.
• గ్రామాల్లో ఇంటర్నల్, లింకు రోడ్ల నిర్మాణం చేపడతాం.

నిలిచిపోయిన అభివృద్ధి పనులను పూర్తిచేస్తాం

– నారా లోకేష్ ను కలిసిన రంగన్నగూడెం గ్రామస్తులు
గన్నవరం నియోజకవర్గం రంగన్నగూడెం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• వీరవల్లి-రంగన్నగూడెం గ్రామాల మధ్య 332క్రాసింగ్ గేటు వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం త్వరగా ప్రారంభించాలి.
• వీరవల్లి-వట్టిగుడిపాడు రోడ్డు 7 మీటర్ల వెడల్పుకు పెంచి నిర్మించాలి.
• రంగన్న గూడెం-వేలేరు వెళ్లే మండల పరిషత్ లింకు రోడ్డు నిర్మాణం పనులు చేపట్టాలి.
• రంగన్న గూడెం గ్రామంలోని అంతర్గత రోడ్లను సీసీ రోడ్లు గా మార్చాలి.
• పోలవరం కుడి ప్రధాన కాలువ 129 కి.మీ వద్ద స్లూయిస్ నిర్మించాలి.
• పోలవరం కుడి ప్రధాన కాలువ 130కి.మీ వద్ద ఆర్ అండ్ రోడ్డు ప్రక్కన స్లూయిస్ నిర్మించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• జగన్మోహన్ రెడ్డి చేతగాని, దివాలాకోరు పాలన గ్రామాలకు శాపంగా పరిణమించింది.
• గ్రామపంచాయితీలకు కేంద్రం ఇచ్చిన ఫైనాన్స్ కమిషన్ నిధులు రూ.9వేలకోట్లను జగన్ ప్రభుత్వం దొంగిలించింది.
• దీంతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయి, కనీసం మంచినీళ్లు ఇచ్చే పరిస్థితి కూడా లేదు.
• గత టిడిపి హయాంలో 25వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 30లక్షల ఎల్.ఈ.డీ వీధిదీపాలు వేశాం.
• గ్రామాల్లో రోడ్లు, లింకు రోడ్లు, ఇంటర్నల్ రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.
• వైసీపీ పాలనలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేస్తాం.
• పోలవరం కుడి ప్రధాన కాలువపై అవసరమైన ప్రాంతాల్లో స్లూయిస్ లు నిర్మిస్తాం.

LEAVE A RESPONSE